దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం


దేశవ్యాప్తంగా ʹషహీన్ బాగ్ʹ లు...విజయవాడలో శాంతి బాగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా

(విజయవాడ‌లో శాంతి బాగ్ ప్రారంభం గురించి ʹప్రసాద్ ఇఫ్టూ ʹ తన ఫేస్ బుక్ వాల్ పై చేసిఅన్ పోస్ట్ మీ కోసం...)

ప్రియమైన మిత్రులారా!

మల్లెల విప్లవ స్ఫూర్తితో తొమ్మిదేళ్ల క్రితం ఈజిప్ట్ రాజధాని కైరో లోని తెహ్రిక్ స్క్వేర్ ఒక ఉద్యమ స్ఫూర్తి కేంద్రంగా వర్ధిల్లింది. దానితో దీన్ని పోల్చవచ్చో లేదో వేరే సంగతి! కానీ ఇండియాలో నేడు NRC, CAA & NPR వంటి ఫాసిస్టు చట్టాల వ్యతిరేక పోరాట స్ఫూర్తితో ఢిల్లీ "షాహీన్ బాగ్" మహిళల పోరాటం కూడా అలాగే వర్ధిల్లుతోంది. పొద్దున 8గంటలకు ఇళ్లల్లో పనుల్ని ముగించుకొని పరుగుపరుగున షాహీన్ బాగ్ కి వచ్చి ధర్నా శిబిరంలో పాల్గొనడం నేడు స్త్రీల సాంప్రదాయం గా మారింది. పైగా మున్నెన్నడూ ఇంటి గడప దాటని ముస్లిం మహిళలు అధికసంఖ్యలో పాల్గొనడం విశేషం! అది నేడు దేశవిదేశాల సందర్శకుల వేదికగా మారింది. అంతేకాకుండా, దాని ఉద్యమ స్ఫూర్తితో అదే తరహాలో దేశంలోని అనేక ప్రాంతాల్లో దీక్షాశిబిరాలు వెలుస్తున్నాయి. అలాంటిదే నిన్న 24-1-2020న విజయవాడలో కూడా ఒక ధర్నా శిబిరం విజయవంతంగా ప్రారంభమైనది. దాని విశేషాలు తెల్సుకుందాం.

తొలుత చిన్న ఉపోద్ఘాతంలోకి వస్తా. NRC, CAA, NPR లపై విజయవాడలో ఈనెల 2వ తేదీ నుండి ధర్నా సెంటర్ లో "రాజ్యాంగ పరిరక్షణ కమిటీ" ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్షలు జరుగుతున్నాయి. అవి చాలా గొప్ప ప్రభావం కలిగిస్తున్నాయి. ప్రజా సమీకరణకూ, ప్రజా చైతన్యానికి వేదికగా మారాయి. మరోవైపు "Alliance against NRC, CAA &NPR" ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అలయన్స్ అధ్వర్యంలో నిన్న "శాంతి బాగ్" ప్రారంభమైనది. దాన్ని ప్రస్తావిద్దాం.

ఢిల్లీ షాహీన్ బాగ్ ధర్నా శిబిరం డిసెంబర్ 16న ప్రారంభమైనది. నిన్నటికి సరిగ్గా 40 రోజులు నిండింది. 40వ రోజు విజయవాడ ఆటో నగర్ లోని సనత్ నగర్ లో ఇది ప్రారంభమైనది. ఐతే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దీని వేళలుగా నిర్వాహకులు నిర్ణయించారు. కారణం వుంది. ప్రధానంగా శ్రామిక వృత్తులకు చెందిన ప్రజల నివాస ప్రాంతమిది. పగలు పనిచేయకపోతే పొట్టగడవని నిరుపేద కుటుంబాలు ఎక్కువ! చిన్న వర్తకులు, చిన్న పరిశ్రమల యజమానుల ఆర్ధిక స్థితి కూడా అంతంత మాత్రమే! తమ వర్తక వేళలు, పని వేళల్లో కొంత త్యాగం చేసి 6 గంటలకే ఇక్కడకు చేరే స్ఫూర్తితో చేసిన నిర్ణయమని తెలిసింది. అదే సమయానికి ఇంటి పనుల్ని ముగించుకొని ముస్లిం కుటుంబాల మహిళలు అక్కడకు చేరుకునేలా చేసిన నిర్ణయమని తెలిసింది. ఇదీ దీని నేపధ్యం!

