ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ

విప్లవ రచయితల సంఘం కార్యదర్శి, కవి, సాహిత్య విమర్శకుడు, వక్త, నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు అధ్యాపకుడు ప్రొఫెసర్ కాశీంను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. బహిరంగ జీవితంలో ఉండి ప్రతి రోజూ కాలేజీలో పాఠాలు బోధిస్తూ , అనేక సమావేశాల్లో పాల్గొంటూ, ఉస్మానియా యూనివర్సిటీ క్వార్టర్స్‌లో తన ఇంట్లోనే ఉంటున్న కాశీంను 2016 నుండి పరారీలో ఉన్నాడని చూపించిన పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. ఈ రోజు(18, జనవరి, 2020) తెల్లవారు జామున ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి.. ఇంట్లో దాదాపు 5 గంటల పాటు సోదాలు చేసి కాశీంను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు.

కాశీం అరెస్ట్‌పై అతని సహచరి స్నేహాలత మీడియాతో మాట్లాడుతూ నా భర్త ను అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఐదేండ్ల క్రితం అక్రమంగా బనాయించిన కేసులో ఈ రోజు గజ్వేల్ పోలీసులు సోదాలు చేసి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆమె అన్నారు.

ʹʹ2016లో హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న శ్యామ్ సుందర్ అనే వ్యక్తి దగ్గర దొరికిన పుస్తకాలపై కేసు నమోదు చేశారు.ʹʹ ʹʹనేను తెలంగాణ వాడినేʹʹ అనే పుస్తకంతో పాటు ఎస్సి , ఎస్టీ వర్గీకరణపై రాసిన పుస్తకాల పై కేసు నమోదు చేశారు. నిజానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తప్పుడు కేసులు పెట్టి కాశీంను అరెస్ట్ చేశారు. తలుపులు గడ్డపారతో పగలగొట్టి అక్రమంగా లోపలికి వచ్చారు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును సెర్చ్ చేశారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఇంట్లో ఉన్న పుస్తకాలను తీసుకెళ్లారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాను.ʹʹ అని స్నేహలత చెప్పారు.

కాశీం అక్రమ అరెస్ట్ పై వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. కాశీం చైతన్య పూరితమైన భావజాలంతో పని చేసే ఓ విద్యాధికుడని ఆయనపై లేని పోని ముద్రలు వేసి అరెస్టు చేయడం అన్యాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

డా. కాశీం ఇంటిపై పోలీసుల దాడి, అరెస్ట్‌ను తెలంగాణ విద్యావంతుల వేదిక తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామికవాదులు, రచయితలు, బుద్దిజీవులు అందరు ఈ అరెస్ట్‌ను ఖండించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు డాక్టర్ కొండా నాగేశ్వర్, డాక్టర్ సమున్నత్, డాక్టర్ ఉపేందర్, పీ రమణలు విజ్ఞప్తి చేశారు.

కాశీం అరెస్ట్ ను ఖండిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి-భువనగిరి జిల్లా కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం...

విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి నడుస్తున్న తెలంగాణ పత్రికా సంపాదకుడు, ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ చింత‌కిందికాశీం ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి-భువనగిరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తి, అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికై, అనేక రచనలు చేస్తూ, ప్రశ్నించే, మాట్లాడే, ప్రజాస్వామిక వాది.

ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుటూన్న దోపిడీ నియంతృత్వ రాజకీయాలను ప్రశ్నిశ్టు, రాస్తున్న కారణంగనే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పై కుట్రపూరితంగా అక్రమ కేసులు నమోదు చేసి అక్రమంగా పోలీసులతో ఇంటిపై దాడులు చేసి, అప్రజాస్వామికంగా అరెస్టు చేయించడం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రశ్నించే వ్యక్తులపై, ప్రజా సంఘాల నాయకులపై, కోనసాగుటూన్న ఈ అక్రమ అరెస్టులను ప్రజాస్వామిక వాదులు మేధావులు రచయితలు ముక్తకంఠంతో ఖండించాలని కోరుతున్నాం.

