మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం


మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం

మోడీషా

భీం ఆర్మీ వ్యవస్థాపకుడైన చంద్రశేఖర్ ఆజాద్ రావణ్‌ను అక్రమంగా నిర్బంధించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయమిది. దీనిపై సమగ్ర సమాచారాన్ని ఇఫ్టూ ప్రసాద్ తన ఫేస్‌బుక్ వాల్‌పై పోస్టు చేశారు. అది యధాతథంగా....
-----------------------------------------------------------------------

*ప్రియమైన మిత్రులారా!*

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కి గత 25 రోజులుగా కోర్టులు బెయిల్ మంజూరు చేయకుండా ప్రభుత్వ వత్తిళ్ళు కొనసాగుతున్నాయి. మొదట వైద్య చికిత్సకు కూడా మోడీ షా ప్రభుత్వం అనుమతివ్వ లేదు. నిన్న ఢిల్లీ అడిషనల్ సెషన్ కోర్టు లో ఆయన్ని హాజరుపరిచారు. బెయిల్ దరఖాస్తుపై చర్చ జరిగింది. నిన్న కూడా బెయిల్ ఇవ్వోద్దని ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన చేశారు. ఆసందర్భంలో ప్రభుత్వ న్యాయవాది వాదనల ని ఉద్దేశించి సంబంధిత మహిళా న్యాయమూర్తి తీవ్రంగా ప్రతిస్పందించారు. *"జామా మసీదు పాకిస్తాన్ లో ఉందా?"* అని ప్రశ్నించారు. *"ధర్నా చేయడం నేరమా?"* అని ప్రశ్నించారు. *"సోషల్ మీడియా లో ప్రచారం చేయడం ఎలా నేరం?"* అని ప్రశ్నించ్చారు. *"జామా మసీదు నిరసన ప్రదర్శన లో పాల్గొంటానని ట్వీట్ చేయడం చట్టంలో ఏ నిబంధన ప్రకారం నేరమో చూయిస్తారా?"* అని కూడా ప్రశ్నించారు. *"సెక్షన్ 144 గూర్చి గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా?"* అని కూడా ప్రశ్నించారు. *"పార్లమెంట్ తమ అభిప్రాయం వినిపించదని ప్రజలు భావిస్తే, ఆందోళనల్ని చేస్తారు"* అని కూడా చెప్పారు. ఈ ఉక్కిరిబిక్కిరి ప్రశ్నలకు వెంటనే జవాబులు చెప్పలేని ప్రాసిక్యూషన్ వర్గాలు వ్యవధి అడిగాయి. తిరిగి బుధవారానికి వాయిదా పడింది. అంటే లంచ్ తర్వాత ఈరోజు చర్చకు రానున్నది.

ఆదిత్యనాధ్ ప్రభుత్వ హయాం లో యూపీ రాష్ట్రం కాషాయ ప్రయోగశాలగా మారుతున్నది. అట్టి చోట అన్ని రకాల రాజ్య నిర్బంధాలనూ రాజ్యేతర కాషాయ మూకల దాడులనూ అధిగమిస్తూ దళిత యువనేత ఆజాద్ నిలదొక్కుకున్నాడు. ఆయన రాజకీయ గుర్తింపు యూపీ రాష్ట్ర స్థాయి నుండి అఖిల భారత స్థాయికి నేడు ఎదుగుతున్న స్థితి తెలిసిందే! 2017లో యూపీ షాహరన్ పూర్ జిల్లా లో ఓ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అగ్రవర్ణ దురహంకార పెత్తందారీ వర్గాలు దళితులపై దాడులకు దిగడం తెల్సిందే! దానికి నిరసనగా జిల్లా కేంద్రంలో భీమ్ ఆర్మీ ఓ మహా సమ్మేళనానికి పిలుపు ఇచ్చింది. దాని భగ్నంకై యోగి సర్కార్ తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. ఆ సందర్భంలో 2017 జూన్ లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ & మరి కొందరిని యూపీ సర్కార్ అక్రమ కేసుల్లో ఇరికించింది. సుమారు ఐదు నెలల తర్వాత అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ ఉత్తర్వు జైలుకి అందక ముందే, అంటే బెయిల్ మంజూరైన 24 గంటల లోపే యోగి సర్కార్ ఆజాద్ పై "జాతీయ భద్రతా చట్టం" (NSA) కింద అరెస్టుకి ఆదేశాన్ని ఇచ్చింది. ఆ యువ దళితనేత చంద్రశేఖర్ ఆజాద్ NSA నిబంధన ప్రకారం ఏడాది తర్వాత 2018 నవంబర్ మొదటి వారంలో విడుదల కావాల్సి వుంది. దీనికి కేవలం ఒకట్రెండు నెలల ముందు *"మానవతా దృష్టి"* పోజుతో నాటకీయంగా విడుదల చేసి దళిత సామాజిక ప్రజలలో ఆగ్రహావేశాల్ని నీరు గార్చాలనీ, తద్వారా ఆజాద్ ని కూడా ప్రలోభ పరుచుకోవాలనీ పథకం పన్నింది. ఆచరణలో అవన్నీ విఫలమయ్యాయి. ఆ నేపధ్యం లో చంద్రశేఖర్ ఆజాద్ యూపీ రాష్ట్రస్థాయి ప్రముఖ పాపులర్ నేతగా రూపొందాడు.

