వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !


వైనాడు కొండల్లో కురిసిన నక్సల్బరీ తొలి వసంత మేఘం... !

వైనాడు


"యుద్దమొక్కటే
మనల్ని మనుషుల్ని చేస్తుంది
త్యాగమొక్కటే
మనుషుల్ని చిరస్మరణీయుల్ని చేస్తుంది.ʹ

నిండా మూసేసిన దిక్కులన్నింటినీ చీకటి చేసిన స్తబ్దతని పగలగొట్టుకుంటూ వంగదేశపు గడ్డ మీద వసంత మేఘం గర్జించింది. పిడుగులు కురిసి దేశమంతటా ప్రతిధ్వనించాయి. నక్సల్బరీ నాలుగు దిక్కులకూ చరచరా పాకి నేలనంతా ఎక్కుపెట్టిన నాగళ్లని చేస్తే, రైతాంగం యావత్తు తమకు తామే కొడవళ్ళు, గొడ్డళ్లు,కత్తులుగా పోతపోసుకున్నారు. అంతటా పర్చుకున్న భూమి ఒక్కటే. భూమిని సారవంతం చేసే రైతుల చెమట ఒక్కటే. పంటనెత్తుకుపోయే రాబందుల గుంపు ఒక్కటే. దోపిడీ ఒక్కటే. అది పోయే పోరాటమూ ఒక్కటే. నక్సల్బరీలో సాగిన నాగళ్ల యాత్ర దేశమంతా పాకి ఉద్యమాల మొలకలెత్తింది. నిత్యం ఆకుపచ్చని మొహంతో వెలిగిపోయే కేరళం సీమల్లో నాగళ్ళ నడకల్లో కారిన రక్తాన్ని గుండెలకత్తుకున్న యువత మరో చరిత్రని సృష్టించడానికి తన రక్తాన్నిచ్చింది.ఆ చరిత్ర కి తొలి పుట "కామ్రేడ్ వర్గీస్ ". కేవలం ʹభూమిʹ అంటూ ఈ నేలమీద ఏమీలేదు. అంతటా పర్చుకున్న యుద్ధభూమి తప్ప. నాగళ్ళ నడకలన్నీ జైత్రయాత్రలేనని నిక్కచ్చిగా నిరూపించిన ప్రజా యుద్ధ వీరుడు అమరుడు , కేరళా చేగువేరా వర్గీస్ 50 వ వర్ధంతి నేడు.

14 జూన్, 1938 లో మలబార్ జిల్లాలోని వెల్లముండ గ్రామంలో అరిక్కాడ్ వర్గీస్ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చదువుకునే సమయంలో నే కమ్యూనిస్టు రాజకీయాలకు ప్రభావితుడయ్యాడు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా కోజికోడ్ ప్రాంతంలోని ఆదివాసుల్లో పనిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలోనే ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు కునిక్కల్ నారాయణన్, మందాకిని దంపతుల పరిచయం వర్గీస్ కి కొత్త ద్వారాల్ని తెరిచింది. అంతర్జాతీయ రాజకీయాల్ని, కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని అధ్యయనం చేసేలా చేసింది. కోజికోడ్ లో వారు " నంగల్"(మేం) పేరిట నిర్వహించిన స్టడీ గ్రూప్ ఒక ప్రగతిశీల యువ బృందాన్ని తయారుచేసింది. కమ్యూనిస్టు పార్టీ లోని రివిజనిజం పాలకవర్గం లోకి వచ్చినా పీడిత ప్రజానీకానికి ఏమాత్రం మేలుచేయలేదు అని కేరళలో రుజువయ్యింది. పార్టీ చీలిన తర్వాత ఆ బృందం అంతా సీపీఎం లో చేరారు. సిపిఎం జిల్లా నాయకుడిగా వర్గీస్ ఆదివాసుల పోరాటాలకి నాయకత్వం వహించాడు. వర్గీస్ ముందుకు తెచ్చిన ఏ విషయాన్నీ సీపీఎం పార్టీ పట్టించుకోకపోవడంతో సొంతంగా కృషి చేయడం ప్రారంభించాడు. కునిక్కల్ నారాయణన్ సంపాదకత్వంలో "ఇడుత పక్షం"(వామపక్షం ) అనే పత్రికని ఈ యువబృందం నడిపింది. నక్సల్బరీ వసంత మేఘగర్జన కి స్పందించిన ఈ యువబృందం నక్సల్బరీ సంఘీభావ కమిటీని ఏర్పాటు చేసి వైనాడు అటవీప్రాంతంలోని ఆదివాసుల్లో సాయుధ పోరాటనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదివాసులని పీడించుకుతింటున్న భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టారు. వైనాడులోనే క్రూరుడైన త్రిసిలేరి భూస్వామి వాసుదేవ ఆడిగని మట్టుపెట్టి ఆస్తుల్ని ప్రజాధీనం చేశారు. ఆ ఘటనతో వైనాడు అంతటా మద్రాసు ప్రత్యేక పోలీసు దళాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున మోహరింపచేసింది. వర్గీస్, కునిక్కల్ నారాయణ్ ల నాయకత్వం లో గెరిల్లా దళాలు పనిచేయడం ప్రారంభించాయి. పోలీస్ ఇన్ఫార్మర్ చెక్కు ని అంతమొందించాక మరింత నిర్బంధం ఎక్కువైంది. అయినా ఆదివాసుల పెద్ద ఎత్తున గెరిల్లా దళాల్లోకి సమీకృతులయ్యారు. వర్గీస్ కోపోద్రిక్త యువతరానికి మారుపేరయ్యాడు.

