మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?


మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?

మన

జమ్ము కశ్మీర్ పోలీసు బలగంలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన అధికారి దవీందర్ సింగ్ ను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఆయన తన కారులో ఇద్దరు పేరుమోసిన తీవ్రవాదులను తీసుకుపోతుండగా శ్రీనగర్ – జమ్ము రహదారిలో అడ్డుకుని అరెస్టు చేశామని, శ్రీనగర్ లోని ఆయన ఇంట్లో సోదా చేస్తే మూడు అక్రమ ఆయుధాలు దొరికాయని అంటున్నారు. ఆయన తీవ్రవాదుల పోషకుడూ రక్షకుడూ వారి చేత తీవ్రవాద కార్యకలాపాలు చేయిస్తున్నవాడూ అని తేలిందని అంటున్నారు. వీటి నిజానిజాలు, వివరాలు త్వరలోనే బైట పడతాయి గాని ఈ సందర్భంగా ఈ పోలీసు అధికారి పేరు ʹపార్లమెంట్ దాడిʹ కేసులో, అఫ్జల్ గురును ఉరితీసిన కేసులో కూడ బైటికి వచ్చిందని గుర్తు తెచ్చుకోవాలి.

వైద్యపరికరాల వ్యాపారంలో తాను ఎప్పుడూ ఢిల్లీ వెళ్లి వస్తుంటాను గనుక, ఢిల్లీ బాగా తెలుసు గనుక ఢిల్లీలో ఒక గది చూసి పెట్టమని తనను దవీందర్ సింగ్ ఒత్తిడి చేశాడని, ఆ గది ఎవరికోసమో కూడ తనకు తెలియదని, పార్లమెంటు మీద దాడి చేశారని చెపుతున్న తీవ్రవాదులు ఆ గదిలో దొరకడం అనే ఏకైక ఆరోపణతో తనను ఆ కేసులో ఇరికించారని అఫ్జల్ గురు కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆ మాటా నమ్మలేదు, దవీందర్ సింగ్ ను విచారించనూ లేదు. దవీందర్ సింగ్ కు అత్యున్నత స్థాయి పతకం కూడ ఇచ్చారు. అఫ్జల్ గురు నేరం చేశాడని నిర్ధారించి ఉరి తీశారు. ఇప్పుడు దవీందర్ సింగ్ రెడ్ హాండెడ్ అరెస్టు అసలు తీవ్రవాదులను పోషిస్తున్నదీ, కాపాడుతున్నదీ, సరఫరా చేస్తున్నదీ ఎవరో తేటతెల్లం చేస్తున్నది.

భారత రాజ్యమూ, న్యాయవ్యవస్థా, అమాయకంగా నమ్మిన మధ్యతరగతీ తమ చేతులకు అంటిన అమాయకపు అఫ్జల్ గురు నెత్తుటి మరకలను కడుక్కోవడానికి ఎన్ని సముద్రాల జలాలు సరిపోతాయి?

- ఎన్. వేణుగోపాల్, ఎడిటర్, వీక్షణం.

ఫేస్‌బుక్ పోస్ట్ : https://www.facebook.com/nvenugopal.rao/posts/10156654939391700

Keywords : Davinder Singh, Afzal Guru, Terrorist, Links, Parliament Attack
(2020-02-16 03:17:06)No. of visitors : 1146

Suggested Posts


0 results

Search Engine

ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం
క్యాంపస్‌లోకి చొరబడి అమ్మాయిలపై గూండాల‌ వికృత చేష్టలు...భగ్గుమన్న విద్యార్థి లోకం
ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు
షాహీన్ బాగ్: అంబులెన్స్, స్కూల్ బస్ లను ఆపుతున్నదెవరు ?
కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు
భక్తులే కాదు బాస్ కూడా వాట్సప్ యూనివర్సిటీయే
ʹనా కొడుకు మోడీ, అమిత్‌షాల మద్దతుదారుడుʹ
గృహనిర్బంధం ముగిసే కొన్ని గంటల ముందు వీళ్ళద్దరిపై దుర్మార్గమైన కేసులు
In Death, A Starʹs Dawn – GauriLankesh on Com Saketh Rajan
బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌
CAA,NRCలకు వ్యతిరేకంగా గ్రామపంచాయితీ సంచలన తీర్మానం
నీ లోపలి దెయ్యాన్ని పెరగనివ్వకు..
నకిలీ వీడియోలు తయారు చేస్తున్న బీజేపీ... ప్రచారం చేస్తున్న మీడియా
దేశంలో లవ్ జీహాద్ లేదు...పార్లమెంటుకు చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
CAAకు వ్యతిరేకంగా సియాటెల్‌ నగర కౌన్సిల్‌ తీర్మానం
పంజాబ్: CAAకు వ్యతిరేకంగా 20వేలమంది రైతులు, మహిళల ర్యాలీ
దేశమంతటా ʹషాహీన్ బాగ్ʹ లు పుట్టుకురావాలి..!!
రాజకీయ నాయకుల దుర్మార్గం : అక్కా చెల్లెళ్లను తాళ్ళతో కట్టేసి ఈడ్చుకెళ్లారు
మా దొర అవ్వల్ దర్జ, మాటంటె తల గోసుకుంటడు - ఎన్.వేణుగోపాల్
మానవత్వంపై మళ్ళీ మతోన్మాద తూటా...షహీన్ బాగ్ ఉద్యమకారులపై కాల్పులు
CAA, NRC నిరసనల్లో హిందూ చైర్మన్ ఎన్.రామ్
more..


మన