ఆయన జైలు లో వుండగానే SC,ST అత్యాచారాల చట్టం లో స్ఫూర్తిని నీరు గార్చుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై దేశవ్యాపిత బంద్ లో యూపీ లో భీమ్ ఆర్మీ క్రియాశీల పాత్ర పోషించింది. నిరుడు ఢిల్లీలో రవిదాస్ టెంపుల్ కూల్చివేత సందర్భం గా ఆజాద్ నేతృత్వంలోని భీమ్ ఆర్మీ సంస్థ దళితులతో పాటు లౌకిక, ప్రజాతంత్ర సమూహాల్ని విశేషంగా సమీకరించింది. ఆ ఆందోళన ఆనాడు మోడీ-షా ప్రభుత్వాన్ని వణికించింది. పై నేపథ్యంలో చంద్రశేఖర్ ఆజాద్ దేశవ్యాపిత నేతగా బహుళ గుర్తింపు పొందాడు.

తాజా NRC, CAA వ్యతిరేక ఆందోళన లో ఆజాద్ విశాల దృష్టిని ప్రదర్శించాడు. ఆయన నేతృత్వంలోని భీమ్ ఆర్మీ సంస్థ సాధారణ దళిత సంస్థల కంటే కొంత భిన్నంగా *"దళిత-ముస్లిం ఐక్యత"* నేటి చారిత్రిక ఆవశ్యకతగా గుర్తించి, ఓ నిర్దిష్ట వైఖరిని చెప్పట్టింది. పై రాజకీయ అవగాహనాతోనే NRC, CAA ల వ్యతిరేక ఆందోళన లో క్రియాశీల భాగస్వామ్యతని చేపట్టాలని భీమ్ ఆర్మీ నిర్ణయించింది. ఆ వెలుగులోనే ఢిల్లీ జామా మసీదులో డిసెంబర్ 20న శుక్రవారం నమాజ్ తర్వాత నిరసన ప్రదర్శనలో పాల్గొని, ముస్లిములతో కలిసికట్టుగా దళితులు నిలవాలని భీమ్ ఆర్మీ సంస్థ నిర్ణయించింది. *"హిందూ ముస్లిం ఐక్యత"* సాధించాల్సిన చారిత్రికదశలో చేసిన ఈ నిర్ణయానికి చాలా రాజకీయ ప్రాధాన్యత వుంది. *"దళిత-ముస్లిం ఐక్యత"* అందుకు గట్టి కేంద్రకంగా పని చేస్తుంది. ఇది నేటి సాధారణ దళిత ఉద్యమ రాజకీయ స్రవంతికి సాపేక్షికంగా ఒకింత భిన్నమైనది. వర్తమాన దేశ రాజకీయ పరిస్థితుల్లో అదో కొత్తధోరణి!

పై రాజకీయ అవగాహన వెలుగులో 20వ తేదీ జామా మసీదు నిరసన ప్రదర్శనలో భీమ్ ఆర్మీ పాల్గొంటుందని ముందే ఆజాద్ ట్వీట్ చేసాడు. రవిదాస్ మందిర్ కూల్చివేతపై ఆందోళన సందర్భంగా ఢిల్లీ దళితవాడలకి భీమ్ ఆర్మీ విస్తరించింది. గాన అన్ని వాడల, బస్తీల దళిత శ్రేణుల్ని జామా మసీదు కి తరలివచ్చి ముస్లిములతో భుజం కలిపి నడవాలని అది పిలుపిచ్చింది. దీంతో బెంబేలెత్తిన మోడీ-షా ప్రభుత్వం ఆజాద్ ని అక్కడకు రాకుండా నిఘా విధించింది. ఆయన పోలీస్ కళ్ళు కప్పి సహసోపేతంగా జామా మసీదులో ప్రవేశించాడు. ఆ క్షణాల్లో ముస్లిం-దళిత ఐక్యత నినాదాలతో జామా మసీదు ప్రాంగణం మార్మోగింది. అదే రోజు ఉత్తేజకర వాతావరణం లో ఓ భారీ నిరసన ప్రదర్శన జరగింది. ఆయన్ని కుట్ర కేసుల్లో ఇరికించడానికి స్టేజ్ కూప్ లకి రాజ్యం ప్లాన్ చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. "దర్యాగంజ్ కేసు"లో ఆజాద్ ని ఇరికించింది. ఆ మరునాడు 21-12-2019న నిర్బంధించింది. నేటికి 25 రోజులుగా బెయిల్ రాలేదు. పై నేపధ్యంలో ఢిల్లీ అడిషనల్ సెషన్ కోర్టు లో నిన్న మంగళ వారం చంద్రశేఖర్ ఆజాద్ ని హాజరు పరిచింది. ఈరోజు (15-1-2020) లంచ్ తర్వాత తిరిగి ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగనుంది.

