ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం


ʹఅర్బన్ నక్సల్ʹ అంటే ఎంటో, ఎవరో మాకు తెలియదు - కేంద్ర ప్రభుత్వం

ʹఅర్బన్

ʹʹసీఏఏను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న ర్యాలీలకు కాంగ్రెస్ సహా అర్బన్ నక్సల్స్ మద్దతు ఇస్తున్నారుʹʹ
- గతేడాది డిసెంబర్ 18న జార్ఖండ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడీ

ʹʹజమ్మూ కశ్మీర్‌లోని టెర్రరిస్టులకు అర్బన్ నక్సల్స్‌కు వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకుంటాముʹʹ
- గతేడాది నవంబర్‌ 16న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ʹʹఅర్బన్ నక్సల్‌కు అతి పెద్ద ఉదాహారణ అరవింద్ కేజ్రివాలేʹʹ
- ఢిల్లీ ఎన్నికల సభలో ఢిల్లీ బీజేపీ ఛీఫ్ మనోజ్ తివారి

ఇలా ప్రధాని, హోమంత్రి, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు రోజూ అర్బన్ నక్సలైట్ల గురించి మాట్లాడుతూనే ఉంటారు. జేఎన్యూ విద్యార్థులు మొదలుకొని అరవింద్ కేజ్రీవాల్ దాకా వాళ్ళకు నచ్చని వాళ్ళను అర్బన్ నక్సలైట్లని, తుక్డే తుక్డే గ్యాంగ్ అని విమర్షలు చేస్తుంటారు. రోజూ ఇలా మాట్లాడేవారికి ʹఅర్బన్ నక్సలైట్లుʹ, ʹతుకుడా తుకుడా గ్యాంగ్ʹ అంటే ఎవరో తెలియదట‌ నిజమే ఆ విషయం వాళ్ళే చెప్పారు.

అర్బన్ నక్సల్స్ అంటే ఏంటో తమకు తెలియదని, అసలు ఆ పదమే తమ వద్ద లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమచార హక్కు చట్టం ద్వారా ఇండియాటుడే సంస్థ‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం పై వివరణ ఇచ్చింది. అంతే కాకుండా ʹతుక్టే తుక్డే గ్యాంగ్ʹ అనే పదానికి కూడా అర్థం తెలియదని, ఆ పదమూ తమ రికార్డుల్లో లేదని ఆర్‌టీఐ ద్వారానే వచ్చిన మరో ప్రశ్నకు మంత్రిత్వ శాఖ కొద్ది రోజుల క్రితం సమాధానం ఇచ్చింది.

అసలు అర్బన్ నక్సలైట్లు, తుక్డే తుక్డే గ్యాంగ్ అనేవే లేవని ప్రభుత్వమే స్పష్టంగా చెబుతుంటే ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించేవాళ్ళు మాత్రం రోజూ అర్బన్ నక్సలైట్లు, తుక్డే తుక్డే గ్యాంగ్ అనే నామ జపంచేస్తున్నరు.

Keywords : modi, amit shah, urban naxalite, tukda tukda gang, bjp
(2020-02-27 04:55:17)No. of visitors : 325

Suggested Posts


0 results

Search Engine

మతోన్మాద మూక ప్రాణాలు తీస్తుంటే - వీళ్ళు కడుపులో పెట్టుకొని రక్షించారు.
ఢిల్లీలో జరిగినవి ఇరు వర్గాల మధ్య అల్లర్లు కావు, బిజెపి,ఆరెస్సెస్ కలిసి చేసిన వ్యూహాత్మక, ప్రణాళికాబద్ధ దాడులు - విరసం
ఢిల్లీలో చెడ్డీ గ్యాంగ్ దాడులు: ఈ తల్లిని సజీవదహనం చేశారు
ఢిల్లీ : బీజేపీ నేతలపై కేసులకు ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి అర్దరాత్రి బదిలీ
ఢిల్లీ అల్లర్లు: ఆ బీజేపీ నేతల‌పై కేసులు నమోదు చేయండి - పోలీసులకు హైకోర్టు ఆదేశం
నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
మసీదును మేమే కాల్చాం... మా దేశంలో నిరసన తెలపడానికి వాళ్ళకు ఎంత ధైర్యం ? కెమెరా ముందు హిందుత్వ సభ్యులు
ఎన్డీటీవీ జర్నలిస్టులపై మతోన్మాద మూక దాడి - ఆపై హిందువులని తెలిసి వదిలేసిన దుండగులు
వీళ్ళు ప్రేమతో గులాబీలివ్వాలని చూశారు ... వాళ్ళు ద్వేషంతో దాడులు చేసి నెత్తుర్లు పారించారు
CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు
CAA,NRC: ఢిల్లీ శాంతి యుత నిరసనలపై చెడ్డీ గ్యాంగ్ దాడులు - పోలీసుల పాత్రపై అనుమానాలు
నిరసనపై నిరసన: వందలమంది హిందుత్వ వాదుల మధ్య ఆజాది అంటూ నినదించిన‌ యువతి
సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు
జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా
దళిత యువకుల‌పై దుర్మార్గ దాడి - స్క్రూడ్రైవర్‌ను వెనక నుంచి జొప్పించి హింసలు
CAA పౌరసత్వానికి మత పరీక్ష... అమెరికన్ ఫెడరల్ ప్యానెల్
ట్రంప్ వస్తున్నాడు 24 గంటల్లో ఇండ్లు ఖాళీ చేయండి ... పేదలకు నోటీసులు
వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !
మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?
ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ
భీమా కోరేగావ్ కేసు సమాంతర విచారణకు మహారాష్ట్ర‌ సర్కార్ నిర్ణయం
ట్రంప్ కు భారత్ లో పేదలు కనబడొద్దట - 7అడుగుల ఎత్తు గోడను కడుతున్న బీజేపీ ప్రభుత్వం
కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి
CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం
ఆప్ గెలుపుతో ఢిల్లీలో పెరిగిన బిర్యానీ సేల్స్... బీజేపీ అభిమానుల అసహనం
more..


ʹఅర్బన్