మైదానప్రాంతాల నుంచీ పెద్దఎత్తున యువకులు , ఆదివాసీలు పోరాటంలోకి వచ్చి సాయుధపోరాటం ఊపందుకోవడంతో ఆయుధ సమీకరణకు పూనుకున్నారు. నవంబర్ 22, 1968 న కునిక్కల్ నారాయణన్ ఆధ్వర్యంలో 300 మంది సభ్యులతో తలసేరి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు.కానీ అది విఫలం అయింది. మరో 48 గంటల తర్వాత వర్గీస్ నాయకత్వంలో 700 మంది ప్రజలతో కూడిన బృందం పుల్పల్లి వద్దనున్న మద్రాస్ స్పెషల్ పోలీసుల స్థావరంపై దాడిచేశారు. ఆ దాడిలో వైర్లెస్ ఆపరేటర్ మృతిచెందగా సబ్ ఇన్స్ పెక్టర్ తో సహా పలువురు గాయపడ్డారు. పలు తుపాకుల్ని గెరిల్లాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీకాకుళం , తర్వాత వైనాడే సీపీఐ(ఎం.ఎల్) సాయుధ పంథాను అమల్లో పెట్టి భారత విప్లవోద్యమానికి దిక్సూచీలుగా నిలిచాయి. తీవ్ర నిర్బంధం మధ్య సైతం కబనీ నదీ పరివాహక ప్రాంతాన్ని విముక్తి ప్రాంతంగా మలిచేందుకు దళాలు కృషి చేశాయి. అనేక అరెస్టులు జరిగి, పలువురు నాయకులు దూరమైనా వర్గీస్ నాయకత్వంలో సాయుధ దళాలు తమ పోరాటాన్ని మడమ తిప్పకుండా కొనసాగించాయి. వర్గీస్ బలం, బలగం అదివాసులైన కురూచియన్లే. వాళ్ళు వర్గీస్ ని కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు. 1970 కల్లా దేశవ్యాప్తంగా నక్సల్బరీ ఉద్యమం వెనకతట్టు పట్టింది. అయినా పశ్చిమ కనుమల్లో ఉద్యమం ఉధృతంగా సాగుతూనే ఉంది. దట్టమైన అటవీప్రాంతంలోకి ఉద్యమం విస్తరించింది. 17 ఫిబ్రవరి1970 లో వర్గీస్ దళం కరిమత్ లోని శివరామాన్ నాయర్ అనే సానుభూతి పరుని ఇంట బస చేశారు. ఆ సమాచారాన్ని ఎవరో పోలీసులకు అందజేయడంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి వర్గీస్ ని అరెస్ట్ చేశారు. నాలుగేళ్ళ పాటు పోలీసులకు, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన వర్గీస్ ని పోలీసులు తిరునెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంపారకుని అటవీప్రాంతంలో కాల్చి చంపేశారు. వర్గీస్ మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి తిరునెల్లి చర్చి అంగీకరించకపోవడంతో వర్గీస్ జన్మస్థలం అయిన వెల్లముండ లోని ఓజక్కన్ మూలా వద్ద అతని పూర్వీకుల ఇంటిలో ఖననం చేశారు. వర్గీస్ అమరత్వం తర్వాత కూడా ఉద్యమం కొనసాగినా నాయకత్వలేమి వల్ల క్రమేపీ వెనుకతట్టు పట్టింది. బొలివియా లోని సియ్యర్రా కొండల్లో ఓరిగిపోయిన చేగువేరా తన అమరత్వంతో ప్రపంచ వ్యాప్తంగా ఎలా చెరగని ముద్రని వేశాడో, వైనాడు కొండల్లో ఓరిగిపోయిన వర్గీస్ తన ఆచరణతో, అమరత్వంతో దేశవ్యాప్తంగా చెరగని ముద్ర వేసి కేరళా చేగువేరా గా చిరస్మరణీయుడయ్యాడు.

