కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు


కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు

కరోనా

అమెరికాలో పని చేస్తున్న డాక్టర్ చైతన్య చెక్కిళ్ళ‌ ప్రశ్నలు జవాబుల రూపంలో కరోనాపై కలిగిస్తున్న అవగాహన ....

1) ప్రశ్న: కరోనా వైరస్ వేడికి నశిస్తుందా? భారత దేశం వంటి వేడి ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని వింటున్నాం కదా.

జవాబు: Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్ తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. వేడి ప్రదేశమైన ఫ్లోరిడాలో కరోనా వైరస్ విజృంభించి వ్యాపిస్తుంది.

ఎండాకాలంలో ఇది influenza లా సమసిపోతుందా, లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇది కొత్త వైరస్ కావడంతో ఇది ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడే చెప్పలేము. ఆధారాలు లేని విషయాలను ఊహించి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడం మనకు నష్టం కలిగిస్తుంది.

2) ప్రశ్న: పారాసెటమాల్ (paracetamol) తో కరోనా వైరస్ నయమవుతుందా?

జవాబు: కరోనా వైరస్ వచ్చినవాళ్లు 80% మంది జ్వరం, దగ్గు వంటి వాటితో బాధపడి కోలుకుంటారు. వాళ్లకి ఎటువంటి మందులు ఇచ్చినా, ఇవ్వకపోయినా కోలుకుంటారు. Paracetamol జ్వరం తగ్గిస్తుంది, జ్వరం వచ్చే ఏ రోగానికైనా paracetamol జ్వరం నుండి ఉపశమనం ఇస్తుంది. అంతే కాని దానితో రోగం నయం కాదు. ఉదాహరణకు మలేరియా, T.B, flu వంటి రోగాల్లో కూడా జ్వరం నుండి ఉపశమనం కోసం paracetamol వాడుతారు. అట్లానే కరోనా వైరస్ తో వచ్చే జ్వరానికి కూడా paracetamol వేసుకోవచ్చు.

కరోనా వైరస్ తో తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చేరేవాళ్లకు, pneumonia (ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్) తో, ఊపిరితిత్తుల్లో నీరు నిండడంతో, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దానికి ఆక్సిజెన్ (oxygen) అవసరం పడుతుంది. తీవ్రమైన cases లో ventilator మీద ఉంచే అవసరం పడుతుంది. Acute respiratory distress syndrome (శ్వాస వ్యవస్థ పనిచేయకపోవడం), acute cardiac injury (గుండెకు హాని జరగడం), shock (కణాలకు ఆక్సిజెన్ అందకపోవడం) కరోనా వైరస్ తో చనిపోవడానికి ముఖ్యమైన కారణాలు. వాళ్లని paracetamol తో నయం చేయలేమనేది వేరే చెప్పనవసరం లేదు.

3) ప్రశ్న: పొడి దగ్గు, జ్వరం ఉంటేనే నాకు కరోనా వైరస్ సోకినట్టా? అవి లేకపోతే నేను సేఫ్ గా ఉన్నట్టేనా?

జవాబు: కరోనా వైరస్ వ్యాధిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు జ్వరం, నీరసం, పొడి దగ్గు, ఆకలి లేకపోవడం, ఒళ్ళు నొప్పులు, కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. కొంత మంది రోగుల్లో తల నొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడం, వికారం, నీళ్ళ విరేచనాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో కొంత మందికి ఒకటో, రెండో లక్షణాలే ఉండవచ్చు. కొంత మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవచ్చు. కొంతమందిలో ఎక్కువ లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలు చాలా మటుకు జలుబు, ఫ్లూ వంటి ఇతర వైరల్ వ్యాధుల్లో కనిపించేవే. అందుకని వ్యాధి లక్షణాలను బట్టి మాత్రమే కరోనా వైరస్ ను గుర్తు పట్టలేము. టెస్టింగ్ తో మాత్రమే ఖచ్చితంగా గుర్తు పట్టే అవకాశం ఉంది.

4) కరోనా వైరస్ వస్తే చనిపోతామా?

