నకిలీ వీడియోలు తయారు చేస్తున్న బీజేపీ... ప్రచారం చేస్తున్న మీడియా


నకిలీ వీడియోలు తయారు చేస్తున్న బీజేపీ... ప్రచారం చేస్తున్న మీడియా

నకిలీ

ʹCAA,NRCలకు వ్యతిరేకంగా షహీన్‌ బాగ్‌లో ధర్నా చేస్తున్న ఆడవాళ్లంతా డబ్బులు తీసుకుంటున్నారు. 500, 700 రూపాయలు తీసుకొని షిప్టుల పద్ధతిలో ధర్నాకు కూర్చుంటారు...అవును బాయ్‌ʹ అని ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటుండగా, ʹసబ్‌ కాంగ్రెస్‌ కా ఖేల్‌ హై (అదంతా కాంగ్రెస్‌ పార్టీ డ్రామా) ʹ అని మూడో వ్యక్తి వ్యాఖ్యానించిన ఓ వీడియోను బీజేపీ సోషల్‌ మీడియా హెడ్‌ అమిత్‌ మాలవియా జనవరి 15వ తేదీన ట్వీట్‌ చేశారు. అంతా కాంగ్రెస్‌ డ్రామా అంటూ ఆయన కూడా నొక్కి చెప్పారు.
ఆ వీడియోలో ఉన్న వాస్తవాస్తవాలను తెలుసుకోకుండానే ʹటైమ్స్‌ నౌʹ టీవీ ఆ వీడియోను ప్రసారం చేసింది. ʹఇది స్టింగ్‌ ఆపరేషన్‌ లా ఉంది. షహీన్‌ బాగ్‌లో డబ్బులు తీసుకొని ధర్నా చేస్తున్న ఆడవాళ్ల గురించి అక్కడ మాట్లాడుకుంటున్న గుర్తుతెలియని వ్యక్తులను రహస్యంగా చిత్రీకరించినట్లుంది. వాస్తవం ఏదో మనకు స్పష్టంగా తెలియదు. బీజేపీ చేతికి ఈ వీడియో ఎలా వచ్చిందో తెలియదు. బీజేపీయే స్వయంగా ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ చేసిందా? ఎవరైనా చేసి బీజేపీ చేతికి ఇచ్చారా? తెలియదుʹ అంటూ జర్నలిస్ట్‌ మెఘా ప్రసాద్‌ వ్యాఖ్యానంతో ఆ వీడియోను ʹటైమ్స్‌ నౌʹ పూర్తిగా ప్రసారం చేసింది.
ʹప్రొటెస్ట్‌ఆన్‌హైర్‌ʹ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ʹరిపబ్లిక్‌ టీవీʹ చర్చా కార్యక్రమాన్ని చేపట్టగా, ʹడబ్బులకు ఆందోళన చేస్తున్నారా?ʹ అంటూ ʹఇండియా టుడేʹ టీవీ కూడా చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. బీజేపీ గుజరాత్‌ ఎమ్మెల్యే హర్ష్‌ సాంఘ్వీ, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ప్రీతీ గాంధీ, మాజీ శివసేన సభ్యులు రమేశ్‌ సోలంకి, బీజేపీ ఢిల్లీ ఐటీ సెల్‌ హెడ్‌ పునీత్‌ అగర్వాల్, సినీ నిర్మాత అశోక్‌ పండిట్‌లు తమ తమ వ్యాఖ్యానలతో ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.

నకిలీ వీడియోలను, వార్తలను ఎప్పటికప్పుడు కనిపెట్టే ʹఆల్ట్‌ న్యూస్, లాండ్రీన్యూస్‌ʹలు వీడియోను ఫ్రేమ్, ఫ్రేమ్‌ తనిఖీ చేయగా, ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్న వెనకాల ఓ షాపు అద్దం మీద స్పష్టంగా ʹ9312484044ʹ అనే నెంబర్‌ కనిపించింది. ఆల్ట్‌ న్యూస్, లాండ్రీ న్యూస్‌కు చెందిన ఇద్దరు రిపోర్టర్లు ఆ నెంబర్‌ పట్టుకొని గూగుల్‌ సర్చ్‌ ద్వారా వెళ్లగా ʹకుస్మీ టెలికమ్‌ సెంటర్‌ʹ అనే మొబైల్‌ షాప్‌ కనిపించింది. ఆ ఫోన్‌ నెంబర్‌ ఆ షాపుదే. వీడియోలో కనిపించే గోడ, దాని మీద పోస్టర్లు కూడా అచ్చం అలాగే షాపు రెక్క మీద ఉన్నాయి. షహీన్‌ బాగ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో పూల్‌ ప్రహ్లాద్‌పూర్‌లో ఆ షాపు ఉంది. తుగ్లకాబాద్‌ మెట్రో స్టేషన్‌కు సమీపంలో 134 నెంబర్‌ షాపది. అశ్వని కుమార్‌ అనే 38 ఏళ‍్ల వ్యక్తి ఆ షాపు యజమాని. ఆయనకు 70 ఏళ్ల తండ్రి కూడా ఉన్నారు. 8–10 చదరపు గజాల వెడల్పుతో ఉన్న ఆ షాపులో సిగరెట్లు, గుడ్లు, డేటా ప్లాన్స్, చిప్స్‌ అమ్ముతున్నారు. ఆ షాపుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ అడ్వర్టయిజ్‌ బోర్డులు కూడా ఉన్నాయి.

