మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు


మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు

మమ్మల్ని

దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో ʹఉనాʹ బాధితులు రాష్ట్రపతికి సంచలన లేఖ రాశారు. మమ్ములను ఈ దేశం నుండి బహిష్కరించండి. దళితుల పట్ల వివక్ష లేని మరో ఏదైనా దేశానికి మమ్మల్ని పంపించండి అని ఆ లేఖలో వాళ్ళు కోరారు.

2016 లో గుజరాత్‌లోని ఉనాలో ఏడుగురు దళితులను స్వయం ప్రకటిత గోరక్షక మూక కట్టేసి దుర్మార్గంగా కొట్టిన విషయం తెలిసిందే. వాళ్ళను కొడుతున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్ళలో వైరల్ అయ్యి దేశ వ్యాప్త ఉద్యమానికి దారి తీసింది.

ఆ బాధితుల్లో ఒకరైన వశ్రమ్ సర్వైయా తన కుటుంబం తరపున రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆయనను కలిసిన ʹది క్వింట్ డాట్ కామ్ʹ ప్రతినిధితో మాట్లాడుతూ ʹʹమేము సీఏఏని వ్యతిరేకిస్తున్నాము, కాని వారు ఈ చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, దళితులను సమాన పౌరులుగా భావించే దేశానికి మమ్మల్ని బహిష్కరించాలి.ʹʹ

ʹʹమేము భారతదేశంలో పౌరులుగా పరిగణించబడటం లేదు. హిందూ సమాజంలో దళితులు దారుణమైన వివక్షకు గురవుతున్నారు. కాబట్టి మేము వివక్షను ఎదుర్కోని వేరే దేశానికి పంపమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను అభ్యర్థిస్తున్నాము. ʹʹ

ʹʹ2016 లో మమ్మల్ని కొట్టిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేరస్తులు బెయిల్‌పై ఉన్నారు. మాకు వ్యవసాయ భూమి, ప్లాట్లు వాగ్దానం చేశారు కాని వాటిలో ఏ ఒక్క వాగ్దానం అమలుపరచలేదు.ʹʹ
"అప్పటి గుజరాత్ సిఎం,ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన ఆనందీబెన్ పటేల్ 2016 లో మా దగ్గరికి వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఒక నెలలో మళ్ళీ మాదగ్గరికి వస్తానని మాట ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆమె రాలేదు ఆమె ఇస్తానన్న ఉద్యోగాలు రాలేదుʹʹ

దాడికి గురైన సోదరులందరి తరపున‌ వశ్రామ్ రాష్ట్రపతికి రాసిన ఈ లేఖ‌ను జనవరి 7 న గిర్-సోమనాథ్ జిల్లాలోని ఉనా ప్రాంతీయ కార్యాలయానికి పంపారు.

గతంలో మేము తమకు కారుణ్య మరణానికి అనుమతి కావాలని కోరాం. ఇప్పుడు ఈ మా అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోకపోతే, నేను నా సోదరులు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు ఆత్మాహుతి చేసుకుంటాంʹʹ అని వశ్రమ్ సర్వైయా చెప్పారు.

(ది క్వింట్ డాట్ కామ్ సౌజన్యంతో..)

Keywords : Una, Dalits, President, Kovind, Letter, Gujarat
(2020-02-27 14:22:35)No. of visitors : 1109

Suggested Posts


0 results

Search Engine

మతోన్మాద మూక ప్రాణాలు తీస్తుంటే - వీళ్ళు కడుపులో పెట్టుకొని రక్షించారు.
ఢిల్లీలో జరిగినవి ఇరు వర్గాల మధ్య అల్లర్లు కావు, బిజెపి,ఆరెస్సెస్ కలిసి చేసిన వ్యూహాత్మక, ప్రణాళికాబద్ధ దాడులు - విరసం
ఢిల్లీలో చెడ్డీ గ్యాంగ్ దాడులు: ఈ తల్లిని సజీవదహనం చేశారు
ఢిల్లీ : బీజేపీ నేతలపై కేసులకు ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి అర్దరాత్రి బదిలీ
ఢిల్లీ అల్లర్లు: ఆ బీజేపీ నేతల‌పై కేసులు నమోదు చేయండి - పోలీసులకు హైకోర్టు ఆదేశం
నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
మసీదును మేమే కాల్చాం... మా దేశంలో నిరసన తెలపడానికి వాళ్ళకు ఎంత ధైర్యం ? కెమెరా ముందు హిందుత్వ సభ్యులు
ఎన్డీటీవీ జర్నలిస్టులపై మతోన్మాద మూక దాడి - ఆపై హిందువులని తెలిసి వదిలేసిన దుండగులు
వీళ్ళు ప్రేమతో గులాబీలివ్వాలని చూశారు ... వాళ్ళు ద్వేషంతో దాడులు చేసి నెత్తుర్లు పారించారు
CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు
CAA,NRC: ఢిల్లీ శాంతి యుత నిరసనలపై చెడ్డీ గ్యాంగ్ దాడులు - పోలీసుల పాత్రపై అనుమానాలు
నిరసనపై నిరసన: వందలమంది హిందుత్వ వాదుల మధ్య ఆజాది అంటూ నినదించిన‌ యువతి
సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు
జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా
దళిత యువకుల‌పై దుర్మార్గ దాడి - స్క్రూడ్రైవర్‌ను వెనక నుంచి జొప్పించి హింసలు
CAA పౌరసత్వానికి మత పరీక్ష... అమెరికన్ ఫెడరల్ ప్యానెల్
ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు
వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !
మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?
ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ
భీమా కోరేగావ్ కేసు సమాంతర విచారణకు మహారాష్ట్ర‌ సర్కార్ నిర్ణయం
ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
more..


మమ్మల్ని