కరోనా వైరస్ వచ్చిన వారిలో 1-2% మంది చనిపోతారు. అది చిన్న సంఖ్యలా కనిపించవచ్చు. కానీ వ్యాధిని అరికట్టకపోతే కొత్త వ్యాధి కావడం వల్ల, ఎవరికీ immunity లేనందువల్ల ప్రపంచంలో 50-65% ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉంది. ఉదాహరణకు సుమారు నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణాలో వ్యాధిని అరికట్టే చర్యలు తీసుకోకపోతే రెండు నుండి రెండున్నర కోట్ల మందికి కరోనా సోకే అవకాశం ఉంది. తక్కువలో తక్కువ 1% అనుకున్నా రెండు నుండి రెండున్నర లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. అందుకే అందరూ ఈ వ్యాధిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను పాటించి అత్యవసరమైతే తప్ప ఇంటి బయటకు వెళ్లకుండా, ఇతరులతో కలవకుండా ఉండాల్సిన అవసరం ఉంది. వైరస్ బారిన పడిన వాళ్ళు 14 రోజులు అందరినుండి దూరంగా ఉండి వ్యాధి ఇంకొకరికి సోకకుండా జాగ్రత్తపడాలి.

5) కరోనా వైరస్ సోకిన వాళ్ళు చాలా మంది కోలుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి కదా. ఎందుకు దీని గురించి ఇంత భయాందోళనలు?

అవును పైన చెప్పినట్టు కరోనా వైరస్ వచ్చిన వారిలో 1-2% మంది చనిపోతారు. అంటే వంద లో 98-99 మంది దీని నుండి కోలుకుంటారు. అయితే వందలో పది నుండి ఇరవై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ లో చేరవలసిన అవసరం పడుతుంది. 60 ఏళ్ళకు పైబడిన వృద్ధులు, గుండె జబ్బులు, diabetes (షుగర్ వ్యాధి) ఉన్నవాళ్ళకు కరోనా వైరస్ సోకితే తీవ్ర అస్వస్థతకు గురయ్యి చనిపోయే అవకాశాలు ఎక్కువ. 80 % మంది స్వల్ప అస్వస్థత మాత్రమే కలిగిన ప్రజలు మామూలుగా తిరుగుతూ వృద్ధులకు, ఇతర వ్యాధులున్న వారికి వ్యాప్తి చేసి వారి మరణాలకు కారణమవుతారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా చెప్పే జాగ్రత్తలు మన గురించే కాదు మన చుట్టూ ఉన్నవాళ్ళ కోసం పాటించాల్సిన అవసరం ఉంది. ఎంత ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందో పైన రాసిన దాంట్లో మళ్లీ ఒకసారి చదవండి.

6) కరోనా వైరస్ కి మందులు లేవా? WhatsApp లో ఎన్నో చిట్టి చిట్కాలు చూస్తున్నాం కదా. ఏవో మందులతో COVID-19 నయమయిపోతుంది అన్న వార్తలు వింటున్నాం కదా?

కరోనా వైరస్ కి ప్రస్తుతానికి ఏమీ మందులు లేవు. చాలా దేశాల్లో రకరకాల మందులతో trials చేస్తున్నారు. కొన్ని మందులు ఎంతో కొంత పని చేసినట్టు కనిపించినా ఇప్పటివరకూ ఖచ్చితంగా కరోనా వైరస్ కి పని చేసే మందులేమీ గుర్తించబడలేదు. WHO కూడా HIV కి వాడే antivirals, ఇతర antivirals, malaria కి వాడే chloroquine తో వివిధ దేశాల్లో ఒకే సారి clinical trial మొదలుపెడుతుంది.

COVID-19 కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో కనుగొనలేని మందులు, ఉపశమనాలు, చిట్కాలు, ఆసక్తికరంగా కరోనా వైరస్ ఇంకా పెద్దగా వ్యాప్తి చెందని భారత దేశంలో కనుగొన్నట్టు చెబుతున్నారు. అసలు కేసులు లేకుండా ఎవరి మీద ప్రయోగాలు చేసినట్టు, మందులు, చిట్కాలు పని చేస్తాయని ఎట్లా నిర్ధారించినట్టు? కరోనా వైరస్ ని నయం చేస్తున్నట్టు వచ్చే ఫేక్ మందులను, ఫేక్ చిట్కాలను తిప్పి కొట్టండి. వాటిని forward చేయడం ఆపండి. తప్పుడు భరోసాలతో ఉంటే వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశాలు ఎక్కువ.