కామ్రేడ్ వర్గీస్ కాల్చి చంపబడిన 40 ఏళ్లతర్వాత డిఎస్పీ లక్ష్మణ , డిఐజి విజయన్ ల ఆదేశాల మేరకు నిరాయుధుడిగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ లో తానే వర్గీస్ ని కాల్చి చంపినట్లు రామచంద్రన్ నాయర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు 40 ఏళ్ల తర్వాత ఆ పోలీస్ అధికారులపై కేసు పెట్టి విచారణ జరపడం సంచలనం కలిగించింది. వర్గీస్ చేతులు వెనక్కి కట్టి, కళ్ళకు గంతలు కట్టి ఓ రెండు రాళ్ళ మధ్య కూర్చోబెట్టామని, తనని కాల్చేసేముందు తనకు ఏదైనా సైగ చేయాలని వర్గీస్ కోరాడాని ఫిబ్రవరి18 వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు వర్గీస్ ని కాల్చిచంపేముందు నాలుకతో చిన్న శబ్దం చేశానని " విప్లవం వర్ధిల్లాలి " అంటూ నినాదాలు చేస్తుండగా కాల్చివేసినట్లు చెప్పాడు. మృతదేహం చేతిలో రైఫిల్ పెట్టి ఎన్ కౌంటర్ జరిగినట్లుగా చిత్రించినట్లు వాంగ్మూలం ఇచ్చాడు.

కామ్రేడ్ వర్గీస్ ని కాల్చిచంపగలిగారు కానీ అతని స్మృతినీ, ఆశయాన్ని చంపలేకపోయారు. వర్గీస్ వైనాడులో మిగిల్చిపోయిన అడుగుజాడల్లోనే ఇప్పుడు బలమైన పశ్చిమ కనుమల ఉద్యమం రూపొందుతోంది. ఆనాడు వర్గీస్ రక్తంతో ఎరుపెక్కిన కబనీ నది ఇప్పుడు తిరిగి మరోసారి పదునెక్కి ప్రవహిస్తోంది.

యాభైఏళ్లు..
నీ స్మృతి వీడలేదు
కామ్రేడ్...
నీ స్ఫూర్తి వీడలేదు.

జోహార్ కామ్రేడ్ వర్గీస్ !

( కామ్రేడ్ వర్గీస్ 50 వ వర్ధంతి సందర్భంగా....... కేరళా వ్యాప్తంగా ఈరోజు వర్గీస్ వర్ధంతి కార్యక్రమాల్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు.. )
- మోహన సుందరం

Keywords : kerala, varghese, naxalite, fake encounter
(2020-03-31 08:33:02)



No. of visitors : 590

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Maoist supporters call martyr meet in Wayanad; Kerala government yet to give nod

Putting the CPM-led LDF Government, which has been under severe criticism for the encounter killing of two CPI (Maoist) leaders at Nilambur recently, in the dock, the supporters of CPI (Maoist) have openly called a public ʹmartyr meetʹ in Wayanad on December 14 to commemorate the death of three Maoist leaders - Kuppu Devaraj, Ajitha and Latha alias Meera

Search Engine

ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
more..


వైనాడు