కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి


కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి

కన్హయ్యకుమార్

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి.
బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు.

గయ జిల్లా షేర్ఘాటిలో జరిగిన సభలో హిందూస్థానీ అవామ్ మోర్చాకు నాయకత్వం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జితాన్ రామ్ మంజి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్ ఖాన్, అవధేష్ కుమార్ సింగ్ లతో కలిసి కన్హయ్య కుమార్ పాల్గొన్నారు. ఆ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అవధేష్ కుమార్ సింగ్ కారులో వెళ్తుండగా ఆ కారుపై దుండగులు రాళ్ళతో దాడి చేయగా కారు అద్దాలు పగిలిపోయాయి. కన్హయ్య కుమార్ కు గాయాలు కాలేదు

ఈ దాడి ఘటనపై NPR-NRC-CAA కు వ్యతిరేక జాయింట్ ఫోరం ఒక ప్రకటనను విడుదల చేసింది "పర్యటన ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రెండు వారాల్లో ఇది ఏడవ దాడి ఇది బీజేపీ కార్యకర్తలే చేస్తున్నారని మా అనుమానం. దీనిపై మా ప్రతినిధి బృందం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ‌ ప్రధాన కార్యదర్శిని కలుసుకుంది. తరచూ కన్హయ్య పై జరుగుతున్న‌దాడుల గురించి అతనికి తెలియజేసింది. యాత్రలో పాల్గొనేవారి భద్రతపై చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడు ముఖ్యమంత్రి (నితీష్ కుమార్) ను కోరుతున్నాముʹʹ అని ఫోరం తన ప్రకటనలో పేర్కొంది.

జన్ గణ్ మన్ యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి బీజేపీ భాగస్వామ్య‌ రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతున్నదని ʹNPR-NRC-CAA వ్యతిరేక జాయింట్ ఫోరంʹ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఖాన్ అన్నారు. అందుకే కాషాయదళం కన్హయ్య కుమార్ పై పదే పదే దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

"బీజేపీ ప్రభుత్వం విద్వేషపు ఎజెండాను ప్రేమతో ఓడించాలని మేము ఆశిస్తున్నాము" అని ఖాన్ పిటిఐకి చెప్పారు.

Keywords : bihar, kanhayya kumar, JNU, jan gan man, caa, nrc, npr,
(2020-03-27 20:22:19)



No. of visitors : 683

Suggested Posts


నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

శాంతి ప్రదర్శన‌పై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులు

ఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC ల‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై

CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం

పౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది.

స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు

రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శన‌లు ఆపక పోతే

బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన‌ సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న‌ కోర్టు

కర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్

పౌరసత్వ సవరణ చట్టం, ఏన్నార్సీ రెండూ కలిపి అమలు చేయడంలోనే ప్రమాదముందని భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

అర్నబ్ బ్యాచ్, ప్రజ్ఞా ఠాకూర్ లు చేస్తే గొప్పపని - కునాల్ కమ్ర చేస్తే మాత్రం నేరం

రిపబ్లిక్ టీవీ ఛీఫ్ అర్నబ్ గోస్వామి ప్ర‌యాణిస్తున్న విమానంలోనే ప్రయాణించిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా గోస్వామి దగ్గరికి వెళ్ళి ఆయనపై పలు ప్రశ్నలు గుప్పించాడు. దేశం నరేంద్ర మోడీ చేతుల్లో చాలా భద్రంగా ఉన్నదని చెప్పారు కదా

Search Engine

ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
గొగోయ్ ని రాజ్యసభకు నామినేట్ చేయడంపై ʹసుప్రీంʹ లో పిల్ దాఖలు చేసిన మోడీ మద్దతుదారు
కోవిడ్ కాదు కోవింద్.. గోగోయ్ రాజ్యసభ సీటుపై టెలీగ్రాఫ్ సంచలన కథనం .. పీసిఐ నోటీసులు
ఆవుమూత్రం తాగి ఆస్పత్రిపాలైన వ్యక్తి... మూత్రాన్ని పంచిన బీజేపీ నేతను అరెస్టు చేసిన పోలీసులు
రంజన్ గోగోయ్ తుచ్ఛుడే, మరి మీరేం చేస్తున్నారు మిలార్డ్ - మార్కండేయ కట్జూ
క్విడ్ ప్రో క్వో !
సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుల ఫోటోలతో పోస్టర్లు - సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ‌
స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాదిపై బీజేపీ దుర్మార్గ దాడి !
CAA,NRC నిరసనలు: జాతీయబ్యాంకుల నుండి తమ డిపాజిట్ లను ఉపసంహరించుకుంటున్న ఖాతాదారులు
more..


కన్హయ్యకుమార్