భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్


భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్

భీం

సీఏఏ నిరసనల సందర్భంగా అరెస్టయిన భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు బెయిల్ లభించింది. బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ సెషన్స్ కోర్టు జడ్జి కామినీలా నెల రోజుల వరకు ఆజాద్ ఢిల్లీలో ఉండ్వద్దని, అతని స్వస్థలమైన సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్ విధించారు.

ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరిగుతున్నందువల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దనే తాను ఈ కండీషన్స్ విధిస్తున్నానని, ఆజాద్ ధర్నాలు ప్లాన్ చేసి ఉంటే.. అతను వాటిని ఒక నెల పాటు నిర్వహించకూడదని జడ్జి తేల్చి చెప్పారు.

ఆజాద్ బెయిల్ పిటిషన్ పై మంగళవారం నాడు జరిగిన వాదనల సందర్భంగా.. నిరసన తెలపడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కని, పార్లమెంట్‌లో చెప్పాల్సిన విషయాలు చెప్పనందుకే ప్రజలు వీధుల్లోకి వచ్చారని స్పష్టం చేసింది. చంద్రశేఖర్‌ ఆజాద్‌పై మోపిన ఆరోపణలను ప్రస్తావిస్తూ జామా మసీద్‌ పాకిస్తాన్‌లో ఉన్నట్టు మీరు ప్రవర్తిస్తున్నారని, గతంలో పాకిస్తాన్‌ అవిభక్త భారత్‌లో అంతర్భాగమైనందున మీరు అక్కడికి వెళ్లైనా నిరసన తెలుపవచ్చని ఢిల్లీ పోలీసుల తీరును తప్పుపట్టారు. ఆజాద్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌లను ప్రాసిక్యూటర్‌ ప్రస్తావిస్తూ హింసను ప్రేరేపించేలా ఆయన పోస్ట్‌లున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

జామా మసీద్‌ వద్ద ధర్నా చేస్తున‍్నట్టు సోషల్‌ మీడియాలో ఆజాద్‌ పోస్ట్‌ చేశారని ప్రాసిక్యూటర్‌ చెబుతుండగా ధర్నా చేస్తే తప్పేముందని, నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగ హక్కని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ పోస్టుల్లో తప్పేముందని, హింస ఎక్కడ చెలరేగిందని..మీరసలు రాజ్యాంగాన్ని చదివారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సెక్షన్‌ 144 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి అవసరమని ప్రాసిక్యూటర్‌ వాదిస్తుండగా ఏం అనుమతి కావాలని అంటూ పదేపదే సెక్షన్‌ 144 విధించడం వేధింపుల కిందకు వస్తుందని సుప్రీం కోర్టు చెప్పిన విశ్హయాన్ని జడ్జి గుర్తు చేశారు. ఆజాద్‌ హింసను ప్రేరేపించారనేందుకు ఆధారాలు చూపాలని న్యాయమూర్తి అడగగా ఇందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ప్రాసిక్యూటర్‌ కోరారు. దాంతో విచారణ ఈ రోజుకు వాయిదా పడింది.

Keywords : azad, chandrashekhar azad, bheem army, delhi court
(2020-01-27 19:32:53)No. of visitors : 166

Suggested Posts


నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు

ప్ర‌భుత్వ ఆస్తులను తగులబెట్టడం భారతీయులు ఆక్రోశం వ్యక్తం చేసే తీరు. అందుకు చాలాకాలంగా దేశ పాలక వ్యవస్తే అనుమతిస్తోంది. ఇదో విచిత్రమైన వివేచన. కానీ ఇది వివేచనేʹʹ అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు

రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్

పౌరసత్వ సవరణ చట్టం, ఏన్నార్సీ రెండూ కలిపి అమలు చేయడంలోనే ప్రమాదముందని భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇండియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది : CAA పై తీర్మానం ప్రవేశపెట్టిన‌ యూరోపియన్ యూనియన్

భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టం(CAA) దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మన దేశంలో చేసిన CAA చట్టానికి వ్యతిరేకంగా వివిధ దేశాల్లో నిరస‌న ప్రదర్శనలు జరుగుతుండగా తాజాగా యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌ కూడా CAAకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టింది.

ʹమాపై వీసీనే దాడి చేయించాడుʹ...వీసీపై కేసు నమోదు చేసిన‌ విద్యార్థులు

పశ్చిమ బెంగాల్‌లోని విశ్వ భారతి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులపై దుండగుల దాడి యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ బిడ్యూత్ చక్రవర్తి ప్రోద్భలంతోనే జరిగిందనే వీడియో ఒకటి బైటికి వచ్చింది. ఆ వీడియో సహాయంతో విద్యార్థులు వీసీపై పోలీసు కేసు నమోదు చేశారు.

దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం

తల్లుల ఒడిలో పసిపిల్లలూ వున్నారు. ఇంకా మూడేళ్ల పిల్లల నుండి పదహారేళ్ళ నూనూగు యువకుల వరకూ వున్నారు. ఆ పిల్లలు ట్యూషన్లకి వెళ్లాల్సిన సమయమది. ఏ ఆందోళన వారిని అక్కడకు రప్పించింది? బురఖాలు ధరించిన మహిళలను ఏ భయం అక్కడకు రప్పించింది? అక్కడ జాతీయ జండా, గాంధీ, అంబేద్కర్ చిత్రాలు ధరిస్తున్న ప్రేక్షకుల గుండెల్లో ఏ భావోద్వేగాలు ఉన్నాయి? వారి గుండె చప్పుళ్ళు ఎలా విన

Search Engine

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం
ʹమాపై వీసీనే దాడి చేయించాడుʹ...వీసీపై కేసు నమోదు చేసిన‌ విద్యార్థులు
ʹకేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా ʹమహా ʹ ప్రభుత్వం భీమా కోరేగావ్ కేసులో నిజాలను బైటికి తీస్తుందిʹ
ʹతెలంగాణలో నియంతృత్వం రాజ్యమేలుతుంది...ఈ అవమానాన్ని మర్చిపోంʹ
భీం ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించిన హైదరాబాద్ పోలీసులు
ఇండియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది : CAA పై తీర్మానం ప్రవేశపెట్టిన‌ యూరోపియన్ యూనియన్
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో చిత్తుగా ఓడిన ఏబీవీపీ ... వామపక్ష, దళిత‌ విద్యార్థి సంఘాల‌ విజయం
దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం
మోడీ షా దుర్మార్గం.... భీమా కోరే గావ్ కేసును NIA కు బదిలీ చేసిన కేంద్రం
మేదావులపై భీమాకోరేగావ్ కేసు ఓ కుట్ర... సీఎం కు శరద్ పవార్ లేఖ
ʹతుక్డే తుక్డే గ్యాంగ్ʹ అంటే ఏంటి ? అందులో సభ్యులెవరు ? హోం శాఖకు కూడా తెలియదట !
కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ‌
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీకి రావొచ్చు.. అనుమతించిన కోర్టు
సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్ నిరసనల్లో కాశ్మీరీ పండితులు
ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO
నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
more..


భీం