మానవత్వంపై మళ్ళీ మతోన్మాద తూటా...షహీన్ బాగ్ ఉద్యమకారులపై కాల్పులు

మానవత్వంపై

NRC,CAA లకు వ్యతిరేకంగా ప్రజలు కొంత కాలంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న షహీన్ బాగ్ ప్రాంతంలోకి ఓ మతోన్మాది ప్ప్రవేశించి ప్రజలపైకి కాల్పులు జరిపాడు. రెండు రోజుల క్రితం ఈ ప్రాంతానికి అతి సమీపంలోని జామియా మిలియా యూనివర్సిటీలో విద్యార్థులపైకి రాంభక్త్ గోపాల్ ఉర్ఫ్ గోపాల్ శర్మ కాల్పులు జరిపిన ఘటన మరవక ముందే ఈ రోజు ఈ సంఘటన జరిగింది.

వందల మంది, స్త్రీలు, పిల్లలతో సహా అనేకమంది ప్రజలు నెల రోజులకు పైగా రాత్రిబవళ్ళు అక్కడ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అక్కడ‌ పోలీసుల బారికేడ్ ఉంది. అటువైపు వందల కొద్ది పోలీసులున్నారు. పోలీసువైపు వీపు ఉంచి ఉద్యమకారులపైకి ఓ వ్యక్తి కాల్పులు జరపడం అక్కడున్న అనేక మంది చూశారు. ఆ మతోన్మాది జై శ్రీరాం అని నినాదాలు ఇవ్వడం, ఈ దేశం హిందువులది మాత్రమే , మాదే విజయం అని అరవడాన్ని ప్రత్యక్ష సాక్షులు విన్నారు. అతను మూడు రౌండ్లు కాల్పులు జరిపాడని, తుపాకీ జామ్ అవడంతో మరిన్ని రౌండ్లు కాల్చలేకపోయాడని ప్రత్యక్ష సాక్షుల కథనం.

"మేము అకస్మాత్తుగా తుపాకీ కాల్పులు విన్నాము. కాల్పులు జరిపిన‌ వ్యక్తి జై శ్రీ రామ్ అని అరుస్తున్నాడు. అతని వద్ద సెమీ ఆటోమేటిక్ పిస్టల్ ఉంది అతను రెండు రౌండ్లు కాల్చాడు. పోలీసులు అతని వెనుక నిలబడి ఉన్నారు" అని ప్రత్యక్ష సాక్షి మీడియాకు చెప్పారు.

"అతను కాలుస్తుండగా తుపాకీ జామ్ అయ్యింది. అతని తుపాకీని చేతితో తడుతూ పరిగెత్తాడు వెళ్తూనే మళ్ళీ కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు, తరువాత తుపాకీని పొదల్లోకి విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. మాలో కొందరు మరియు పోలీసులు అతన్ని పట్టుకున్నారు, పోలీసులు అతన్ని తీసుకెళ్ళారు" అని ఆయన చెప్పారు.

ప్రజలపై కాల్పులకు తెగబడ్డ ఆ మతోన్మాది ఎవరు ? ఎక్కడి నుండి వచ్చాడు అనే సమాచారం ఇంకా తెలియలేదు. అయితే షహీన్ బాగ్ ఆందోళనకారులను ఉద్దేశించి కేంద్రమంత్రి అనిరాగ్ ఠాకూర్ వాళ్ళను షూట్ చేయండి అని చేసిన ఉపన్యాసం మొన్న, ఇవ్వాళ్ళ మతోన్మాదులు పాల్పడిన‌ కాల్పులకు తక్షణ ప్రేరణ అయ్యుంటుంది అనేది మాత్రం పచ్చి నిజం

Keywords : shaheen bagh, nrc, caa, gun firing, jamia milia university, police, RSS
(2024-04-09 20:07:20)



No. of visitors : 1568

Suggested Posts


ఢిల్లీ విద్యార్థులపై కాల్పులు జరిపిన ఈ ʹరామ భక్త్ గోపాల్ʹ ఎవరు ?

జామియా మిలియా విద్యార్థులపై కాల్పులు జరిపిన ఉన్మాది రామ భక్త్ గోపాల్ అనే బీజేపీ అభిమాని. సీఏఏ కు వ్యతిరేకంగా విద్యార్థులు శాంతి యుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ వ్యక్తి ర్యాలీవైపు దూసుకవచ్చి విద్యార్థులపైకి కాల్పులు జరపగా ఓ విద్యార్థి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న‌ వందలాది మంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు తప్ప కనీసం అతన్ని ఆపే ప్ర

ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు

సీఏఏను రద్దు చేయాలని ఎన్నార్సీని అమలు చేయొద్దనే డిమాండ్ తో ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు, జామియా ప్రాంత ప్రజలు వందలాది మంది ఈ రోజు పార్లమెంటుకు ర్యాలీ తీస్తుండగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

ఈ టెర్రరిస్టును హిందూ మహా సభ సత్కరిస్తుందట‌ !

జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై రాంభక్త్ గోపాల్ ఉర్ఫ్ గోపాల్ శర్మ కాల్పులు జరిపి ఓ విద్యార్థిని గాయపర్చడాన్ని హిందూ మహాసభ సమర్ధింది. విద్యార్థులపై కాల్పులు జరిపిన గోపాల్ శర్మను తాము సత్కరిస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. అతను నాథూరామ్ గాడ్సే వంటి గొప్ప జాతీయవాది అని హిందూ మహాసభ ప్రతినిధి అశోక్ పాండే పేర్కొన్నారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మానవత్వంపై