ʹతెలంగాణలో నియంతృత్వం రాజ్యమేలుతుంది...ఈ అవమానాన్ని మర్చిపోంʹ


ʹతెలంగాణలో నియంతృత్వం రాజ్యమేలుతుంది...ఈ అవమానాన్ని మర్చిపోంʹ

ʹతెలంగాణలో

భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను హైదరాబాద్‌ పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఉదయం 6.55 నిమిషాలకు ఆయన్ను తిరిగి ఢిల్లీకి పంపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ), ఎన్నార్సీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్( టీఐఎస్‌ఎస్‌) విద్యార్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆజాద్‌ను ఆదివారం హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మెహిదిపట్నంలోని క్రిస్టల్‌ గార్డెన్‌లో జరిగే సమావేశంలో ఆజాద్‌ పాల్గొని అక్కడ ప్రసంగించాల్సి ఉంది. అయితే మార్గ మాధ్యలోనే ఆజాద్ ను అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుండు అర్దరాత్రి వరకు అనేక పోలీసు స్టేషన్లు తిప్పారు. ఆయన ఎక్కడ వున్నదీ ఎవ్వరికీ తెలియనివ్వలేదు పోలీసులు. భీం ఆర్మీ తెలంగాణ, ఛీఫ్ సుజిత్ రావణ్, ఆజాద్, డాక్టర్, లాయర్లను వాళ్ళు ఉన్న‌ హోటల్ లోనుండి బైటికి రానివ్వకుండా హౌజ్ అరెస్టు చేశారు.

కాగా ఆజాద్ విడుదల అయ్యాక ట్విట్టర్ ద్వారా స్పందించారు. తనను బలవంతంగా ఢిల్లీకి తీసుకెళ్తున్నారని ఆజాద్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అలాగే ʹʹతెలంగాణలో నియంతృత్వం తారాస్థాయికి చేరింది. ప్రజల నిరసన హక్కులను కొల్లగొడుతున్నారు. తొలుత మా అనుచరులపై లాఠీ చార్జ్‌ జరిపారు. తరువాత నన్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం విమానాశ్రయానికి తీసుకువచ్చి ఢిల్లీకి పంపుతున్నారు. బహుజన్ సమాజం ఈ అవమానాన్ని ఎప్పటికీ మరచిపోదు. త్వరలో తిరిగి వస్తాంʹʹ అని ట్వీట్‌ చేశారు.

Keywords : chandra shekhar azad, bhim army, hyderabad, telangana, arrest, delhi
(2020-02-26 16:21:33)No. of visitors : 283

Suggested Posts


0 results

Search Engine

మతోన్మాద మూక ప్రాణాలు తీస్తుంటే - వీళ్ళు కడుపులో పెట్టుకొని రక్షించారు.
ఢిల్లీలో జరిగినవి ఇరు వర్గాల మధ్య అల్లర్లు కావు, బిజెపి,ఆరెస్సెస్ కలిసి చేసిన వ్యూహాత్మక, ప్రణాళికాబద్ధ దాడులు - విరసం
ఢిల్లీలో చెడ్డీ గ్యాంగ్ దాడులు: ఈ తల్లిని సజీవదహనం చేశారు
ఢిల్లీ : బీజేపీ నేతలపై కేసులకు ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి అర్దరాత్రి బదిలీ
ఢిల్లీ అల్లర్లు: ఆ బీజేపీ నేతల‌పై కేసులు నమోదు చేయండి - పోలీసులకు హైకోర్టు ఆదేశం
నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
మసీదును మేమే కాల్చాం... మా దేశంలో నిరసన తెలపడానికి వాళ్ళకు ఎంత ధైర్యం ? కెమెరా ముందు హిందుత్వ సభ్యులు
ఎన్డీటీవీ జర్నలిస్టులపై మతోన్మాద మూక దాడి - ఆపై హిందువులని తెలిసి వదిలేసిన దుండగులు
వీళ్ళు ప్రేమతో గులాబీలివ్వాలని చూశారు ... వాళ్ళు ద్వేషంతో దాడులు చేసి నెత్తుర్లు పారించారు
CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు
CAA,NRC: ఢిల్లీ శాంతి యుత నిరసనలపై చెడ్డీ గ్యాంగ్ దాడులు - పోలీసుల పాత్రపై అనుమానాలు
నిరసనపై నిరసన: వందలమంది హిందుత్వ వాదుల మధ్య ఆజాది అంటూ నినదించిన‌ యువతి
సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు
జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా
దళిత యువకుల‌పై దుర్మార్గ దాడి - స్క్రూడ్రైవర్‌ను వెనక నుంచి జొప్పించి హింసలు
CAA పౌరసత్వానికి మత పరీక్ష... అమెరికన్ ఫెడరల్ ప్యానెల్
ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు
వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !
మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?
ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ
భీమా కోరేగావ్ కేసు సమాంతర విచారణకు మహారాష్ట్ర‌ సర్కార్ నిర్ణయం
ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
more..


ʹతెలంగాణలో