జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా


జాదవ్ పూర్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎగిరిన ఎర్రజెండా

జాదవ్

పశ్చిమ బెంగాల్ లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్‌ అనుబంధ విద్యార్థి సంఘాలు జయభేరి మోగించాయి. ఇంజినీరింగ్ విభాగంలో డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌ (డీఎస్‌ఎఫ్), ఆర్ట్స్‌ విభా గంలో ఎస్‌ఎఫ్ఐ, సైన్స్‌ విభాగంలో వీ ది ఇండిపెండెంట్స్‌ (డబ్లూ టీఐ)లు విజయం సాధించాయి. ప్రతి విభాగంలో అధ్యక్షులు, జనరల్‌ సెక్రెటరీ, రెండు అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రెటరీ(మొత్తం నాలుగు సీట్ల చొప్పున) పోస్టులకు గానూ మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆర్ట్స్‌ విభాగంలోని మొత్తం నాలుగు సీట్లనూ ఎస్‌ఎఫ్‌ఐ గెలుచు కున్నది. డీఎస్‌ఎఫ్‌ రెండో స్థానంలో, టీఎంసీపీ మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లోని నాలుగు సీట్లనూ డీఎస్‌ఎఫ్‌ మళ్లీ చేజిక్కించుకున్నది. సైన్స్‌ విభాగంలోని నాలుగు స్థానాలను డబ్ల్యూటీఐ గెలుచుకొని మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి విభాగం టీఎంసీపీ, తొలిసారి జేయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన ఆరెస్సెస్‌ అనుబంధ ఏబీవీపీలు ఈ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనను చూపెట్టాయి. ఒక్క సీటునూ గెలుచుకోలేక చతికిలపడ్డాయి. మూడుసంవత్సరాల విరామం అనంతరం బుధవారం జేయూలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
ఆర్ట్స్‌ విభాగంలో ఎస్‌ఎఫ్‌ఐ విజయకేతనంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సృజన్‌ భట్టాచార్య అభినందనలు తెలిపారు. ఆర్ట్స్‌ విభాగంలో పోటీచేసిన ఎబివిపి కార్యకర్తలను చిత్తు చేసి, ఎస్‌ఎఫ్‌ఐపై విద్యార్థులు విశ్వాసం ఉంచారని అన్నారు. క్యాంపస్‌లో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేందుకు వామపక్షాలు ఒక కారణమని, ప్రతి ఒక్కరూ అన్యాయాలకు వ్యతిరేకంగా, స్వేచ్ఛగా నిరసన తెలుపవచ్చునని అన్నారు. రాష్ట్రంలోని ఇతర యూనివర్శిటీల్లో కూడా ఎన్నికలు నిర్వహించా లని మమతా బెనర్జీని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు వామపక్షాల వెంటే ఉన్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు.

Keywords : west bengal, jadavpur university, sfi, dsf, wti, abvp
(2020-03-30 13:06:38)



No. of visitors : 245

Suggested Posts


పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !

పిల్లల అక్రమ రవాణా కేసులో బెంగాల్ పోలీసులు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలిని అరెస్టు చేశారు. భారతీయ మహిళా మోర్చా బెంగాల్ ప్రధాన కార్యదర్శి జూహీ చౌదరి ని భారత్ నేపాల్ బార్డర్ లో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల అక్రమ రవాణా కేసులో ఆమె పేరు రావడంతో ఆమె అఙాతంలోకి వెళ్ళింది.

ఆవుమూత్రం తాగి ఆస్పత్రిపాలైన వ్యక్తి... మూత్రాన్ని పంచిన బీజేపీ నేతను అరెస్టు చేసిన పోలీసులు

కరోనావైరస్ నుండి రక్షిస్తుందని చెప్పి కోల్‌కతాలో ఆవు మూత్రం పంచే కార్యక్రమం నిర్వహించి ఒకరి అనారోగ్యానికి కారణమైన ఓ బీజేపీ స్థానిక నాయకుడిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు బుదవారం తెలిపారు.

Comrade Narayan Sanyal Amar rahe !

Narayan Sanyal alias Bijoy-da, the Naxalite leader who joined Maoist politics in 1967 and played an instrumental role behind the formation of CPI(Maoist) in 2004, died in Kolkata on Monday. He was 78 and suffering from multiple ailments, including cancer....

స్టింగ్ ఆపరేషన్ - లక్షల్లో లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిన తృణముల్ మంతృలు

అత్యంత నీతిమంతుల పార్టీగా చెప్పుకునే బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ జుగుస్స కలిగించే అవినీతి కోణం వెలుగులోకి వచ్చింది. మరో 15 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఊహించనిరీతిలో వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్‌ మమత బెనర్జీ....

In memory of comrade Narayan Sanyal of CPI (Maoist)

A top Maoist think-tank and leader of the Communist movement in Bengal, Narayan Sanyal joined Communist Party of India – Marxist-Leninist (CPI-ML) in the ʹ60s. He left his job in a bank in Kolkata to join the Charu Majumdar....

సైన్యం అణిచివేతను ఎదిరిస్తూ తీవ్రమవుతున్న‌ గూర్ఖాలాండ్ ఉద్యమం

పశ్చిమ బెంగాల్ రాష్రం డార్జిలింగ్‌ మళ్లీ వేడెక్కింది. గత కొన్ని రోజులుగా గూర్ఖా జనముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలతో హిమాలయాలు దద్దరిల్లుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంధ్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. డార్జిలింగ్ ప్రాంతంలో పటణాలు, పల్లెల్లో సైన్యం కవాతు చేస్తోంది. ఆందోళనకారులపై విరుచుకపడుతోంది.....

రాజకీయ నాయకుల దుర్మార్గం : అక్కా చెల్లెళ్లను తాళ్ళతో కట్టేసి ఈడ్చుకెళ్లారు

గ్రామంలో రోడ్డు నిర్మాణానికి భూమి ఇవ్వలేదనే కోపంతో అక్కా చెల్లెళ్లను తాళ్లతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. ఫటా నగర్ లో నివాసం ఉండే స్మతిఇరానీ దాస్ స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ తన తల్లి, సోదరితో నివసిస్తోంది.

Search Engine

ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
more..


జాదవ్