అర్నబ్ బ్యాచ్, ప్రజ్ఞా ఠాకూర్ లు చేస్తే గొప్పపని - కునాల్ కమ్ర చేస్తే మాత్రం నేరం


అర్నబ్ బ్యాచ్, ప్రజ్ఞా ఠాకూర్ లు చేస్తే గొప్పపని - కునాల్ కమ్ర చేస్తే మాత్రం నేరం

రిపబ్లిక్ టీవీ ఛీఫ్ అర్నబ్ గోస్వామి ప్ర‌యాణిస్తున్న విమానంలోనే ప్రయాణించిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా గోస్వామి దగ్గరికి వెళ్ళి ఆయనపై పలు ప్రశ్నలు గుప్పించాడు. దేశం నరేంద్ర మోడీ చేతుల్లో చాలా భద్రంగా ఉన్నదని చెప్పారు కదా అది ఎలాగో వివరిస్తారా ? రోహిత్ వేముల తల్లి రాధికను ఉద్దేశించి మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా ఆమె కులం ఏంటంటూ ప్రశ్నించి అవమానించారు కదా దీనిపై మీ జవాబేంటీ అర్నబ్ అని నిలదీశాడు కునాల్. అయితే కునాల్ ప్రశ్నలకు అర్నబ్ స్పందించకుండా చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకొని బిజీగా ఉండే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

ఇది నిన్న అంటే 28 జనవరి, 2020 న ఇండిగో విమానంలో జరిగిన సంఘటన‌

ఇక మరో సంఘటన సేమ్ విమానంలోనే... ఢిల్లీ నుండి భూపాల్ వెళ్తున్న విమానంలో ఎక్కిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తనకు కేటాయించిన సీటులో కాకుండా వికలాంగులు కూర్చునే సీట్లో కూర్చుంది. ఆమెను ఆ సీట్లో నుండి లేచి మరో సీట్లో కూర్చోవాలని విమాన సిబ్బంది ఎంత నచ్చజెప్పినా, బతిమిలాడినా ఆమె వినిపించుకోలేదు. తోటి ప్రయాణీకులు చెప్పినా ఆమె వినలేదు. పైగా ఎంపీని అవమానిస్తారా అంటూ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. దీంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు.

ఈ సంఘటన డిశంబర్ 21, 2019న స్పైస్ జెట్ విమానంలో జరిగింది.

ఇప్పుడు మరో సంఘటన ఇది అర్నబ్ గోస్వామీకి సంబంధించినదే...ఢిల్లీ నుండి పాట్నా వెళ్తున్న విమానంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రయాణిస్తున్నాడు. ఆయన కూర్చున్న సీటు దగ్గరికి రిపబ్లిక్ టీవీ జర్నలిస్టు వచ్చి తేజస్వీ యాదవ్ ను ప్రశ్నలడగం ప్రారంభించారు. ఇది ఇంటర్వ్యూ చేసేందుకు సరైన ప్లేస్ కాదని , మిగతా ప్రయాణీకులకు ఇబ్బంది కల్గుతుందని, ఇప్పుడు నేను మాట్లాడనని..ఎంత చెప్పినా ఆ రిపోర్టర్ వినిపించుకోకపోగా ప్రశ్నలు గుప్పిస్తూనే పోయింది. పక్కనున్న‌ ప్రయాణీకులు, విమాన సిబ్బంది ఆమెను ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు.
ఇది 2017 లో జరిగింది (ఈ వీడియో చూడాలనుకుంటే ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో లింక్ ఇది https://www.facebook.com/watch/?ref=external&v=561968734388602)

మొదటి సంఘటనలో విమానం కొద్ది సేపు కూడా ఆగ‌లేదు, ప్రయాణీకులెవరికీ ఏ ఇబ్బందీ జరగలేదు. ఇబ్బంది పడ్డది అర్నబ్ గోస్వామి మాత్రమే. రెండో సంఘటనలో విమానం ఆలస్యమవడమే కాక ప్రయాణీకులందరూ ఆమె అరుపులతో, విమానం ఆలస్యంతో ఇబ్బంది పడ్డారు. ఇక మూడో సంఘటన తేజస్వీ యాదవ్ నే కాదు ప్రయాణీకులకు, విమాన సిబ్బందికి ఇబ్బంది కల్గించినది

ప్రజ్ఞా సింగ్ చేసిన పనికి గానీ అర్నబ్ గోస్వామి శిష్యురాలు చేసిన పనికి గానీ కిక్కురుమనని కేంద్ర ప్రభుత్వం, విమానయాన సంస్థలకు కునాల్ కర్మ చేసింది మాత్రం పేద్ద తప్పుగా అనిపించింది.

