ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు


ఢిల్లీ జామియా విద్యార్థులపై పోలీసుల దుర్మార్గ దాడి - అనేకమందికి గాయాలు

ఢిల్లీ

సీఏఏను రద్దు చేయాలని ఎన్నార్సీని అమలు చేయొద్దనే డిమాండ్ తో ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు, జామియా ప్రాంత ప్రజలు వందలాది మంది ఈ రోజు పార్లమెంటుకు ర్యాలీ తీస్తుండగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ లో అనేక మంది విద్యార్థినీ విద్యార్థులకు , స్థానిక మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 40 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో ధృవీకరించని ఖాతాలు చెబుతున్నాయి. గాయపడిన నిరసనకారులను అన్సారీ హెల్త్ సెంటర్, హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ మరియు అల్ షిఫా ఆసుపత్రికి తరలించారు.

జామియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులతో సహా జామియా స్థానికులు జామియా కోఆర్డినేషన్ కమిటీ (జెసిసి) నేతృత్వంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మరియు రాబోయే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) కు నిరసనగా జామియా గేట్ 7 నుండి పార్లమెంటుకు కవాతు మొదలుపెట్టారు. ʹహమ్ కాగజ్ నహీ దిఖాయెంగేʹ (మేము పత్రాలను చూపించము), ʹజబ్ నహిన్ డ‌రే హమ్ హొరోన్ సే తోహ్ క్యున్ డ‌రే హమ్ ఆరాన్ సేʹ (మేము బ్రిటిష్ వారికే భయపడనప్పుడు ఇతరులకు ఎందుకు భయపడాలి) అనే నినాదాలతో ఉద్యమకారులు ర్యాలీ తీశారు.. మహిళలు ముందు నడుస్తుండగా పురుషులు రోడ్ల ఇరువైపులా హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి ముందుకు కదిలారు.

"మేమురెండు నెలలుగా నిరసన తెలుపుతున్నాము. కనీసం మాతో మాట్లాడటానికి ప్రభుత్వం నుండి ఏ ఒక్క‌రూ రాలేదు. అందువల్లే మేమే వారితో మాట్లాడటానికి వెళ్లాలనుకుంటున్నాముʹʹ అని జెబా అన్హాద్ అనే ఉద్యమకారుడు పిటిఐతో అన్నారు.

కాగా వీరి ర్యాలీ హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ వద్దకు చేరుకోగానే వాళ్ళను వందలాది మంది పోలీసులు అడ్డగించారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పిన పోలీసులకు ఉద్యమకారులకు కొద్ది సేపు వాగ్వివాదం జరిగింది. ఒకవైపు ఉద్యమకారులు పోలీసులతో మాట్లాడుతుండగానే పోలీసులు లాఠీలతో హటాత్తుగా ఉద్యమకారులపై విరుచుకపడ్డారు. చెల్లాచెదురైన ఉద్యమకారులను పోలీసులు తరిమి తరిమి కొట్టారు. పోలీసుల దెబ్బలకు అనేక మంది స్పృహకోల్పోయారు.

Keywords : CAA, NRC, NPR, Delhi, jamia milia uiniversity, students, students, lathicharge
(2020-08-03 09:30:43)No. of visitors : 386

Suggested Posts


మానవత్వంపై మళ్ళీ మతోన్మాద తూటా...షహీన్ బాగ్ ఉద్యమకారులపై కాల్పులు

NRC,CAA లకు వ్యతిరేకంగా ప్రజలు కొంత కాలంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న షహీన్ బాగ్ ప్రాంతంలోకి ఓ మతోన్మాది ప్ప్రవేశించి ప్రజలపైకి కాల్పులు జరిపాడు. రెండు రోజుల క్రితం ఈ ప్రాంతానికి అతి సమీపంలోని జామియా మిలియా యూనివర్సిటీలో విద్యార్థులపైకి రాంభక్త్ గోపాల్ ఉర్ఫ్ గోపాల్ శర్మ కాల్పులు జరిపిన ఘటన మరవక ముందే ఈ రోజు ఈ సంఘటన జరిగింది.

ఢిల్లీ విద్యార్థులపై కాల్పులు జరిపిన ఈ ʹరామ భక్త్ గోపాల్ʹ ఎవరు ?

జామియా మిలియా విద్యార్థులపై కాల్పులు జరిపిన ఉన్మాది రామ భక్త్ గోపాల్ అనే బీజేపీ అభిమాని. సీఏఏ కు వ్యతిరేకంగా విద్యార్థులు శాంతి యుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ వ్యక్తి ర్యాలీవైపు దూసుకవచ్చి విద్యార్థులపైకి కాల్పులు జరపగా ఓ విద్యార్థి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న‌ వందలాది మంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు తప్ప కనీసం అతన్ని ఆపే ప్ర

ఈ టెర్రరిస్టును హిందూ మహా సభ సత్కరిస్తుందట‌ !

జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై రాంభక్త్ గోపాల్ ఉర్ఫ్ గోపాల్ శర్మ కాల్పులు జరిపి ఓ విద్యార్థిని గాయపర్చడాన్ని హిందూ మహాసభ సమర్ధింది. విద్యార్థులపై కాల్పులు జరిపిన గోపాల్ శర్మను తాము సత్కరిస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. అతను నాథూరామ్ గాడ్సే వంటి గొప్ప జాతీయవాది అని హిందూ మహాసభ ప్రతినిధి అశోక్ పాండే పేర్కొన్నారు.

Search Engine

పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
వరవరరావు ఆరోగ్యం గురించి పారదర్శక, అధికారిక సమాచారం ఇవ్వండి...వీవీ కుటుంబం డిమాండ్
వరవరరావును విడుదల చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లో సాహితీవేత్తల ప్రదర్శన‌
గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డే‌కు ప్రతిష్టాత్మక అవార్డు
more..


ఢిల్లీ