మా దొర అవ్వల్ దర్జ, మాటంటె తల గోసుకుంటడు - ఎన్.వేణుగోపాల్


మా దొర అవ్వల్ దర్జ, మాటంటె తల గోసుకుంటడు - ఎన్.వేణుగోపాల్

మా

(వీక్షణం ఫిబ్రవరి 2020 సంచికలో ఎన్.వేణుగోపాల్ రాసిన సంపాదకీయ వ్యాఖ్య - తెలంగాణ)

మా దొరంటే ఏమనుకుంటానవ్? మాటంటె మాటే గని మాట దప్పడు. మాట దప్పిండంటె తల గోస్కుంటడు. ఉల్లెక్కాల అనుకుంటానవా ఏంది? టుపాకి ఎంకట్రామడి పెగ్గెల తీర్గ అనిపిస్తాందా ఏంది? మారె పట్నంల నాలుగొద్దుల సంది జరిగిన ముచ్చట జెప్తే, వారీ నివద్దెరా అంటవ్ నువ్వే. ఇగ ఇను. దేశంల కెల్లి తుర్కోల్లందర్ని ఎల్లగొట్టుటానికి ఢిల్లిల మోడీ ఏదో ఇకుమతు జేస్తాండట గద. గది మంచిది గాదు, వాండ్లు, వాండ్ల తాతలు ముత్తాతలు గుడ ఈ దేశంల పుట్టి పెరిగి సచ్చినోల్లె, వాండ్లు ఈ దేశం బిడ్డలె అని అందరం అనుకుంటానం గద. పీరీల పండుగల మనం గుడ ధూల ఆడలేదా, పీరీలు ఎత్తిన ఉస్సేను సాబు కాల్లు మనిండ్లల్లల్ల గుడ కడుగలేదా. ఊళ్లె ఉన్న రెండు మూడు తుర్కలిండ్లోల్లు గుడ దస్ర రోజు జమ్మి కాడికి రాలేదా. ఎన్నడన్న కొట్లాట ఉన్నదా మనకు? ఇయాల మోడీ వచ్చి కొట్లాట బెట్టె. తెలంగాణోళ్లం ఈ కొట్లాటకు కట్టడి జేయాల్న లేదా? ఆ చట్టమేందో, నాకు నోరు తిర్గది గని, దాన్ని జేసుడు తప్పు, మన అన్నదమ్ముల మీద అనుమానం బెట్టుకునుడు, వాండ్ల మీద కత్తి దూసి వాండ్లు మన ఇంటోల్లు కాదు అని అనుడు తప్పు అనాలె గద. అట్ల దేశంలో తీరొక్క మనుషులు అనబట్టిరి, ఆఖరికి యేరే యేరే రాష్ట్రాల్ల ముక్కెమంత్రులు గుడ అన్నరట గద. కాని మన దొర అనకపాయె. ఔననకపాయె, కాదనకపాయె. ఏమన్నంటే ఆడ నీను ఓటెయ్యలేదు గద, మోడీ సాబుకు జై అనలేదు గద అనబట్టె. మల్ల ఇంకో దిక్కేమో మోడీ సాబు దొంగపని జేసిండు అని జులూస్ దీస్తమన్నోల్లను కొట్టిపిచ్చె. జైలుఖాన్ల నూకె. సభ పెట్టనియ్యకపాయె. దొర అటున్నడా, ఇటున్నడా నాకేమి సమజ్ గాలె. వారెవ్వా, బలెగున్నది కత. కట్టిన యేషమేమో మాయల మరాఠీది, చేసే చేతనేమో బుడ్డరికానుది. ఏందిరా గోస ఇట్లొచ్చింది అని పరేషాన్ల పడితి. ఇగట్లున్నదా కత. చటుక్కున మెరుపు మెరిసె. తెలంగాణంతట షహర్లల్ల ఓట్లొచ్చె గద. అన్నాలం పాడుగాను ఒక మనిషికి ఓటుకు మూడు ఏలట, ఐదు ఏలట, ముప్పై ఏలట, యాబై ఏలట, తులం బంగారమట. ఏంటివి బాంచెన్ అవి పైసలా చింతగింజలా? గంత గనం పైసలు బోసి కొనుక్కునుడెందుకు? ఎట్లనైనా సర్కారు నీదేనాయె, నాలుగేండ్లదాక నిన్ను కదిలిచ్చెటోడు లేకనేపాయె. అయినా గన్ని పైసలు బోసి నాదే అతికారం అని రుజువు జేసుకోవాల్నా? గట్ల అగ్గగ్గలు బడి పైచేయి అనిపిచ్చుకున్నాక నాదే గెలుపు అని ఎట్ల అనబుద్దయితది బాంచెన్? ఆ గెలుపు ఎట్లొచ్చిందో నీకు దెల్వదా? దేవుడున్నడో లేడో అందరికన్న ఎక్కువ దెలిసేది అయ్యగారికే గద, దేవునికి పెట్టిన ప్రసాదమంత ఇంటికే గద. గట్లనే నీ ఓట్లు నువ్వే కొనుక్కున్నవని, బెదిరిచ్చి, బుదగరిచ్చి, లొంగదీసి సంపాయించినవని అందరికన్న ఎక్కువ నీకె దెలుసు గద. సరె పోనీ, ఆ గెలుపు సంగతి జెప్పుటానికి పత్రికలోల్లను పిలిస్తివి. ఆ జోష్ ల మోడీ చట్టం మీద కీకలేస్తివి. ఆ చట్టానికి ఖిలాఫ్ ల నువ్వే కొట్లాడ్తనంటివి. అందరు ముక్కెమంత్రులను ఒక్క కాడికి దెచ్చి, నువ్వే వాళ్ల ముందర నిలబడ్తనంటివి. రేపు అసెంబ్లిల తీర్మానం గుడ జేస్తనంటివి. అబ్బ నా చెవుల తుప్పు వదిలిపోయిందనుకో. అంతమంచిగనే ఉన్నది గని దొరా, పొద్దూకంగ గా రంకెలేస్తివి, మర్నాడు తెల్లారంగనే నీ పోలీసులు గాయినెవలు, నీ పేరున్నోడె, గాయినెను లోపల నూకిరి. గాయినె గుడ గా చట్టానికి ఖిలాఫ్ గ మాట్లాడెతందుకే ఒచ్చిండట గాదు బాంచెన్. గాయినె సభకు పోయినోల్ల మీద నీ పోలీసులు లాఠీలు గుడ ఇరగ్గొట్టిండ్రట గద. ఇంతకు నువు గా మోడీ చట్టానికి ఖిలాఫా కాదా బాంచెన్?
- ఎన్.వేణుగోపాల్

Keywords : Telangana, NRC, CAA, KCR, AZAD, Arrest, Police
(2020-02-26 16:23:40)No. of visitors : 267

Suggested Posts


ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ

ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోం

నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

Search Engine

మతోన్మాద మూక ప్రాణాలు తీస్తుంటే - వీళ్ళు కడుపులో పెట్టుకొని రక్షించారు.
ఢిల్లీలో జరిగినవి ఇరు వర్గాల మధ్య అల్లర్లు కావు, బిజెపి,ఆరెస్సెస్ కలిసి చేసిన వ్యూహాత్మక, ప్రణాళికాబద్ధ దాడులు - విరసం
ఢిల్లీలో చెడ్డీ గ్యాంగ్ దాడులు: ఈ తల్లిని సజీవదహనం చేశారు
ఢిల్లీ : బీజేపీ నేతలపై కేసులకు ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి అర్దరాత్రి బదిలీ
ఢిల్లీ అల్లర్లు: ఆ బీజేపీ నేతల‌పై కేసులు నమోదు చేయండి - పోలీసులకు హైకోర్టు ఆదేశం
నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
మసీదును మేమే కాల్చాం... మా దేశంలో నిరసన తెలపడానికి వాళ్ళకు ఎంత ధైర్యం ? కెమెరా ముందు హిందుత్వ సభ్యులు
ఎన్డీటీవీ జర్నలిస్టులపై మతోన్మాద మూక దాడి - ఆపై హిందువులని తెలిసి వదిలేసిన దుండగులు
వీళ్ళు ప్రేమతో గులాబీలివ్వాలని చూశారు ... వాళ్ళు ద్వేషంతో దాడులు చేసి నెత్తుర్లు పారించారు
CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు
CAA,NRC: ఢిల్లీ శాంతి యుత నిరసనలపై చెడ్డీ గ్యాంగ్ దాడులు - పోలీసుల పాత్రపై అనుమానాలు
నిరసనపై నిరసన: వందలమంది హిందుత్వ వాదుల మధ్య ఆజాది అంటూ నినదించిన‌ యువతి
సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు
జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా
దళిత యువకుల‌పై దుర్మార్గ దాడి - స్క్రూడ్రైవర్‌ను వెనక నుంచి జొప్పించి హింసలు
CAA పౌరసత్వానికి మత పరీక్ష... అమెరికన్ ఫెడరల్ ప్యానెల్
ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు
వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !
మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?
ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ
భీమా కోరేగావ్ కేసు సమాంతర విచారణకు మహారాష్ట్ర‌ సర్కార్ నిర్ణయం
ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
more..


మా