న్యాయ వ్యవస్థ పట్ల ఏ ఆశలూ పెట్టుకొనక్కర లేదు. నిన్నటిలా నేటి స్పందన వుంటుందనే అంచనాలు వుండనక్కర లేదు. రాజ్యం చాలా బలమైనది. ఏదైనా ప్రభావితం చేయవచ్చు. ప్రలోభాలు... లేదంటే, వత్తిళ్ళు... కాదంటే ఇంకా ఏమైనా.... అందుకే నిన్న.. నేడు ఒకటి కాదు. నేడు రేపు ఒకటి కాదు. హిందూ ముస్లిం క్రిస్టియన్ శిక్ఖు మతాల ప్రజల మధ్య ఐక్యత నేటి చారిత్రిక ఆవశ్యకత! దానికి ముస్లిం దళిత ఐక్యత మరింత బలాన్ని ఇస్తుంది. దాన్ని దెబ్బకొట్టడం హిందుత్వ ఫాసిస్టు శక్తులకి ఓ ముఖ్య కర్తవ్యం! అందుకే కోర్టు ద్వారా బెయిల్ వెంటనే మంజూరు అవుతుందని అతి ఆశలు పెట్టుకోవద్దు. ఒకవేళ ఏ వత్తిళ్లకు లొంగకుండా బెయిల్ మంజూరు చేస్తే సంతోషిద్దాం! ఈరోజు ఎలా స్పందించినా, నిన్నటి న్యాయమూర్తి స్పందన కి గల సానుకూల ప్రభావాన్ని గుర్తిద్దాం. అదిరేపటి ప్రజాతంత్ర ఉద్యమ నిర్మాణానికి కచ్చితం గా సహకరిస్తుంది. ఐతే అదే సమయంలో ఆజాద్ బెయిల్ కోసం కేవలం కోర్టుల పై ఆధార పడకుండా, ప్రజాతంత్ర, లౌకిక, వామపక్ష, విప్లవశక్తులు, సంస్థలు విశాల ఐక్యతతో ఉద్యమించాల్సి వుంది. అందుకు ప్రయత్నిద్దాం!

చంద్రశేఖర్ ఆజాద్ వరస నిర్బంధాలు, హింసలవల్ల కొన్ని దీర్ఘవ్యాధులకి గురయ్యాడు. జైల్ లో తగు వైద్య చికిత్స లేదు. చికిత్స కోసం ఆజాద్ తరపు న్యాయవాది చేసిన పలు అభ్యర్ధనల్ని కూడా మోడీ షా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. కోర్టుజోక్యం తో తప్ప వైద్యచికిత్స కూడా సాధ్యపడనిస్తితి ఏర్పడింది. ఓ దళిత సామాజిక కుటుంబంలో పుట్టి, ఉన్నత విద్య పొంది, న్యాయవాద వృత్తి చేస్తూ, దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాలకై రాజకీయ రంగ ప్రవేశం చేసి, 35 ఏళ్లు కూడా నిండని ఓ యువకుడు నేడు ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమ పధంలో దేశవ్యాపిత రాజకీయ గుర్తింపు పొందడం విశేషం! పైగా నేటి ఫాసిస్టు తరహా పాలన నేపధ్యం లో దళితరాజకీయ స్రవంతుల్లో సాపేక్షికంగా మెరుగైన నిర్దిష్ట రాజకీయ అవగాహనతో ఎదుగుతుండటం కూడా ఒక విశేషం! అలాంటి చంద్రశేఖర్ ఆజాద్ విడుదల కోసం తెలుగు సీమలో కూడా బలమైన ప్రజాతంత్ర వాణిని వినిపించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేడు బెయిల్ మంజూరైనా, ఆయన్ని అమానుషంగా రాజ్యం వరస నిర్బంధాలతో శిక్షిస్తున్న మోడీ షా ప్రభుత్వ ఫాసిస్టు రాజనీతి ని ఖండిస్తూ నిరసన గళం వినిపిద్దాం!

-ఇఫ్టూ ప్రసాద్ (పి.పి)

ఫేస్‌బుక్ లింక్ : https://www.facebook.com/prasad.iftu/posts/184334786093858

Keywords : Chandrasekhar Azad, Bheem Army, Release, Bail, CAA, NPR, NCR
(2020-07-03 04:06:11)No. of visitors : 1129

Suggested Posts


0 results

Search Engine

కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ
more..


మోడీషా