7) 60 కన్నా ఎక్కువ వయసున్న వాళ్ళకే కరోనా వైరస్ తో తీవ్రమైన అస్వస్థత కలుగుతుందంట కదా. తక్కువ వయసున్న వాళ్లెందుకు జాగ్రత్తలు పాటించాలి?

అమెరికాలో COVID-19 తో హాస్పిటల్ పాలయిన వాళ్ళలో 40% మంది 20-54 వయసులలో ఉన్నవాళ్లే. 60 ఏళ్లకు పైబడిన వాళ్లు తీవ్ర అస్వస్థత కలిగి, చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నా కరోనా వైరస్ అన్ని వయసుల వాళ్ళకు అస్వస్థతను కలిగిస్తుంది. తీవ్ర అస్వస్థత కలిగినవాళ్లు కోలుకోవడానికి మూడు నుండి ఆరు వారాల సమయం పట్టవచ్చు.

8 ) కరోనా వైరస్ లాంటి pandemic (మహమ్మారి) ఇంతకముందు ఎప్పుడయినా వచ్చిందా?

1918 లో స్పానిష్ ఫ్లూ (spanish flu) అనబడే H1N1 వైరస్ ప్రపంచంలో అయిదు నుండి పది కోట్ల మంది మరణానికి కారణమయింది. అతి వేగంగా వ్యాప్తి చెందిన స్పానిష్ ఫ్లూ ప్రపంచంలో మూడో వంతు జనాభాకు సోకింది. పరిశోధనల్లో స్పానిష్ ఫ్లూ పక్షుల నుండి మనుషులకు పాకినట్టు తెలుస్తుంది.

ఇప్పటి కరోనా వైరస్ చైనా లోనో, అమెరికాలోనో ల్యాబ్ లో తయారు చేసినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రపంచంలో ఆధిపత్యం కోసం ఆ దేశాలు చేసే కుట్రల నిజానిజాలు బయటపడే రోజు బయట పడతాయి కానీ ఇట్లాంటి మహమ్మారి వందేళ్ళ క్రితమే ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.

9) భారత దేశంలో కరోనా వైరస్ కేసులు 200 మాత్రమే ఉన్నాయి. దీనికే ఇంత ఆందోళన ఎందుకు?

ఒక దేశంలో 200 కేసులు, మరో దేశంలో 2000 కేసులు ఉంటే రెండో దేశంలో epidemic పదింతలు ఉన్నట్టు కాదు. కరోనా వైరస్ కేసులు ప్రతి ఆరు రోజులకు డబుల్ అవుతాయనేది ఇప్పటివరకూ ఉన్న డేటా ను బట్టి తెలుస్తుంది. అంటే మొదటి దేశం రెండు మూడు వారాల్లో రెండో దేశం ఉన్న దశకు చేరుకోనుందని అర్థం. ఫిబ్రవరి 27 న మొదటి community transmission కేసు (అంటే ఎవరి నుండి వైరస్ సోకిందో తెలియని కేసు) నమోదు చేసుకున్న అమెరికాలో ఈరోజు 18,000 కు పైగా కేసులు నమోదయినాయి. టెస్ట్ కిట్ల కొరతతో తీవ్రమైన పరిస్థితిలో ఉన్నవాళ్లనే ఎక్కువగా టెస్ట్లు చేస్తున్న సందర్భంలో నమోదయిన నంబర్లివి.

ఇదంతా చెప్పేది ఆందోళన పెంచడానికి కాదు. ఈ మహమ్మారిని సరిగా అర్థం చేసుకొని సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి. అందరూ అప్రమత్తంగా ఉండి వైరస్ వ్యాప్తి చెందకుండా చేయగలిగితే అంతకన్నా కావలసింది ఏముంది? చైనా తీసుకున్న తీవ్రమైన, ఖచ్చితమైన చర్యల వల్ల, ప్రజలు అన్ని జాగ్రత్తలూ పాటించడం వల్ల అక్కడ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్ట గలిగారు.

