సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్ నిరసనల్లో కాశ్మీరీ పండితులు

సీఏఏకు

సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా సాగుతున్న నిరసనలకు ఢిల్లీలోని షాహీన్ బాగ్ కేంద్ర బిందువుగా మారింది. అత్యంత తీవ్రమైన చలిలో కూడా ఆదివారం సాయంత్రం స్వేచ్ఛా నినాదాలు చేస్తున్న వేలాది మంది ప్రజలు ఇక్కడ జష్న్-ఎ షాహీన్ (కవిత్వం, పాటలతో ఓ సాయంత్రం) జరుపుకున్నారు.

హమ్ క్యా చాహ్తే... ఆజాది!.. ఆకలి నుండి ఆజాదీ.. పేదరికం నుండి ఆజాదీ.. అణిచివేతల నుండి ఆజాదీ.. దోపిడి నుండి ఆజాదీ... నినాదాలతో షాహీన్ బాగ్ ప్రాంతం మారుమోగుతోంది. ఈ దేశం మాది మా తాత తండ్రులది అంటూ అక్కడ కూడిన వేలాది ప్రజలు నినదిస్తున్నారు.

కునాల్ కమ్రా, అంకుర్ తివారీ, మాయ కృష్ణారావుతో సహా అనేక మంది కళాకారులు ప్రభుత్వానికి తమ ప్రతిఘటనను తెలపడానికి ఇక్కడికి వచ్చారు. షాహీన్ బాగ్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఇవ్వాళ్ళ షాహీన్‌బాగ్‌కు మద్దతు ఇవ్వడమంటే దేశానికి మద్దతు ఇవ్వడమే.

ఆదివారం ప్రముఖ కాశ్మీరీ పండీత్స్ ఎం.కె.రైనా, ఇందర్ సలీమ్‌లతో సహా మరికొందరు షహిన్‌బాగ్‌కు వచ్చారు. షాహీన్‌బాగ్‌కు తమ సంఘీభావం ప్రకటించడానికి వాళ్ళొచ్చారు.

బాలీవుడ్ నిర్మాత వివేక్ అగ్న్ హోత్రి రేపిన ఓ అబద్దపు ప్రచారాన్ని త్తుత్తునియలు చేయడానికి వాళ్ళిక్కడికొచ్చారు. కవిత్వంతో సాయంత్రం అనే ఈ కార్యక్రమం కాశ్మీరీ పండీట్‌లను కాశ్మీర్ లోయ నుండి వెళ్ళగొట్టినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ జరుగుతున్న కార్యక్రమమని ఆయన ట్విట్టర్‌లో ప్రచారం మొదలు పెట్టాడు. ఇలాంటి అబద్దపు ప్రచారాన్ని వెంటనే అందుకునే కొన్ని గ్రూపులు కూడా దీన్ని ప్రచారంలో పెట్టాయి.

అయితే ఈ సాయంత్రం దేశరాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు, మతం ఆధారంగా ఈ దేశ ప్రజలను విభజించే కుట్రలను ఓడించేందుకు ప్రతినబూనే సాయంత్రమని షాహీన్ బాగ్ ప్రకటించింది.

ʹʹఈ సంఘటనకు కాశ్మీరీ పండిట్ల తరలింపుతో ఎటువంటి సంబంధం లేదు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేము చేస్తున్న‌ శాంతియుత ఉద్యమాన్ని అణిచివేసేందుకు కొందరు చేస్తున్న అబద్దపు ప్రచారం. ʹʹ అని ఒక నిర్వాహకుడు తెలిపాడు.

షహీన్‌బాగ్ నిరసనల్లో పాల్గొన్న ఓ మహిళ మాట్లాడుతూ ʹʹకాశ్మీర్లో అన్నింటినీ విడిచిపెట్టి పారిపోయిన కాశ్మీరీ పండిట్ల బాధను మేమూ అనుభవిస్తున్నాము. షాహీన్‌బాగ్ ప్రజలం వారి వేదనలో వారికి సంఘీభావం తెలుపుతున్నాము. ʹʹ అని ప్రకటించింది.

వక్తలలో ఒకరి అభ్యర్థన మేరకు కాశ్మీరీ పండిట్‌లకు సంఘీభావంగా నిరసనకు హాజరైన వారందరూ రెండు నిమిషాల మౌనం పాటించారు.

" 500 రూపాయలు మరియు ఒక ప్లేట్ బిర్యానీ కోసం ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారని మోడీ సర్కార్ తమ తోలుబొమ్మ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది, కానీ ఇవ్వాళ్ళ భారత దేశం మొత్తం షాహీన్ బాగ్ లాగా ఎలా మారిందో చూడండి.ʹʹ ఆ మహిళ చెప్పింది

ʹʹమేము ఇక్కడ ఓ రెండు రోజులు కూర్చుని ఇంటికి తిరిగి వెళ్తామని ప్రభుత్వం భావించింది కాని భారత ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారని వారు గ్రహించలేదు. భారతదేశంలో ఏదైనా అన్యాయం జరిగితే మతాలతో సంబంధం లేకుండా ఆ అన్యాయానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడుతాముʹʹ అని ఒక యువ ప్రదర్శనకారుడు చెప్పాడు.

Keywords : Shahinbagh, CAA, NRC, Kashmir Pandits, BJP, Modi, Amit Shah
(2024-03-28 19:56:48)



No. of visitors : 729

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సీఏఏకు