క్విడ్ ప్రో క్వో !


క్విడ్ ప్రో క్వో !

క్విడ్

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల తీవ్ర విమర్షలు వస్తున్నాయి. ఇది క్విడ్ ప్రో క్వో కాదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం కోరుకున్న విధంగా తీర్పులు ఇచ్చినందుకు గొగోయ్ కి దక్కిన బహుమతిగా ఆరోపణలు వస్తున్నాయి. అయోద్య కేసు, కశ్మీర్ లో మానవహక్కుల హననం ,కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలులు, రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు...వీటన్నింటిపై రంజన్ గొగోయ్ తీర్పులు ఇచ్చాడు. అన్ని తీర్పులు బీజేపీ కోరుకున్నట్టుగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను రాజ్య సభకు నామినేట్ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జస్టిస్ (రిటైర్డ్) మదన్ బి లోకూర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ

ʹʹజస్టిస్ గొగోయ్ ఏ పదవి పొందుతారనే దానిపై కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి ఆ కోణంలో ఆయనను రాజ్యసభకు పంపడం ఆశ్చర్యం కలిగించదు, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పదవి ఇంత త్వరగా రావడం. ఇది న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్య్రం, నిష్పాక్షికత, సమగ్రతను పునర్నిర్వచించింది. చివరి బురుజు పడిపోయిందా? ʹʹ

మరో సీనియర్ న్యాయవాది, దుష్యంత్ దేవ్, ది వైర్‌తో మాట్లాడుతూ, ʹʹఇది పూర్తిగా అసహ్యకరమైనది,ఇది స్పష్టమైన క్విడ్ ప్రో క్వో. న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్య్రం పూర్తిగా నాశనం చేయబడింది. ʹʹ

న్యాయవాది గౌతమ్ భాటియా ట్వీట్ చేస్తూ, "స్వతంత్ర న్యాయవ్యవస్థ చనిపోయిందని స్పష్టంగా కనబడటానికి కొంత సమయం పట్టింది, కాని అధికారికంగా చనిపోయింది.ʹʹ

గోగోయి నామినేషన్‌పై స్పందిస్తూ సిపి (ఎం) నాయకుడు సీతారాం యెచురీ ఇలా ట్వీట్ చేశారు:

ఓ మాజీ ప్రధాన న్యాయమూర్తిని ప్రభుత్వం గవర్నర్ గా నియమించినప్పుడు "పదవీ విరమణ అనంతర నియామకాలు న్యాయవ్యవస్థ స్వాతంత్య్రానికి మచ్చ అని ఒక బలమైన దృక్పథం ఉంది" అని శ్రీ రంజన్ గొగోయ్ గత సంవత్సరం స్వయంగా చెప్పారు.

AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసి సోమవారం, "ఇది ʹక్విడ్ ప్రో క్వోʹ కాదా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే న్యాయమూర్తుల స్వాతంత్య్రంపై ప్రజలకు ఎలా నమ్మకం ఉంటుంది?ʹʹ

బిజెపి మాజీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా ట్విట్టర్లో.. తనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసినందుకు ʹనోʹ అని చెప్పే మంచి జ్ఞానం "మాజీ సిజెఐ రంజన్ గొగోయ్ కు ఉంటుందని నేను నమ్ముతున్నాను. లేకపోతే అతను న్యాయవ్యవస్థ‌ ప్రతిష్టకు లెక్కించలేని నష్టాన్ని కలిగించినవాడవుతాడు.

దీనిపై బీజేపీ అభిమానుల వాదన మరోలా ఉంది. కాంగ్రెస్ చేసినప్పుడు మేమెందుకు చేయొద్దు అనే విధంగా వారు వాదిస్తున్నారు. గతంలో సీజేఐ గా పని చేసిన రంగనాథ్ మిశ్రాను కాంగ్రెస్ రాజ్యసభకు పంపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

Keywords : bjp, ranjan gogoi, supreme court
(2020-03-31 03:24:30)No. of visitors : 252

Suggested Posts


నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

నా బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు - నిర్భయ తండ్రి

ʹʹనా బిడ్డకు న్యాయం జరగ లేదు., జరుగుతుందన్న నమ్మకం కూడా లేదుʹʹ ఇవి మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ʹనిర్భయʹ తండ్రి దుంఖంతో అన్నమాటలు. ఈ దారుణం జరిగి మూడేళ్లయినా నిందితుల్లో ఇంకా నలుగురికి ఉరిశిక్ష అమలుచేయలేదని, మరో నిందితుడిని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని.....

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

Search Engine

ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
more..


క్విడ్