CAA,NRC: ఢిల్లీ శాంతి యుత నిరసనలపై చెడ్డీ గ్యాంగ్ దాడులు - పోలీసుల పాత్రపై అనుమానాలు


CAA,NRC: ఢిల్లీ శాంతి యుత నిరసనలపై చెడ్డీ గ్యాంగ్ దాడులు - పోలీసుల పాత్రపై అనుమానాలు

CAA,NRC:

న్యూ ఢిల్లీ లోని జాఫ్రాబాద్ సమీపంలో CAA, NRCల‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులపై ఆదివారం రాళ్ళదాడి జరిగింది. ʹజైశ్రీరాంʹ నినాదాలు చేస్తూ నిరసనకారులపై రాళ్లదాడి చేసింది చెడ్డీ గ్యాంగ్ . రాళ్ళ దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా అక్కడే ఉన్నా పట్టించుకోలేదు. ఉద్యమకారులు కూడా కొంత మేర ప్రతిఘటించడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ఉపయోగించారు.

CAA, NRCల‌కు వ్యతిరేకంగా 2 నెలలుగా షాహీన్ బాగ్ లో జరుగుతున్న ప్రదర్శనల‌ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడడం లేదని, కావాలని పోలీసులే రోడ్లను బ్లాక్ చేసి ప్రజల ఇబ్బందులకు కారకులయ్యారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో హటాత్తుగా ఉద్యమకారులకు వ్యతిరేకంగా CAA అనుకూల ర్యాలీ జరిగింది.

హింసను రెచ్చగొట్టడంలో పేరెన్నికగన్న బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా ఆ ర్యాలీకి నాయకత్వం వహించాడు. వందలాది బీజేపీ మద్దతుదారులతో ర్యాలీ నిర్వహించి. CAA, NRC వ్యతిరేకులపై విషం గక్కాడు. ఉద్యమకారులను పోలీసులు ఖాళీ చేయించకపోతే తామే రంగంలోకి దిగితామని హెచ్చరించారు. ఆ సమయంలోనే ఇందులో నుండి వెళ్ళిన ఓ గుంపు CAA, NRC వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నవారిపై రాళ్ళదాడి ప్రారంభించింది.

ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ బైట‌ రహదారిపై CAA, NRC వ్యతిరేక నిరసనల ప్రదేశానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది, శనివారం రాత్రి నుండి కనీసం 500 మంది ప్రజలు ఇక్కడ CAA, NRCల‌కకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు.

ఈ దాడికి ముందు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. జైశ్రీరాం, దేశ్ కే గద్దారో కో గోలి మారో అని ప్రేరేపిత ఉపన్యాసాలతో కూడిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. CAA వ్యతిరేకులపై దాడి చేయడానికే తామొచ్చినట్టు కొందరు చెబుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో వీడియోలో హమరి క్రిషన్ దాస్ అనే వ్యక్తి మాట్లాడుతూ తనతో పాటు రాహుల్, యోగేశ్, అమన్ అనే ముగ్గురిని జామ్రాబాద్ నిరసనకు కమల్ బాగ్డి అనే వ్యక్తి తీసుకువచ్చారని , CAA, NRC వ్యతిరేక నిరసనకారులపై దాడి చేయడానికి రాళ్లతో సిద్ధంగా ఉండాలని అతను తమకు చెప్పాడన్నారు.
(ఇదే ట్విట్టర్ లోని ఆ వీడియో లింక్ https://twitter.com/bushrakhanum…/status/1231645934771040256)

రాళ్ళ‌తో నిండిన ట్రక్కులను తీసుకువచ్చినట్లు చూపించే విజువల్స్ ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రచార అయ్యింది. ఆ రాళ్ళతోనే నిరసనకారులపై దాడి చేశారు.

ఒక వీడియోలో, పోలీసు అధికారి మౌజ్‌పూర్‌లోని CAA వ్యతిరేక నిరసనకారులపై రాళ్ళు రువ్వడం చూడవచ్చు. ఈ ప్రదేశం కపిల్ మిశ్రా అనుకూల CAA ర్యాలీని నిర్వహించిన ప్రదేశానికి 10-15 మీటర్ల దూరంలో ఉంది. సీఏఏ అనుకూలురు రాళ్ళు రువ్వినప్పుడు ప్రేక్షకుల్లా నిలబడ్డ పోలీసులు ఉద్యమకారులు ప్రతిఘటన ప్రారంభించగానే లాఠీచార్జ్ మొదలుపెట్టారు.