కాశీం అరెస్టును ఖండిస్తూ పౌరహక్కుల సంఘం చేసిన‌ ప్రకటన...

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్,విరసం నూతన కార్యదర్శి C ఖాసిం ఇంటిపై ఈ రోజు శనివారం 18,జనవరి 2020 ఉదయం 5:30 గంటల సమయంలో పోలీసులు దాడిచేసి అక్రమంగా సోదాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో సంబంధాలున్నాయని గత రెండు నెలలుగా తెలంగాణ లో ప్రజాసంఘాల నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి జైల్లో పెడుతున్నారు. అందులో భాగంగానే ప్రొఫెసర్ ఖాసింను కుట్రతో అరెస్ట్ చేయడానికి ఈ రోజు KCR ప్రభుత్వం పోలీసులు ద్వారా అరెస్ట్ చేయడానికి దాడులు సోదాలు చేస్తున్నారు.ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ అక్రమ అరెస్టులను,ఎమర్జెన్సీ మించిన నిర్బందాన్ని ఖండించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ,అధ్యక్షులు పౌరహక్కుల సంఘం,తెలంగాణ

2. ఎన్. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి పౌరహక్కుల సంఘం,తెలంగాణ

ప్రజా స్వామిక వాదులు,సాహిత్య కారులు,కవులు,కళాకారులు, సామాజిక స్పృహ ఉన్న ప్రతిఒక్కరు అణగారిన, పీడిత ప్రజల గొంతుక సి. కాసిం అక్రమ అరెస్ట్ ను ఖండించాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కోరింది. రాజ్యనిర్బంధం లో ఉన్న ప్రజాస్వామిక వాదుల విడుదల కోసం ఐక్య ఉద్యమాల్తో ముందుకు కదులుదాం అని తెలంగాణ ప్రజా స్వామిక వేదిక కన్వీనర్ బండి దుర్గాప్రసాద్ కోరారు.

ప్రొఫెసర్ కాసింను విడుదల చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకుడు సాదినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయనపై అక్రమంగా బనాయించిన యూఏపీఏ కేసును ఉపసంహరించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక గురిజాల రవీందర్ డిమాండ్ చేశారు.

Keywords : Virasam, Secretary, Professor, Kasim, OU, Police, Gajwel, Arrest
(2024-04-24 17:16:31)



No. of visitors : 1585

Suggested Posts


తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!

ప్రొఫెసర్ కాశీం ని అరెస్ట్ చేయడానికి వచ్చిన మెదక్ పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక పోలీసు ఆఫీసర్ జ్యోక్యం చేసుకొని "యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న మీలాంటి వాళ్లకు ఎందుకు సార్ ఈ రాజకీయాలు, మంచిగా మాట్లాడతారు, మంచిగా రాస్తారు.

ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

2016లో పెట్టిన కేసులో ఇప్పటి వరకు కాశీం తప్పించుకొని తిరుగుతున్నాడని ఎలా అంటారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం

విరసం 50 ఏళ్ల సభలు విజయవంతంగా ముగిసి కొత్త కార్యదర్శిగా కామ్రేడ్ కాశీం ఎన్నికై వారం తిరక్కుండానే ఆయన్ని అక్రమంగా దౌర్జన్యపూరితంగా అరెస్టు చేశారు.

కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!

2016లో కాశీంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతను ఇప్పటివరకు అబ్ స్కాండిగ్ లో ఉన్నట్లు ఆరోపించడం వింతలో కెల్ల వింత.

Condemning arbitrary arrest of Prof. C. Kaseem

The voice that had echoed for the formation of separate Telangana state, the voice that reverberated for self-respect of Dalits: Prof. C. Kaseem has been arbitrarily arrested by

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹప్రొఫెసర్