ఆ షాపులో సిగరెట్లు కొనుక్కున్న ఇద్దరు రిపోర్టర్లు అశ్వని కుమార్‌తో పిచ్చాపాటిగా రాజకీయాలు మాట్లాడుతు వచ్చారు. ఆ షాపు గోడలకు మోదీ, ఇతర బీజేపీ నేతల ఫొటోలు ఉన్నాయి. బీజేపీలో పనిచేస్తారా? అని ప్రశ్నించగా, తనను తాను సిన్సియర్‌ కార్యకర్తనని చెప్పుకున్నారు. సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ అవుతున్న వీడియో తన షాపు ముందు తీసిందే అని మాటల సందర్భంలో అంగీకరించారు. అయితే తాను తీయలేదని, ఎవరో తీశారని చెప్పారు. ʹమీ వృద్ధులకు ప్రభుత్వం ఏం చేస్తోందిʹ అని అశ్వని కుమార్‌ తండ్రిని ప్రశ్నించగా బీజేపీ ఏమీ చేయడం లేదు, ఆప్‌ ఏమీ చేయడం లేదని చెప్పారు. ʹసబ్‌ కాంగ్రెస్‌ కా ఖేల్‌ హైʹ అని వీడియోలో ఉన్న గొంతును పోలినట్టే ఆయన స్వరం ఉంది.

మరోసారి వీడియో ఫ్రేమ్‌లను ఆ ఇరువురు రిపోర్టర్లు పరిశీలించగా, షాపు బయటి నుంచి కాకుండా షాపు లోపలి నుంచే తీసినట్లు తెలుస్తోంది. రిపోర్టర్లు సిగరెట్‌ తాగుతున్నప్పుడే అశ్వని కుమార్‌ తన సెల్‌ ఫోన్‌తో వారిని వీడియోతీసి ʹనా అనుమతి లేకుండా సిగరెట్లు తాగుతున్నారుʹ అని కాప్షన్‌ పెడితే ఎలా ఉంటుందని కూడా వారిని ప్రశ్నించారు. ఆ తర్వాత స్థానిక బీజేపీ నాయకులు బన్వర్‌ సింగ్‌ రాణాను రిపోర్టర్లు పరిచయం చేసుకొని షహీన్‌ బాగ్‌ గురించి ʹస్టింగ్‌ ఆపరేషన్‌ʹ ఎవరు చేశారని ప్రశ్నించగా, తమ పోరగాడేనని, సమీపంలో మొబైల్‌ షాపు నడుపుతున్నారని చెప్పారు. పరిచయం చేయమని అడగ్గా ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ ఎన్నికలయ్యాక వస్తే పరిచయం చేస్తానని చెప్పారు.

Keywords : CAA, NRC, SHAHEENBAGH, DELHI, BJP
(2020-08-15 01:23:35)No. of visitors : 446

Suggested Posts


సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు

పౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు.

నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

శాంతి ప్రదర్శన‌పై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులు

ఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC ల‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం

పౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది.

స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన‌ సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న‌ కోర్టు

కర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు

రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శన‌లు ఆపక పోతే

బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్

పౌరసత్వ సవరణ చట్టం, ఏన్నార్సీ రెండూ కలిపి అమలు చేయడంలోనే ప్రమాదముందని భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Search Engine

రాముడిని విమర్షించాడనే కారణంతో కత్తి మహేష్ అరెస్ట్
ఢిల్లీలో జరిగిన దాడుల కుట్రలను బైటపెట్టిన కారవాన్ పత్రిక....ఆ పత్రిక జర్నలిస్టులపై దాడి, లైంగిక వేధింపులు
ఏడు వందల ఇరవై గంటల ఆందోళన...కనుచూపు మేరలో లేని ఉపశమన ఆశారేఖ
మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
more..


నకిలీ