అసలేం జరిగిందంటే...
ఢిల్లీలోని మౌజ్‌పూర్‌కు సమీపంలోని జాఫ్రాబాద్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు శనివారం రాత్రి నుంచే జరుగుతున్నాయి. బీజేపీ వివాదాస్పద నాయకుడు కపిల్‌ మిశ్రా సైతం సీఏఏకు అనుకూలంగా మౌజ్‌పూర్‌లో ఆదివారం ర్యాలీని నిర్వహించారు. అయితే మౌజ్‌పూర్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకున్న సీఏఏ మద్దతుదారులు.. జాఫ్రాబాద్‌ వద్ద నిరసనకారులను గమనించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిపై సీఏఏ మద్దతుదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్న కపిల్‌ మిశ్రా, ఆయన అనుచరులు అక్కడ నానా హంగామా సృష్టించారు. నిరసనకారులు ఇక్కడి రోడ్డును వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఒక వీధిలో నుంచి చాటుగా వచ్చిన ఆయన అనుచరులు, సీఏఏ మద్దతుదారులు పౌర నిరసనకారులపై రాళ్ల వర్షం కురిపించారు. నిరసనకారులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ʹజైశ్రీరాంʹ నినాదాలు చేస్తూ అంతకంతకూ రెచ్చిపోయారు. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసు వ్యవస్థ అంతా కేంద్రం చేతుల్లో ఉండటంతో.. ఆ సమయంలో తక్కువ మంది పోలీసులను పంపారు. ఆ తర్వాత అదనపు పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఇరువర్గాల వారిపై లాఠీచార్జి చేశారు. అప్పటికీ అదుపులోకి రాకపోవటంతో టియర్‌ గ్యాస్‌లను ప్రయోగించారు. భద్రతా కారణాల దృష్ట్యా మౌజ్‌పూర్‌-బాబర్‌పూర్‌ మెట్రో స్టేషన్‌ను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నాయనీ, తగిన భద్రతా సిబ్బందిని మోహరించినట్టు పోలీసు జాయింట్‌ కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ తెలిపారు.
శాంతియుతంగా నిరసనలు చేస్తున్న తమపై CAA మద్దతుదారులు కావాలనే రాళ్లదాడికి దిగారని నిరసనకారులు వాపోయారు. ప్రజాస్వామ్యయుత పద్దతిలో సాగిస్తున్న తమ ఆందోళనలకు భంగం కలిగించే ఉద్దేశంతో వారు ఇటువంటి కుటిలయత్నాలకు పూనుకుంటున్నారని చెప్పారు. అయితే CAA నిరసనకారులు ఇక్కడ(జాఫ్రాబాద్‌) మరో ʹషాహీన్‌బాగ్‌ʹను ఏర్పాటు చేద్దామనుకుంటున్నారనీ.. అలా కానివ్వమంటూ.. CAA మద్దతుదారుడు హెచ్చరించడం గమనార్హం. రాళ్లదాడిలో గాయాలైనవారిలో పలువురు నిరసనకారులతో పాటు ఓ టీవీ జర్నలిస్టూ ఉన్నారు.
జాఫ్రాబాద్‌లో మహిళల నిరసనల హౌరు,ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పౌర ఆందోళనలు
వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్ద శనివారం రాత్రి దాదాపు 200 మంది మహిళలు దీక్షను మొదలుపెట్టారు. జాతీయజెండాలను పట్టుకుని ʹఆజాదీʹ నినాదాలు వినిపించారు. వీరితో మరికొందరు మహిళలు, చిన్నారులు సైతం వచ్చి చేరడంతో ఆ ప్రాంతంలో నిరసనకారుల సంఖ్య రాత్రికిరాత్రే పెరిగిపోయింది. ʹʹమాకు సీఏఏ, ఎన్నార్సీల నుంచి స్వాతంత్య్రం కావాలిʹʹ అని నిరసనకారుల్లో ఒకరు అన్నారు. మహిళలు నిరసన నేపథ్యంలో ఆప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆదివారం ఉదయం మెట్రో స్టేషన్‌ను కూడా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. జాఫ్రాబాద్‌ పాయింట్‌ వద్ద రైళ్లు ఆగవని స్పష్టం చేశారు. బారికేడ్లను ఇక్కడ నుంచి తొలగించాలంటూ మహిళలు పోలీసులను కోరారు. CAA, NRC, NPRలకు వ్యతిరేకంగా ఇక్కడ నిరసన తెలుపుతున్న వేలాది మంది నిరసనకారుల గొంతులను, మనోభావాలను వినాలనీ, తదనుగుణంగా తప్పనిసరి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని, ప్రధాని మోడీని ఒక మహిళ కోరారు. రోడ్డును నిర్బంధించకూడదనీ, ఇక్కడ నుంచి వెళ్లాలంటూ నిరసనకారులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నారని సీనియర్‌ పోలీసు అధికారి వేద్‌ ప్రకాశ్‌ సూర్య తెలిపారు. పారామిలిటరీ భద్రతా సిబ్బందిని కూడా పిలుస్తామని చెప్పారు.
