దేశమంతటా ʹషాహీన్ బాగ్ʹ లు పుట్టుకురావాలి..!!

దేశమంతటా

సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాగ్ లో 50 రోజులుగా సాగుతున్న నిరసన ప్రదర్శనలపై ఎస్ ఏ డేవిడ్ అనే రచయిత తన ఫేస్ బుక్ వాల్ పై పెట్టిన పోస్ట్ యదాతథంగా....

ʹడేగʹ చూపులో ఓ ప్రత్యేకత ఉంటుంది. మనుషులు సెకనుకు 50-60 ఫ్రేములు మాత్రమే చూడగలిగితే డేగ మాత్రం సెకనుకు 100 కు పైగా ఫ్రేములను కచ్చితంగా గుర్తించగలదని పక్షి శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. దాన్ని తీక్షనైనా చూపులే పరిసరాలను వేగంగా నిశితంగా పరిశీలించేలా చూస్తాయి.

ʹషాహీన్ʹ (Shaheen) అని మీరు గూగుల్ లో టైపు చేసి చూడండి. ʹషాహీన్ ఫాల్కన్ʹ (Shaheen Falcon)అనే డేగ ప్రత్యక్ష మవుతుంది. షాహీన్ అంటే ʹడేగʹ అనే అర్థం. దక్షణ ఆసియాలోనే కనిపించే అరుదైన డేగ ఇది.

ఇక ʹబాగ్ʹ అంటే తోట, ఉద్యానవనం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా.☺

బహుశా ఆ పేరు లో ఉన్న ప్రత్యేకత వలనో ఏమో ʹషాహీన్ బాగ్ʹలోని ప్రజలు CAA, NRC లను అమలుచేస్తే వచ్చే ప్రమాదాలను అందరికంటే ముందుగానే పసిగట్టి ఆందోళన బాట పట్టారు..!

డిసెంబరులో జామియా మిల్లియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసులు దాడులు చేసిన ఘటనను ప్రపంచమంతా వీస్తుపోయేలా చూసింది. పోలీసుల అమానుష దాడి నుంచి తోటి విద్యార్థిని కాపాడ్డానికి ఇద్దరు జామియా యూనివర్శిటీ ముస్లిం అమ్మాయిలు (Ayesha Renna & Ladeeda Farzana )చూపించిన ధైర్యసాహసాలు చాలామందికి స్ఫూర్తినిచ్చాయి.

ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకున్న వాళ్లలో ʹషాహీన్ బాగ్ʹ ప్రజలు ముఖ్యులు. తమ పక్కనే ఉన్న యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు విరుచుకు పడుతుంటే చూస్తూ ఉండలేకపోయారు. ఏదో ఒకటి చేయాలని ఆలోచించారు. తమ ప్రాంతంలోనే ఒక గ్రౌండులో నిరసనదీక్షకు కూర్చున్నారు. కేవలం గుప్పెడు మంది నిరసనకు కూర్చుంటే పట్టించుకునేది ఎవరు? పోలీసులు కూడా అదే అనుకున్నారు. కొద్దిసేపు అరచి వెళ్లిపోతారులే అని భావించారు. కానీ అలా జరగలేదు. ఆ కొద్దిమందికి తోడుగా ఇంకొంతమంది వచ్చి కూర్చున్నారు. ఇంట్లో కూర్చుని చేసేది ఏముంది అనుకున్నారో ఏమో క్రమక్రమంగా సాయంత్రం అయితే చాలు పిల్లా, పెద్దలు, పండు ముసలి వరకూ అందరూ వచ్చి కుర్చోవడం ఓ రోజు వారి వ్యవహారంగా మారిపోయింది.

ఇప్పుడీ ʹషాహీన్ బాగ్ʹ జాతీయస్థాయి ప్రతిఘటనకు మారుపేరుగా మారింది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాలు చేసే నిరసనగా మారింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రేరణగా మారిపోయింది. అందుకే దేశం నలుమూలల నుండి మేధావులు, ఉద్యమకారులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, విద్యార్థులు, రైతులు తమ సంఘీభావం ప్రకటించడానికి వెళ్లివస్తున్నారు. చుట్టుపక్కల వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఆహారాన్ని, మంచినీళ్ళని, బ్లాంకెట్లని అందిస్తున్నారు.

షాహీన్ బాగ్ మహిళలు మొదలెట్టిన ఈ శాంతియుత నిరసన ఇతర ప్రాంతాలకు విస్తరించకూడదని, దాన్ని విచ్చిన్నం చేయడానికి బీజేపీ నేతలు, మంత్రులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్మాద మూకలను నిరసన కారులపైకి ఉసిగొల్పుతున్నారు. యాక్టివ్ గా ఉన్న విద్యార్థులపై దేశద్రోహ కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ఎన్ని ఆటంకాలు కల్పించిన తన శాంతియుత నిరసన కొనసాగుతూనే వుంటుంది అక్కడివాళ్ళు నిరూపించి చూపుతున్నారు.

జామియా మిల్లియా యూనివర్సిటీ లోని ఇద్దరు ముస్లిం అమ్మాయిలు చూపిన ధైర్యసాహసాలు ఒక నిప్పును రాజేశాయి. నెమ్మదిగా ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అలుముకుంటోంది..ఇప్పుడు కావాల్సింది కూడా అదే. దేశమంతటా షాహీన్ బాగ్ లు పుట్టుకురావాలి.

హ్యాట్సాప్ జామియా..✊
హ్యాట్సాప్ షాహీన్ బాగ్..✊

- SA David

(https://www.facebook.com/photo.php?fbid=628899291254829&set=a.140394543438642&type=3&theater)

Keywords : Shaheen Bagh, Delhi, Reject CAA, NRC, NPR, Protests
(2024-03-09 15:12:00)



No. of visitors : 456

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


దేశమంతటా