నిన్న ప్రారంభిస్తున్న వార్త తెలిసి పరిశీలన కోసం వెళ్లాలని ఆసక్తి కలిగింది. నేను, రవిచంద్ర (పి.డి.ఎస్.యూ. రాష్ట్ర అధ్యక్షులు) సరిగ్గా ప్రారంభ సమయానికి నిన్న సాయంత్రం అక్కడకు చేరుకున్నాం (ఆహ్వానం లేకుండా పరిశీలకులుగా వెళ్లినప్పుటికీ, మమ్మల్ని గుర్తుపట్టిన ఒకరిద్దరు నిర్వాహకులు వేదిక పైకి ఆహ్వానించిన కారణంగా ఇచ్చిన మా సందేశాల సంగతి అప్రస్తుతం) మా పరిశీలనలో గమనించిన ఆసక్తికర అంశాలు మిత్రుల దృష్టికి తెస్తున్నా. ప్రధాన స్రవంతి ప్రచార మాధ్యమాల ద్వారా తగు ప్రాచుర్యం జరగని నేపధ్యం తెల్సిందే! కనీసం సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర అంశాలనైనా వెలుగులోకి తేవడం బాధ్యతగా భావించి చేస్తున్న ప్రయత్నామిది.

6-30pm కి సుమారు 100 మంది మహిళలు, 150 మంది పురుషులు, 50 మంది పిల్లలు చేరారు. ఇద్దరు బాలికలు శ్రావ్యంగా పాడిన "సారే జహా సే అచ్చా..." పాటతో...! ఈ సంఖ్య 7pm కి 200, 300, 100 కలిపి సుమారు 600 కి పెరిగింది. 8-15pm కి దగ్గరలోని మసీదు లో నమాజ్ సమయానికి పై సంఖ్య 350, 400, 150 కి పెరిగింది. పురుషులు 8-10pm కి నమాజ్ కి వెళ్లారు. తిరిగి 8-30pm కి శిబిరం వద్దకి చేరారు. అంతవరకూ స్త్రీలే నిర్వహించారు. ముగ్గురు మహిళల ప్రసంగాలు కన్నీళ్లు తెప్పించాయి. ముఖ్యంగా ఒక మహిళ చేసిన ప్రసంగంలో భావి విషాద భారతదేశ దృశ్యాన్ని మన కళ్లెదుట ఆవిష్కరింపజేసింది. ఇంతకంటే వివరాలకు వెళ్లడం లేదు. ఆమె మాటలు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటే, కన్నీటి సిరా చుక్కలతో ఈ అక్షర లేఖనం జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. 8-30pm కి మొత్తం సంఖ్య వెయ్యు మందికి చేరింది. మహిళలు 400 మందికి చేరారు. 9pm కి జనగణమన గానంతో ప్రోగ్రాం ముగిసింది. ప్రతిరోజూ ఇలాగే కొనసాగించాలని చివరలో నిర్వాహకులు ప్రకటించారు.

తల్లుల ఒడిలో పసిపిల్లలూ వున్నారు. ఇంకా మూడేళ్ల పిల్లల నుండి పదహారేళ్ళ నూనూగు యువకుల వరకూ వున్నారు. ఆ పిల్లలు ట్యూషన్లకి వెళ్లాల్సిన సమయమది. ఏ ఆందోళన వారిని అక్కడకు రప్పించింది? బురఖాలు ధరించిన మహిళలను ఏ భయం అక్కడకు రప్పించింది? అక్కడ జాతీయ జండా, గాంధీ, అంబేద్కర్ చిత్రాలు ధరిస్తున్న ప్రేక్షకుల గుండెల్లో ఏ భావోద్వేగాలు ఉన్నాయి? వారి గుండె చప్పుళ్ళు ఎలా వినిపిస్తాయి? వారి హృదయ వేదనల వీక్షణ ఏమిటి? వారి కళ్ళల్లో కనిపించే దృశ్యాలు ఏమిటి? వక్తలు ప్రసంగాలు వింటున్న వారి తదేక దృష్టి వెనక ప్రేరేపక అంశాలేమిటి? అవన్నీ చెప్పేందుకు మాటలు రావడం లేదు. అక్కడి బాధిత హృదయ స్పందనలు స్వయంగా హాజరై వినీ, కనీ తీరాల్సిందే! ప్రజాతంత్ర, లౌకిక, ప్రగతిశీల శక్తులు "చలో శాంతి బాగ్" చేపట్టి స్వయంగా తరించడమే మంచిది. ఐతే ఒక విషాద కాలంలో ఈ శిబిరం విజయవంతంగా ప్రారంభం కావడం సంతోషకరమైన పరిణామమే! కానీ కేవలం ముస్లిముల ఆందోళనగా కొనసాగడం విచారకరం! హిందూ ముస్లిం క్రిస్టియన్ బేధాలు లేకుండా NRC, CAA, NPR లది అందరి ఆందోళన, బాధగా మారకపోవడం లోటు! ఆ లోటు భర్తీకై పైన పేర్కొన్న ప్రగతిశీల శక్తులూ, సంస్థలూ పూనుకోవలసి ఉందని విజ్ఞప్తి!

