మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?


మీడియా ప్రచారంలో నిజముందా ? ఆ విద్యార్థుల చేతుల్లో రాళ్ళున్నాయా ?

ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ లైబ్రరీలోనికి దూసుకెళ్ళిన పోలీసులు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులపై దుర్మార్గంగా దాడి చేసి కర్రలతో కొట్టిన సీసీ టీవీ దృశ్యాలు బహిర్గతమయ్యాయి. సోషల్ మీడియాలో కొన్ని టీవీ చానళ్ళలో ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. బీజేపీ ప్రభుత్వం, పోలీసులు ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. దాంతో అటు బీజేపీని, ఇటు పోలీసులను రక్షించేందుకు.. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో ప్రపంచంలోనే పేరిన్నికగన్న బీజేపీ ఐటీ సెల్, దానికి తోడు మోడీ మీడియా రంగంలోకి దిగాయి. విద్యార్థులు చేతుల్లో రాళ్ళతో లైబ్రరీలోకి ప్రవేశించారని, అందుకే పోలీసులు వాళ్ళను కొట్టవలసి వచ్చిందని ప్రచారం మొదలుపెట్టాయి.

వాళ్ళు ప్రచారం చేసిన ఆ వీడియోలో ఓ విద్యార్థి రెండు చేతుల్లో ఏవో వస్తువులు ఉన్నాయి. అవి రాళ్ళని మీడియా ప్రచారం చేసింది. అతని చేతిలో ఉన్నవి రాళ్ళేనా కాదా అన్న నిజానిజాలు తెలుసుకోకుండా అసలు ఆ వీడియో ప్రామాణికతపై ప్రశ్న‌లే లేకుండా మోడీ మీడియా విద్యార్థులపై దాడిని మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలో అసలు ఆ వీడియో నిజమైనదేనా ? ఆ వీడియోలో విద్యార్థి చేతుల్లో ఉన్నవి రాళ్ళేనా అనే విషయాలను పరిశీలించింది ఫేక్ న్యూస్ ను బైటపెట్టడంలో దిట్ట అయిన ఆల్ట్ న్యూస్.

ఈ వీడియోను పరొశీలించిన ఆల్ట్ న్యూస్ కథనం ప్రకారం....

వాస్తవం-చెక్ చేయడం కోసం ఆల్ట్ న్యూస్ హై రెజల్యూషన్ ఉన్న ఒర్జినల్ వీడియో వీడియోను చెక్ చేసింది. ఈ వీడియో ఇండియా టుడే ప్లే చేసిన ఫుటేజ్లోనిది. ఆల్ట్ న్యూస్ వీడియోను స్లో చేస్తూ ఫ్రేమ్-బై-ఫ్రేమ్‌ను చేసింది. విద్యార్థి తన ఒక చేతి వాలెట్, మరొక చేతిలో ఫ్లాట్ ఆబ్జెక్ట్ (బహుశా ఫోన్) పట్టుకున్నట్లు మేము కనుగొన్నాము.

సంఘటనల క్రమం - విద్యార్థి తన కుడి చేతిలో వాలెట్ మరియు ఎడమ చేతిలో ఒక సరళ వస్తువు (బహుశా ఫోన్) తో గదిలోకి ప్రవేశిస్తాడు. సుమారు 10 సెకన్లలో, అతను ఫ్రేమ్ నుండి బయటకు వెళ్లిపోయి తిరిగి 17 సెకన్లలో ఫ్రేమ్ లోనికి వస్తాడు. అప్పుడు అతని కుడి చేయి ఖాళీగా ఉన్నది. బ్రౌన్ కలర్ వాలెట్ ఇప్పుడు అతని ఎడమ చేతిలో కనిపిస్తుంది.

వాలెట్ చాలా ఫ్రేములలో కనిపిస్తుంది, ముఖ్యంగా విద్యార్థి తన చేతిని చాచినప్పుడు 1: 22 నిమిషాల మార్క్ వద్ద చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

విద్యార్థి తన చేతిలో ఒక ఫ్లాట్ వస్తువును కలిగి ఉన్నాడు, అది మొబైల్ ఫోన్ కావచ్చు. ఇది వాలెట్ వలె స్పష్టంగా గుర్తించబడదు. కానీ మీరు ఆ వీడియోను స్లోమోషన్ లో చూస్తే మీకే అరద్మవుతుంది. అతని చేతిలో ఉన్నది రాయా కాదా అనేది.

ఇక ఇవేమీ పరిశీలించకుండానే మీడియా సంస్థలు విద్యార్థులు రాళ్ళు పట్టుకొని లైబ్రరీలోకి వెళ్ళారనే తప్పుడు వార్తలను ఇవ్వడానికి చాలా తొందర ప్రదర్సించాయి. పోలీసులను, బీజేపీని రక్షించే ప్రయత్నంలో ఆ సంస్థలు తమ జర్నలిజాన్ని కూడా పాతరపెట్టడానికి వెనకాడలేదు.

Keywords : jamia milia university, delhi, police attack, students
(2020-03-31 05:22:33)



No. of visitors : 224

Suggested Posts


సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు

పౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు.

నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

శాంతి ప్రదర్శన‌పై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులు

ఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC ల‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై

CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం

పౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది.

స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు

రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శన‌లు ఆపక పోతే

బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన‌ సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న‌ కోర్టు

కర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి. బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు.

Search Engine

ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
more..


మీడియా