వీళ్ళు ప్రేమతో గులాబీలివ్వాలని చూశారు ... వాళ్ళు ద్వేషంతో దాడులు చేసి నెత్తుర్లు పారించారు


వీళ్ళు ప్రేమతో గులాబీలివ్వాలని చూశారు ... వాళ్ళు ద్వేషంతో దాడులు చేసి నెత్తుర్లు పారించారు

వీళ్ళు

పౌరసత్వ సవరణ చట్టం(CAA), NRCలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రెండు నెలలకు పైగా సాగుతున్న శాంతియుత ఆందోళనలపై దుర్మార్గమైన దాడి ప్రారంభమయ్యింది. ఢిల్లీలో సీఏఏ కు మద్దతుగా బీజేపీ నేత కపిల్ మిశ్రా ర్యాలీ నిర్వహించి రెండు రోజుల్లో నిరసనలు ఆపకపోతే తాము రంగంలోకి దిగుతామని హెచ్చరించినప్పటి నుండి పరిస్థితి దిగజారింది. ఒక్క సోమవారం నాడే ఈ ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీ షాహీన్ బాగ్ లో చేపట్టినట్టే జాఫ్రాబాద్ ప్రాంతంలో కూడా రాజ్యాంగాన్ని రక్షించాలంటూ శాంతియుత ప్రదర్శన‌ చేపట్టాలని స్థానికులు భావించారు. వీళ్ళు శనివారం రాత్రి ఆందోళన ప్రారంభించగా వీళ్ళపై దాడిచేయాలనే కుట్రను రచించిన చెడ్డీ గ్యాంగ్ మూక ఆదివారం ఉదయం అక్కడికి దగ్గర్లోనే సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సీఏఏ వ్యతిరేకులు కూర్చున్న చోటికి బయలు దేరింది. అయితే ఆ వచ్చే వారికి గులాబీ పూవులు ఇచ్చి వారికి తమ బాధ వివరించాలని, శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించాలని భావించిన స్థానికులు చేతుల్లో గులాబీలు పట్టుకొని కూర్చున్నారు. కానీ హటాత్తుగా అక్కడికి చేరుకున్న చెడ్డీ గ్యాంగ్ రావడం రావడమే జై శ్రీరాం నినాదాలిస్తూ రాళ్ళదాడి ప్రారంభించారు. కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నవాళ్ళు ఆ హింసావాదులను ఆపడానికి చేసిన ప్రయత్నాలు వ్యర్థం అయ్యాయి.

కర్రలు, రాడ్లు, ఇటుకలతో దాడులు జరిగాయి. రాళ్లు, గాజు బాటిళ్లు విసురుకున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టారు. పెట్రోల్ బంక్ సహా ఇళ్లు, వాహనాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న యువకులు కొందరు తిరగబడ్డారు. దాంతో చెడ్డీ గ్యాంగ్ వెనకే ఉన్న పోలీసులు వెంటనే ముందుకొచ్చి గులాబీలు పట్టుకున్న వారిపై లాఠీచార్జ్ చేశారు.

ʹʹసీఏఏ మద్దతుదారులకు పువ్వులు ఇచ్చి స్వాగతం పలుకుదాం అని మేం భావించాం. అందుకోసం ఏర్పాట్లు కూడా చేశాం. కానీ వారు వచ్చి మాపై దాడికి దిగారు. అలాంటప్పుడు మేం ప్రతిదాడి చేయకుండా ఎలా ఉంటాంʹʹ అని ఓ సీఏఏ వ్యతిరేక ఆందోళనకారుడు తెలిపాడు.

ఈ ఘర్షణల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ తోపాటు మరో ఐదుగురు బలయ్యారు. ఘర్షణల తర్వాత భద్రతా దళాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. అయితే మంగళవారం కూడా ఈ ప్రాంతంలో చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకుంటుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Keywords : CAA, NRC, DELHI, MUSLIMS, HINDU, Kapil mishra, RSS, BJP, Police
(2020-03-31 03:25:00)



No. of visitors : 307

Suggested Posts


సీఏఏకు వ్యతిరేకంగా కవిత్వం చదివిన కవి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్టు అరెస్టు

పౌరసత్వ చట్టాని CAAకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో కవిత్వం చదివారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు.

నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని గంటా ఘర్ (క్లాక్ టవర్) ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలిపుతున్న‌ మహిళలు తమకోసం తెచ్చుకున్న ఆహార పదార్థాలు, దుప్పట్లను లక్నో పోలీసులు ఎత్తుకపోయారు.

మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి

CAA వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఓ కేరళ నివాసి ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడనడానికి రుజువుందా అంటూ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు. జనవరి 13 న చాలక్కుడి మునిసిపాలిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముందు జోషి కల్లూవెల్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ తెలిపింది.

శాంతి ప్రదర్శన‌పై మతోన్మాది కాల్పులు... చోద్యం చూస్తూ నిలబడ్డ పోలీసులు

ఇవ్వాళ్ళ... మహాత్మా గాంధీపై మతోన్మాద గాడ్సే కాల్పులకు తెగబడి ఆయనను హత్య చేసినరోజు... విద్యార్థులపై ఓ మతోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ లోని జామియా మిలియా యూనివర్సిటీలో CAA, NRC ల‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై

CAA,NRCలకు వ్యతిరేకంగా మావోయిస్టుల ప్రచారం

పౌరసత్వం సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది.

స్కూల్ లో NRC, CAA లకు వ్యతిరేకంగా నాటకం వేశారని స్కూల్ పై దేశద్రోహం కేసు

పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు పౌరుల జాతీయ రిజిస్టర్‌కు(NRC) వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు కర్ణాటక బీదర్‌లోని పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.

CAA నిరసనలపై హింస - ఢిల్లీలో 8 రౌండ్ల కాల్పులు జరిపిన అగంతకుడు

రెండు నెలలకు పైగా శాంతియుతంగా సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలపై దాడులు తీవ్రమయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో , షాహీన్ బాగ్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన తుపాకీ కాల్పుల కొనసాగింపుగా ఇప్పుడు పాలక మూకలు దాడిని తీవ్రం చేశాయి. నిరసన ప్రదర్శన‌లు ఆపక పోతే

బీదర్ స్కూల్ లో ప్రదర్శించిన‌ సీఏఏ వ్యతిరేక నాటకంలో దేశద్రోహం లేదన్న‌ కోర్టు

కర్నాటక లోని బీదర్ షాహీన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహకుడిపై పోలీసులు పెట్తిన దేశద్రోహ కేసులో ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

బీజేపీకి ఓటెయ్యక పోతే రేప్ చేస్తారా - మోడీకి 170 మహిళా ప్రముఖుల లేఖ‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచారాస్త్రంగా, హెచ్చరికగా వాడుకుంటున్నారని, తమకు ఓటేయకుంటే లైంగికదాడులు జరిగిపోతాయంటూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని 170 మంది మహిళా ప్రముఖులు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

కన్హయ్యకుమార్ పై మళ్ళీ దాడి...2వారాల్లో ఇది 7వ దాడి

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్య కుమార్ పై మంగళవారం బీహార్లో మళ్లీ దాడి చేశారు. రెండు వారాల్లో కన్హయ్య పై ఇది 7వ దాడి. బీహార్ లో జరుగుతున్న ʹజన్ గణ్ మన్ యాత్రʹ లో భాగంగా ఆయన ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఉండగా ఆ కారుపై బైక్ ల మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో దాడి చేశారు.

Search Engine

ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
more..


వీళ్ళు