✍ *ఇఫ్టూ ప్రసాద్* (పిపి)
జాతీయ కార్యదర్శి,
భారత కార్మిక సంఘాల సమాఖ్య
(INDIAN FEDERATION OF TRADE UNIONS----IFTU)
25-1-2020

Keywords : shaheen bagh, delhi, CAA, NRC, NPR, Vijayawada
(2020-02-28 17:32:27)No. of visitors : 233

Suggested Posts


నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

శాంతి ప్రదర్శన‌పై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులు

ఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC ల‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై

CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం

పౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది.

స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు

రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శన‌లు ఆపక పోతే

బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి. బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు.

రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్

పౌరసత్వ సవరణ చట్టం, ఏన్నార్సీ రెండూ కలిపి అమలు చేయడంలోనే ప్రమాదముందని భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

అర్నబ్ బ్యాచ్, ప్రజ్ఞా ఠాకూర్ లు చేస్తే గొప్పపని - కునాల్ కమ్ర చేస్తే మాత్రం నేరం

రిపబ్లిక్ టీవీ ఛీఫ్ అర్నబ్ గోస్వామి ప్ర‌యాణిస్తున్న విమానంలోనే ప్రయాణించిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా గోస్వామి దగ్గరికి వెళ్ళి ఆయనపై పలు ప్రశ్నలు గుప్పించాడు. దేశం నరేంద్ర మోడీ చేతుల్లో చాలా భద్రంగా ఉన్నదని చెప్పారు కదా

Search Engine

మతోన్మాద మూక ప్రాణాలు తీస్తుంటే - వీళ్ళు కడుపులో పెట్టుకొని రక్షించారు.
ఢిల్లీలో జరిగినవి ఇరు వర్గాల మధ్య అల్లర్లు కావు, బిజెపి,ఆరెస్సెస్ కలిసి చేసిన వ్యూహాత్మక, ప్రణాళికాబద్ధ దాడులు - విరసం
ఢిల్లీలో చెడ్డీ గ్యాంగ్ దాడులు: ఈ తల్లిని సజీవదహనం చేశారు
ఢిల్లీ : బీజేపీ నేతలపై కేసులకు ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి అర్దరాత్రి బదిలీ
ఢిల్లీ అల్లర్లు: ఆ బీజేపీ నేతల‌పై కేసులు నమోదు చేయండి - పోలీసులకు హైకోర్టు ఆదేశం
నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
మసీదును మేమే కాల్చాం... మా దేశంలో నిరసన తెలపడానికి వాళ్ళకు ఎంత ధైర్యం ? కెమెరా ముందు హిందుత్వ సభ్యులు
ఎన్డీటీవీ జర్నలిస్టులపై మతోన్మాద మూక దాడి - ఆపై హిందువులని తెలిసి వదిలేసిన దుండగులు
వీళ్ళు ప్రేమతో గులాబీలివ్వాలని చూశారు ... వాళ్ళు ద్వేషంతో దాడులు చేసి నెత్తుర్లు పారించారు
CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు
CAA,NRC: ఢిల్లీ శాంతి యుత నిరసనలపై చెడ్డీ గ్యాంగ్ దాడులు - పోలీసుల పాత్రపై అనుమానాలు
నిరసనపై నిరసన: వందలమంది హిందుత్వ వాదుల మధ్య ఆజాది అంటూ నినదించిన‌ యువతి
సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు
జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా
దళిత యువకుల‌పై దుర్మార్గ దాడి - స్క్రూడ్రైవర్‌ను వెనక నుంచి జొప్పించి హింసలు
CAA పౌరసత్వానికి మత పరీక్ష... అమెరికన్ ఫెడరల్ ప్యానెల్
ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు
వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !
మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?
ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ
భీమా కోరేగావ్ కేసు సమాంతర విచారణకు మహారాష్ట్ర‌ సర్కార్ నిర్ణయం
ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
more..


దేశవ్యాప్తంగా