మన ఘనత వహించిన పౌరవిమాన యాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కి కునాల్ కర్మ చేసింది మాత్రమే దేశద్రోహమనిపించింది. కునాల్ చేసిన పని ప్రయాణీకుల భద్రతకు ముప్పు అని ప్రకటించాడాయన పైగా కునాల్ ను అన్ని విమానయాన సంస్థలు నిషేధించాలని సూచించారు.

ప్రభువులవారు సూచన అంటే ఆదేశమే కదా...ముందు తమ విమానలో జరిగిన సంఘటన కాబట్టి ఇండిగో కునాల్ కర్మను నిషేధిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆ వెంటనే ప్రభుత్వ రంగ సంస్థ‌ ఎయిర్ ఇండియా నిషేధించింది, ఆపై స్పైస్ జెట్, గో ఎయిర్ లు కూడా కునాల్ తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి.

తన కామెడీ పంచ్ లతో మోడీ, అమిత్ షాలను, ఆయన భక్తులను గుక్కతిప్పుకోకుండా చేసే కునాల్ కర్మ అంటే మొదటినుండీ కోపమే.... సోషల్ మీడియాలో ఆయన సంధించే ప్రశ్నలకు జవాబు చెప్పలేక గిలగిలలాడుతారు భక్తులు. ఆ కసిని ఇలా తీర్చుకున్నారు. ఆయనను కొద్ది రోజులువిమానం ఎక్కకుండా ఆపగలరేమోకానీ ఆయన మోషాలపై ఆయన విసిరే పంచ్ లను, ఆయన సంధించే ప్రశ్నలను ఆపగలరా ?

Keywords : arnab gouswamy, bjp, kunal kamra, flight, republic tv
(2020-04-07 13:11:55)No. of visitors : 577

Suggested Posts


సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు

పౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు.

నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

శాంతి ప్రదర్శన‌పై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులు

ఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC ల‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై

CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం

పౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది.

స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు

రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శన‌లు ఆపక పోతే

బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన‌ సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న‌ కోర్టు

కర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి. బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు.

Search Engine

తబ్లిఘీ జమాత్: రెచ్చగొడుతున్న‌ మీడియా .... అందులోనూ కొత్తపద్దతులు ఎంచుకున్న దైనిక్ భాస్కర్
కరోనా దెబ్బకు భారత్‌లో 40 కోట్ల మంది కటిక పేదరికంలోకి : ఐక్యరాజ్యసమితి నివేదిక
మురికి వాడల్లో ఆహారం పంచుతున్న ముస్లిం యువకులపై దాడి...తీవ్ర గాయాలు
నరేంద్ర మోడీకి కమల్ హాసన్ బహిరంగ లేఖ‌!
లాక్ డౌన్ నిబందనలు గాలికి వదిలేసిన బీజేపీ ఎమ్మెల్యే... వందల మందితో పుట్టినరోజు వేడుకలు
We demand immediate and unconditional release of all political prisoners- DSU
ఒక వైపు లాక్ డౌన్,కరోనా భయం...దళితులపై అగ్రకులాల‌ దాడి, కాల్పులు,5గురికి తీవ్రగాయాలు
మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం
కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ
కరోనా: పెట్టుబడిదారీ అన్యాయాన్ని ధ్వంసం చేయండి - 54 కమ్యూనిస్టు యువజన సంఘాల‌ ప్రకటన
Communist youth organizations make a joint statement on COVID-19 pandemic
కరోనా ముసుగులో బీజేపీ వార్షికోత్సవాలా? సిగ్గు సిగ్గు - న్యూడెమోక్రసీ
288 రోజుల ఆమరణ నిరాహార దీక్ష... కన్ను మూసిన ప్రఖ్యాత విప్లవ గాయకురాలు
ʹమానవ విషాదంలోనూ మెజార్టీ హిందూ మనస్తత్వాన్ని రెచ్చగొట్టడం కరోనా కంటే ప్రమాదకరం - విరసంʹ
Coronavirus : Editors Guild of India criticises govt stance on news coverage, objects to UP copsʹ action against The Wire
కరోనా : మీడియాను ప్రభుత్వం బెదిరిస్తోంది...మండిపడ్డ ఎడిటర్స్ గిల్డ్
లాక్ డౌన్ ముగిసిన తర్వాత మన వ్యూహం ఏంటి?: కేంద్రానికి 800 మంది శాస్త్రవేత్తల సూటి ప్రశ్న
నిజాలు మాట్లాడినందుకు సీనియర్ జర్నలిస్టుపై కేసు !
లాక్ డౌన్ కారణంగా దేశంలో పెరిగిన గృహ హింస‌
ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
more..


అర్నబ్