మెట్రోస్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగిన మహిళలు చేతికి నీలిరంగు బ్యాండ్లను కట్టుకొని కనిపించారు. అలాగే ʹజై భీంʹ నినాదాలను వినిపించారు. పలువురు మహిళలు అంబేద్కర్‌ చిత్రపటాలను ప్రదర్శించారు. జాతీయ జెండాలను చేతుల్లో పట్టుకొని కనిపించారు. ʹనో సీఏఏ, నో ఎన్నార్సీ, నో ఎన్పీఆర్‌ʹ, ʹవురు రిజెక్ట్‌ సీఏఏʹ అని రాసి ఉన్న ప్లకార్డులు నిరసనకారుల చేతుల్లో దర్శనమిచ్చాయి. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశరాజధానిలో షాహీన్‌బాగ్‌ తర్వాత అంతటి స్థాయిలో మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు జాఫ్రాబాద్‌ కావడం గమనార్హం. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత డిసెంబర్‌లో వేలాది మంది నిరసనకారలు జాఫ్రాబాద్‌ మెట్రోస్టేషన్‌ వద్ద జాతీయజెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. దాదాపు రెండునెలలకు పైగా షాహీన్‌బాగ్‌లో మహిళలు చేస్తున్న నిరసనలు.. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. షాహీన్‌బాగ్‌ ప్రేరణతో పలు ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. చాంద్‌బాగ్‌లోనూ ఇలాంటి నిరసనలే జరిగాయి. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రజలు బయటకు వచ్చి రాజ్‌ ఘాట్‌ వరకూ మార్చ్‌గా వెళ్లారు. అయితే వారి ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో రోడ్డు పైనే బైఠాయించిన నిరసనకారులు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వజీరాబాద్‌ రోడ్డును బ్లాక్‌ చేశారు. ఆందోళనలో నేపథ్యంలో అక్కడ సీఆర్పీఎఫ్‌ సిబ్బంది మోహరించింది. ఖురేజీ, హౌజ్‌ రాణి లలోనూ గత నెలరోజులకు పైగా మహిళలు నిరసనలు చేస్తున్నారు. భీం ఆర్మీ పిలుపు మేరకు ఈ రెండు ప్రాంతాల్లో నిరసనకారులు మార్చ్‌ను నిర్వహించారు. ఆందోళనల కారణంగా ఈ ప్రదేశాల్లో పోలీసులు మోహరించారు. ఖురేజీలో ర్యాలీని పోలీసులు అడ్డుకోగా.. హౌజ్‌ రాణిలో మార్చ్‌ను నిరసనకారులు కొనసాగించారు.
షాహీన్‌బాగ్‌పై కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సుప్రీం మధ్యవర్తి
షాహీన్‌బాగ్‌ నిరసనలపై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తుల్లో ఒకరైన వజాహత్‌ హబీబుల్లా షాహీన్‌బాగ్‌లో రోడ్డు దిగ్బంధనంపై ఈ అఫిడవిట్‌ను సమర్పించారు. దీనిపై ఇద్దరు సభ్యుల బెంచ్‌ నేడు(సోమవారం) విచారణ జరపనుంది. ʹʹషాహీన్‌బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసన శాంతియుతంగా జరుగుతున్నది. షాహీన్‌బాగ్‌ చుట్టూ ఐదు పాయింట్లను పోలీసులు దిగ్బంధించారుʹʹ అని తన అఫిడవిట్‌లో వజాహత్‌ హబీబుల్లా పేర్కొన్నారు.

Keywords : new delhi, shaheenbagh, jafrabad, CAA, NRC,
(2020-03-31 03:25:00)No. of visitors : 276

Suggested Posts


సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు

పౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు.

నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

శాంతి ప్రదర్శన‌పై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులు

ఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC ల‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై

CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం

పౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది.

స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు

రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శన‌లు ఆపక పోతే

బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన‌ సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న‌ కోర్టు

కర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి. బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు.

Search Engine

ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
more..


CAA,NRC: