నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌

నా

తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని కాశీం తల్లి వీరమ్మ వెల్లడించారు. ప్రొఫెసర్ కాశీం అరెస్టు నేపథ్యంలో ఆయన తల్లి వీరమ్మ మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు పేదల కోసం కొట్లాడిండని.. అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసిండని గుర్తు చేశారు. తన కొడుకును వెంటనే విడుదల చేయాలని.. తనకు కాశీంను చూపియ్యాలని ఆమె డిమాండ్ చేశారు.

కాశీం అరెస్టును ఖండించిన విరసం

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, విరసం నూతన కార్యదర్శి కాశీంను అక్రమంగా అరెస్టు చేయడాన్ని విప్లవ రచయితల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. సరిగ్గా వారం క్రితం విరసం సభలను అత్యంత ఉత్తేజంగా నిర్వహించి కాశీంను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నాం.. కాని వారం తిరక్కుండానే ఆయనపై కుట్ర పూరితంగా, పాత కేసులను తిరగదోడి అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.

కాశీంను దేశద్రోహి అని అరెస్టు చేయడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన మేధో సమాజం ఆందోళన చెందుతోందని ఆయన పేర్కొన్నారు. కాశీంపై నమోదు చేసిన ఏడు కుట్ర కేసులను వెంటనే ఎత్తివేసి ఆయనను భేషరతుగా విడుదల చేయాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఫాసిజం నుంచి దేశాన్ని రక్షించగలమా ?! : హర గోపాల్, పౌర హక్కుల నేత

డాక్టర్ కాశీంను తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసిన విధానాన్ని చూస్తుంటే ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థమవుతోందని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఏకంగా యూనివర్సిటీలోకే పోలీసులు చొరబడి విధ్వంసం సృష్టించార‌ని ఆయన చెప్పారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ఎన్ఆర్సీ, సీఏఏ వంటివి ముందుకు తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. దేశం ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అయిన ఫాసిజం నుంచి దేశాన్ని రక్షించలేమా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుతం అలాంటి చర్యలకే పాల్పడుతోందని హరగోపాల్ అన్నారు. తెలంగాణలో ఎలాంటి మావోయిస్టు కార్యాకలాపాలు లేకపోయినా అక్రమ అరెస్టులకు పాల్పడటం దారుణమని.. ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటివి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. నిర్బంధం కారణంగా ఎన్టీఆర్ వంటి నేతలే ఓటమి పాలయ్యారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణలో 16 మంది విరసం, విప్లవ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని.. ఇప్పుడు కాశీం ను కూడా నిర్బంధించారని అన్నారు. వెంటనే కాశీంను భేషరతుగా విడుదల చేయాలని హరగోపాల్ డిమాండ్ చేశారు.

Keywords : Professor Kasim, Osmania University, UAPA, Arrest, High Court, Gajwel Police, Kasim Mother, Veeramma
(2024-04-16 23:01:31)



No. of visitors : 1840

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నా