ʹకపిల్ మిశ్రా , అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్ళున్న పార్టీలో ఉండలేనుʹ


ʹకపిల్ మిశ్రా , అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్ళున్న పార్టీలో ఉండలేనుʹ

ʹకపిల్

ʹʹకపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్ వంటి విద్వేషకారులు ఉన్న పార్టీలో నేను ఉండదల్చుకోలేదుʹʹ అని ప్రకటించారు ప్రముఖ బెంగాలి నటి, బీజేపీ నాయకురాలు సుభద్ర ముఖర్జి. ఇటీవల సంవత్సరాల్లో పార్టీ పని తీరు పరిశీలిస్తే అది సరైన మార్గంలో సాగడం లేదని అర్దమవుతుంది అని ఆమె అన్నారు. మతం ఆధారంగా ప్రజలను విభజిస్తూ, ప్రజలకూ ద్వేషపూరిత భావజాలాన్ని నూరి పోస్తున్నారని ఆమె ఆరోపించారు. ʹʹఈ కారణంగా నేను చాలా కాలంగా సంఘర్షణకు గురవుతున్నాను. ఇక నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే నా రాజీనామా లేఖను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌కు పంపాను. అది సరిపోదు అనుకుంటే నేను వ్యక్తిగతంగా వెళ్లి నా రాజీనామా లేఖను ఇస్తాను" అని ముఖర్జీ అన్నారు.

ʹʹఢిల్లీలో ఏమి జరిగిందో చూడండి. చాలా మంది మరణించారు అనేక‌ ఇళ్లకు నిప్పంటించారు. అల్లర్లు ప్రజలను విభజించాయి. ద్వేషపూరిత ప్రసంగాలు చేసి రెచ్చగొట్టిన పార్టీ నాయకులు అనురాగ్ ఠాకూర్, కపిల్ మిశ్రాపై ఎవరూ చర్యలు తీసుకోరు. ఏం జరుగుతుంది? అల్లర్ల దృశ్యాలు నన్ను పూర్తిగా కదిలించాయి. హింసకు కారణమైనవారున్న పార్టీలో నేనుండదల్చుకోలేదు. అనురాగ్ ఠాకూర్ , కపిల్ మిశ్రా వంటి వ్యక్తులున్న‌ పార్టీకి నేను దూరంగా ఉండటానికి ఇష్టపడతానుʹʹ అని ఆమె అన్నారు.

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆమె మాట్లాడుతూ, ʹʹపొరుగు దేశాల్లో ఇబ్బందులు పడి బాధల‌ నుండి బయట పడడానికి వస్తున్న వారికి పౌరసత్వం అందించడం అత్యుత్తమ నిర్ణయం. కానీ వారికి పౌరసత్వం ఇవ్వడం పేరిట, మీరు ప్రతి భారతీయుడి జీవితాలతో ఎందుకు ఆడుతున్నారు. అకస్మాత్తుగా మన పౌరసత్వాన్ని ఇప్పుడు ఎందుకు నిరూపించాలి. ఈ చర్యను నేను ఖండించాను. వారు మానవాళిని చంపి, రాక్షసులకు జన్మనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇటువంటి చర్య ప్రజలలో అభద్రతా భావాన్ని సృష్టిస్తుంది. ఇది దేశ రాజధానిలోనే కాకుండా మొత్తం దేశంలో కూడా అశాంతికి దారితీస్తుంది. ʹʹ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Keywords : Kapil Mishra, Anurag Thakur, CAA, NPR, NRC, Subhadra Mulharjee, BJP
(2020-03-31 04:03:56)No. of visitors : 970

Suggested Posts


0 results

Search Engine

ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
more..


ʹకపిల్