విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!


విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!

విద్వేషం

జేఎన్‌యూలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు మాస్టర్ మైండ్ ఆ యూనివర్సిటీ వీసీ జగదీష్ కుమార్ అని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఈ సందర్భంగలో వీసీని గతంలో అమీర్ మాలిక్ అనే సీనియర్ జర్నలిస్టు చేసిన రిపోర్టు ఒకటి మళ్లీ వెలుగులోనికి వచ్చింది. ఆ కథనాన్ని మోహన సుందరం తెలుగులో అనువదించి తన ఫేస్‌బుక్ వాల్‌పై పెట్టారు. ఆ పోస్టు యధాతథంగా...

-----------------------------------------------------------------------------------------
JNU వీసీ మామిడాల జగదీష్ కుమార్‌తో ఓ ముఖాముఖి లాంటి ఘటన

- అమీర్ మాలిక్ ( సీనియర్ జర్నలిస్ట్ )
------------------------------------------------------------------------------------------
JNU విద్యార్థుల మీద అమానుష దాడి జరిగిన నేపథ్యంలో JNU వీసీ ని తొలగించాలనే డిమాండ్ తో ఆందోళన జరుగుతున్న సందర్భంగా రెండేళ్ల క్రితం నేను ఉపకులపతి మామిడాల జగదీష్ కుమార్ తో జరిపిన ఓ ముఖాముఖి గుర్తుకొస్తుంది.

ఆరోజు ఆయన భాషా విజ్ఞాన భవనం, సాంస్కృతిక అధ్యయన భవనాల పక్కనుంచి అధికార పాలనా భవనాల పక్కాగా నడిచి వెళ్తున్నప్పుడు అనుకోకుండా నేను అక్కడ ఉండటం జరిగింది. ఆయన ఫ్రీడమ్ గ్రౌండ్ చేరుకునేలోపు చిన్న అవకాశాన్ని చేజిక్కించుకొని ఆయనతో నాలుగు మాటలు మాట్లాడే వీలు చిక్కింది. మేం కేవలం 200 మీటర్ల మేర మాత్రమే కలిసి నడవగలిగాం. ఆ కాస్త సమయంలోనే JNU గురించి ఒక డజను ప్రశ్నలు అడగగలిగాను. సరిగ్గా ఆ సమయంలోనే విశ్వవిద్యాలయంలో విద్యార్థుల వ్యక్తిగత హాజరు తప్పనిసరి చేయడానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. ʹ హాజరు తప్పనిసరి అనే నియమాన్ని ఎందుకుపెట్టారు ?ʹ అని నేనడిగితే , దానికాయన " మేం తప్పనిసరి అని విధించలేదు. బలవంతంగా రుద్దడానికి మేం వ్యతిరేకం. ఆ నిర్ణయం AC మీటింగ్ లో తీసుకోవడం జరిగింది. " అని చెప్పారు. కానీ ఆ సమావేశం పూర్తి సారాంశం మార్చివేసి తమకు తప్పుడు ప్రతిని ఇచ్చారని విద్యార్థి సంఘం చెబుతోంది. ఆనాటి సమావేశంలో చర్చించాల్సిన విషయాల్లో విద్యార్థుల హాజరు అంశం లేనేలేదని చెబుతున్నారు. అది కేవలం వీసీ తీసుకున్న ఏకపక్ష, మొండి నిర్ణయం అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అసలు విశ్వవిద్యాలయంలో హాజరు తప్పనిసరిగా ఎందుకుండాలో తెల్సుకోవాలనుకుంటున్నాను ? అని నేను అడిగితే
" ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలన్నింటిలో హాజరు నియమం ఉంది " అని చెప్పారు. ʹ చదవాలా, ఒద్దా అనే అంశాన్ని విద్యార్థులకే వొదిలేయాలి కదా ? విద్యార్థుల్ని కాగితాల మీద సంతకాలు పెట్టమని ఒత్తిడి చేయడం.. అది వారి ఎదుగుతున్న మనస్తత్వానికి చెందిన పరిపక్వతకి హద్దులు గీస్తూ విశ్వవిద్యాలయాల ప్రామాణిక సూత్రాలనే ఉల్లంఘించడం కాదా ? ʹ అని అడిగితే
" అణగదొక్కబడిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు తమంతట తాము చదువుకోలేక వెనుకబడి పోతారు. అందుకే హాజరు తప్పనిసరి చేశాం " అని చెప్పారు. అంటే వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు సరిగ్గా చదవరు అనే ఆయన ఉద్దేశం. దేశంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయం ఉపకులపతి అమూల్యమైన ఆలోచన సరళి ఇది.. !

ఇదొక్కటే కాదు ఆయన వీసీ అయినప్పటినుంచీ పేద వర్గాల విద్యార్థులు వర్సిటీలోకి ప్రవేశించడానికి ఉన్న మార్గాలన్నింటినీ మూసేస్తూ వచ్చారు. అనేక నియమాలను రద్దు చేసేశారు. ʹ JNU లో రిజర్వేషన్లు, పేద, మహిళా వర్గాలకు మేలు చేసే ప్రత్యేకమైన వెసులుబాట్లన్నీ రద్దు చేసేశారు? ఇంకా మౌఖిక పరీక్ష(viva)లో ఎందుకు 100 మార్కుల నియమాన్ని విధించారు? కుల, మత,భాషా పరంగా విద్యార్థుల్ని అణిచివేయడానికీ, ఇన్క్ మనకి కావాల్సిన వారికీ, కూలీన వర్గాలకు మేలుచేసుకోవడానికే కదా ఈ నియమాలు జాతీయ రహదారుల్లాగా ఉపయోగపడుతున్నాయి ?ʹ అని అడిగితే ఆయన కిక్కురుమనలేదు. అలాగే UGC గెజిట్ ని గుర్తుచేసుకున్నాను. అధ్యాపకులకు పని ఒత్తిడి ఎక్కువవుతుందనే సాకుతో ఎంఫిల్, పి ఎచ్ డీ ల్లో 1300 సీట్లని ఇతడు రద్దుచేసేశాడు. దీనివలన అనేకమంది విద్యార్థులు తమ పరిశోధనల కలల కేంద్రమైన JNU లోకి ప్రవేశించే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయారు. ʹ ఎందుకలా చేశారు ?ʹ అని నేనడిగితే మే..మే.. అని నీళ్ళు నమిలారు.

ఇతగాడు చేసిన నిర్వాహం వల్ల మహిళా విద్యార్థులు మరింత బాధితులుగా మారారు. మహిళలపై జరిగే లైంగిక అకృత్యాల్ని నిరోధించే లైంగిక అత్యాచార నిరోధక కమిటీ(CSCASH)ని విశ్వవిద్యాలయంలో రద్దుచేసిపారేశాడు. ఇది దేశం మొత్తం మీద ఒక్క JNU లో మాత్రమే జరిగింది.
ʹఎందుకు ఈ కమిటీ ని రద్దు చేసేశారు ?ʹ అని అడిగితే ఆ విషయం న్యాయస్థానం లో ఉంది మాటాడకూడదు అన్నాడు. ఇంతలో అతని అంగరక్షకుడు కలిగజేసుకొని నన్ను ఇక అక్కడ్నుంచి వెళ్ళిపొమ్మన్నాడు. అయితే వీసీ అతడ్ని నివారించి పర్లేదు నన్ను మాట్లాడనియ్యమన్నాడు.

" నజీబ్ ఎక్కడున్నాడు? అతనిపై దాడిచేసిన వాళ్ళెందుకు స్వేచ్ఛగా, ఏ శిక్షా లేకుండా ఇక్కడే తిరగగలుగుతున్నారు ?" అని అడిగాను. జవాబు మాత్రం క్రూరమైన మౌనమే. ʹప్రతీ చిన్న విషయానికీ విద్యార్థులపై జరిమానా లు విధించి, డబ్బులు వసూలు చేస్తున్నారేందుకు ?, బిరియాని వండుకున్నందుకు సైతం జరిమానా విధించారెందుకు ?ʹ అని అడిగాను. దానికతడు ʹమీరు బిరియాని లైబ్రరీలో వండుకుంటారా?ʹ అని అడిగాడు. అతని ప్రశ్న జవాబు చెప్పకుండా తప్పించుకునే ఓ దారి అంతే. వాస్తవానికి విద్యార్థులు బిర్యానీ ని ఫ్రీడమ్ గ్రౌండ్లో అక్కడ దొరికిన కర్రలు,కట్టెలతో వండుకున్నారు. అది చట్టవ్యతిరేకమో, నియమాల ఉల్లంఘనో కాదు. తనతో గానీ, తన మద్దతుదారులతో గానీ ఎవరైనా విద్యార్థి విభేదిస్తూ గట్టిగా మాట్లాడితే ఆ విద్యార్థికి తక్షణమే నోటీసులు జారీ అయిపోతాయి. ʹ మీకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, నినాదాలు ఇచ్చినా షోకాజ్ నోటీసులు ఎందుకిస్తున్నారు ?ʹ సమాధానం మళ్ళీ నిశ్శబ్దమే. ʹ ఎందుకని విద్యార్థుల యొక్క ప్రేమించుకొనే, జీవించే, నిరసన తెలిపే హక్కుల్ని కాలరాస్తున్నారు? ఎందుకని వాళ్ళని కరడుగట్టిన నేరస్తుల్లా చూస్తున్నారు?ʹ అని అడిగితే
ʹ ప్రజల్లో మంచివాళ్ళూ వుంటారు, అంతగా మంచివాళ్ళు కాని వాళ్ళూ ఉంటారు..ʹ అని చెబుతుంటే నేను అడ్డుపడి ʹ ఈ విభజన ఒక ఆరోగ్య కరమైన సమాజానికి మంచిది కాదు.. సరిపోదు. విద్యార్థుల చదువుకొనే హక్కుని ఇలా అన్ని రకాలుగా ఎందుకు కాలరాస్తున్నారు ?ʹ అని అడిగాను. ʹ నేనేమీ వాళ్ళ హక్కుల్ని కాలరాయడం లేదు ʹ అన్నాడు. అప్పటికే అతనికి కోపం తారాస్థాయికి చేరిపోయింది. నేను అడిగిన చివరి ప్రశ్న అతనికి మరింత చిర్రెత్తించింది. అదేమిటంటే
" మీరెప్పుడు JNU ని వదిలిపెట్టి వెనక్కి వెళ్లిపోతున్నారు ?" JNU పాలక భవనం మెట్లు ఎక్కుతున్న అతడు ఆగి , వెనక్కితిరిగి నావైపు చూశాడు. అప్పటికే అతడి మొఖం ఎర్రగా రంగు మారిపోయి ఉంది. మరింక ఏ ప్రశ్నలూ అడగకుండా అతని బాడీగార్డ్ నన్ను ఆపేశాడు.

JNU లో జరుగుతున్న వరుస ఘటనలకు భాద్యత వహిస్తూ వీసీ మామిడాల జగదీష్ కుమార్ ని ఆ పదవి లోంచి తొలగించాలనే విద్యార్థుల డిమాండ్ లో, ఆందోళనలో ఎంతో న్యాయం ఉంది.

( నజీబ్ పై దాడి చేసి, అదృశ్యం చేసిన ఘటనపై విద్యార్థులు చేస్తున్న ఘెరావ్ నుంచి వీసీని భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్తున్న దృశ్యం పైన ఫొటో)

- మోహన సుందరం

ఫేస్‌బుక్ పోస్ట్ : https://www.facebook.com/story.php?story_fbid=465221864383514&id=100026871128416

Keywords : JNU, VC, Mamidala Jagadish Kumar, AMir Malik, Journalist
(2020-01-28 03:56:09)No. of visitors : 225

Suggested Posts


0 results

Search Engine

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం
ʹమాపై వీసీనే దాడి చేయించాడుʹ...వీసీపై కేసు నమోదు చేసిన‌ విద్యార్థులు
ʹకేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా ʹమహా ʹ ప్రభుత్వం భీమా కోరేగావ్ కేసులో నిజాలను బైటికి తీస్తుందిʹ
ʹతెలంగాణలో నియంతృత్వం రాజ్యమేలుతుంది...ఈ అవమానాన్ని మర్చిపోంʹ
భీం ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించిన హైదరాబాద్ పోలీసులు
ఇండియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది : CAA పై తీర్మానం ప్రవేశపెట్టిన‌ యూరోపియన్ యూనియన్
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో చిత్తుగా ఓడిన ఏబీవీపీ ... వామపక్ష, దళిత‌ విద్యార్థి సంఘాల‌ విజయం
దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం
మోడీ షా దుర్మార్గం.... భీమా కోరే గావ్ కేసును NIA కు బదిలీ చేసిన కేంద్రం
మేదావులపై భీమాకోరేగావ్ కేసు ఓ కుట్ర... సీఎం కు శరద్ పవార్ లేఖ
ʹతుక్డే తుక్డే గ్యాంగ్ʹ అంటే ఏంటి ? అందులో సభ్యులెవరు ? హోం శాఖకు కూడా తెలియదట !
కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ‌
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీకి రావొచ్చు.. అనుమతించిన కోర్టు
సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్ నిరసనల్లో కాశ్మీరీ పండితులు
ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO
నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
more..


విద్వేషం