ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్


ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్

ఈ

" ఈరోజు మనం అంతా ఒక్కటిగా నిలబడ్డాం. మనల్ని నిర్బంధించడానికి ఎంత పెద్ద నిర్బంధకేంద్రమూ సరిపోదు. ఎంత పెద్ద ఎత్తున గోడలు లేపినా మన ముందు అవి ఆగలేవు. ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వమే ఆ నిర్బంధకేంద్రంలోకి నెట్టేయ్యబడుతుంది. జాతిని విడగొట్టి పడగొట్టేయాలని చూస్తోన్న ఈ ప్రభుత్వమే నిర్బంధంలోకి వెళ్తుంది. స్వాతంత్యం వచ్చిన తరువాత భారత దేశ పౌరులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఈ పౌరసత్వ బిల్లు. దాన్ని అందరూ ఐక్యంగా వ్యతిరేకించాలి. ఎన్‌పీఆర్ కోసం ప్రజలంతా తప్పుడు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఈ జాతీయ పౌర జాబితాలో నమోదైన వివరాలు జాతీయ పౌరసత్వ సవరణ జాబితాకి కావాల్సిన సమాచారాన్నంతా సమకూర్చి పెట్టి వారి పనిని మరింత సులభతరం చేస్తాయి. ఇది ʹచిరునవ్వుతోనే పౌర సహాయ నిరాకరణʹ. విద్యార్థులే ఈ విద్వేషాన్ని ఓడిస్తారు. ఇంక్విలాబ్ జిందాబాద్, జమియా జిందాబాద్, జె ఎన్ యు జిందాబాద్ దేశప్రజలు వర్ధిల్లాలి" అని ప్రముఖ రచయిత్రి, సీనియర్ జర్నలిస్ట్ అరుంధతీ రాయ్ అన్నారు.

జమియా మిలియా విశ్వవిద్యాలయం 7వ నెంబర్ గేటు దగ్గర సీఏఏ, ఎన్‌సీఆర్‌లకు వ్యతిరేకంగా, తమ మీద జరిగిన దాడులకు నిరసనగా నిరవధిక దీక్ష చేస్తోన్న జమియా విద్యార్థుల్ని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ శనివారం కలిసి , వారి దీక్షలో పాల్గొన్నారు. " నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీతోనే వున్నాను అని చెప్పడానికే ఇక్కడకు వచ్చాను" అని పేర్కొన్నారు. ఆమె నినాదాలతో విద్యార్థులు ఉత్సాహంగా గొంతు కలిపారు. విద్యార్థులు నడుపుతున్న సార్వత్రిక గ్రంధాలయానికి తాను రాసిన పుస్తకాల్ని ఆమె విరాళంగా ఇచ్చారు.

Keywords : Arundhati Rai, CAA, NPR, NCR, Jamia Milia University
(2020-02-16 10:05:06)No. of visitors : 274

Suggested Posts


0 results

Search Engine

ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం
క్యాంపస్‌లోకి చొరబడి అమ్మాయిలపై గూండాల‌ వికృత చేష్టలు...భగ్గుమన్న విద్యార్థి లోకం
ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు
షాహీన్ బాగ్: అంబులెన్స్, స్కూల్ బస్ లను ఆపుతున్నదెవరు ?
కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధాన్నినిరసిస్తూ విమానంలో నిరసనలు
భక్తులే కాదు బాస్ కూడా వాట్సప్ యూనివర్సిటీయే
ʹనా కొడుకు మోడీ, అమిత్‌షాల మద్దతుదారుడుʹ
గృహనిర్బంధం ముగిసే కొన్ని గంటల ముందు వీళ్ళద్దరిపై దుర్మార్గమైన కేసులు
In Death, A Starʹs Dawn – GauriLankesh on Com Saketh Rajan
బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌
CAA,NRCలకు వ్యతిరేకంగా గ్రామపంచాయితీ సంచలన తీర్మానం
నీ లోపలి దెయ్యాన్ని పెరగనివ్వకు..
నకిలీ వీడియోలు తయారు చేస్తున్న బీజేపీ... ప్రచారం చేస్తున్న మీడియా
దేశంలో లవ్ జీహాద్ లేదు...పార్లమెంటుకు చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
CAAకు వ్యతిరేకంగా సియాటెల్‌ నగర కౌన్సిల్‌ తీర్మానం
పంజాబ్: CAAకు వ్యతిరేకంగా 20వేలమంది రైతులు, మహిళల ర్యాలీ
దేశమంతటా ʹషాహీన్ బాగ్ʹ లు పుట్టుకురావాలి..!!
రాజకీయ నాయకుల దుర్మార్గం : అక్కా చెల్లెళ్లను తాళ్ళతో కట్టేసి ఈడ్చుకెళ్లారు
మా దొర అవ్వల్ దర్జ, మాటంటె తల గోసుకుంటడు - ఎన్.వేణుగోపాల్
మానవత్వంపై మళ్ళీ మతోన్మాద తూటా...షహీన్ బాగ్ ఉద్యమకారులపై కాల్పులు
CAA, NRC నిరసనల్లో హిందూ చైర్మన్ ఎన్.రామ్
more..


ఈ