భీం ఆర్మీ చీఫ్‌ ఆజాద్‌ను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించిన హైదరాబాద్ పోలీసులు

భీం

తెలంగాణ సీఎం కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం.. దేశమంతా ఆందోళనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదా అని.. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని ప్రకటించి 24 గంటలు కూడా కాకముందే హైదరాబాద్ పోలీసులు సీఏఏ ఆందోళనపై పంజా విసిరారు. ఇవాళ హైదరాబాద్‌లో సీఏఏ వ్యతిరేక ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను అరెస్టు చేశారు. మెహదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్‌లో నిర్వహిస్తున్న సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొనడానికి ఆయన తన అనుచరులతో కలసి వచ్చారు.

కాగా, ఈ ఆందోళనలకు అనుమతి లేదని చెబుతూ లంగర్‌హౌస్ పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు కొంత మంది భీం ఆర్మీ కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. వీరందరినీ సెక్షన్ 151 ప్రకారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు లేని నిరసన సభలో పాల్గొన్నందుకు ఆయనను అరెస్టు చేశామని ప్రకటించారు. అయితే, తన అరెస్టు తర్వాత ఆజాద్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. తనను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. కాని పోలీసులు ఆజాద్‌ను పోలీసు జీపులో హైదరాబాద్ అంతా తిప్పుతున్నట్లు తెలిసింది. చాలా సేపు హైదరాబాద్ మొత్తం తిప్పి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఆయన ప్రస్తుతం గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లు సమాచారం.

మరోవైపు చంద్రశేఖర్ అరెస్టుతో భీం ఆర్మీ, దళిత సంఘాలు, హక్కుల కార్యకర్తలు అక్కడ ఆందోళన నిర్వహించాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించాయి. కాగా భీం ఆర్మీ తెలంగాణ అధ్యక్షుడు సుజిత్ రావణ్, కర్నాటక అధ్యక్షుడు, ఆజాత్ పర్సనల్ డాక్టర్, లాయర్‌లను గోల్కొండ హోటల్‌లో పోలీసులు నిర్బంధించి తాళాలు వేశారు.

Keywords : CAA, Bhim Army, Cheif, Chandrasekar azad ravan, Hyderabad Police
(2024-03-16 11:07:54)



No. of visitors : 1042

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


భీం