10) ఇదంతా చైనా తప్పో, మన దేశం లోకి ఇంకో దేశం నుండి వచ్చిన వాళ్ళ తప్పో అని నిందించుకోవాల్సిన సమయం కాదిది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన కాలంలో మనం జీవిస్తున్నాం. ఎన్నో దేశాలు పర్యటించాలని ఆశపడుతూ, వీలయినన్ని దేశాలు తిరుగుతూ, అన్ని దేశాల్లో తయారవుతున్న టెక్నాలజీ, విలాస వస్తువులను అనుభవిస్తున్న ప్రజలు, రోగాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరినో ఒకరిని నిందించడం సరైనది కాదు. COVID-19 ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ʹచైనీస్ వైరస్ʹ అని పిలవడం అతని జాత్యహంకారాన్ని, అసహన భావాన్ని తెలియజేస్తుంది. అట్లాంటి ద్వేషపూరిత ఆలోచనల నుండి మనం దూరంగా ఉందాం.

ఆందోళన పెరిగినప్పుడు ఎదుటివాళ్లను నిందించడం చాలా సులువు. కానీ మనమందరం ఈ విపత్తులో కలిసి ఉన్నామనేది మనం మరువకూడని సమయమిది. Humans are more alike than different. ఎంత భయాందోళనలో అయినా మన మనిషితనాన్ని కోల్పోకుండా ఉండగలిగితే, ఇలాంటి సంక్షోభ సమయాలను కలిసికట్టుగా ఎదుర్కోగలుగుతాం.

- చైతన్య చెక్కిళ్ల, MD

Keywords : corona, virus, covid-19, india, america
(2020-03-31 01:59:32)No. of visitors : 284

Suggested Posts


లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !

ఆ పిల్లవాడు నిర్మాణ రంగంలో కూలీ... పొట్ట కూటి కోసం తన ఊరిని వదిలేసి దాదాపు వేయి కిలోమీటర్ల దూరంలో పని చేస్తున్నాడు.... అతనిప్పుడు బోరున ఏడుస్తున్నాడు..ఆపుకుందామన్నా అగని దుంఖం...మూడు రోజులుగా రోడ్లపై తిరుగుతూ ఆకలితో ఉన్నాడు..అలసిపోయి ఉన్నాడు... పోలీసులు కొడతారేమోనని భయంతో ఉన్నాడు....

ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కాదట అది దేవుడి అవతారమట... చైనా కరోనా విగ్రహాన్ని సృష్టించి..దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలట....లేకుండా చైనీయులంతా కరోనాకు బలి అయిపోతారట... జీవాలను చంపి తినేవాళ్ళను శ్క్షించడానికి దేవుడు కరోనా రూపంలో ప్రత్యక్షమయ్యాడట...

కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?

దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తోన్న వైద్య సిబ్బంది భద్రత గురించి, వారికి కరోనా వైరస్ రాకుండా ఉండే ఎక్విప్ మెంట్ గురించి ప్రభుత్వం కనీసం ఆలోచిస్తోందా ? చప్పట్లు కొట్టండి, లాక్ డౌన్ లు చేయండి పిలుపులియ్యగానే వాళ్ళ బాధ్యత తీరిపోయినట్టేనా ? ఈ ప్రశ్నలు అహర్నిషలు కొరోనాపై

పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి

భారత్ లో లాక్ డౌన్ సక్రమంగా అమలుచేస్తున్నామనే పేరుతో ప్రజలపై పోలీసులు చేస్తున్న దాడులు దుర్మార్గంగా ఉంటున్నాయి. చివరకు ఉన్నతాధికారులే దాడులు చేస్తున్న పోలీసులపై అక్కడక్కడ చర్యలు కూడా తీసుకోక తప్పని పరిస్థితి.

ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ

నాకిది(సామాజిక దూరం) కొత్తకాదు.. ఏళ్ళుగా నేనిది అనుభవిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కొద్దిగా ఎక్కువైంది అంతే. గత నాలుగు రోజులుగా అందరూ నన్ను వైరస్ సోకిన వాడిలా, ఏదో అనారోగ్యంతో ఉన్నట్లు చూస్తున్నారు. భయం భయంగా చూస్తూ.. చెత్తను అందిస్తున్నారు.

కరోనా: కనిపించని విషాదాలెన్నో

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి విస్తృత చర్చ జరుగుతోంది. అత్యవసరమైతే తప్ప జనం ఇళ్లలోంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారి చేసిన నేపథ్యంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులతో ఇంటి నుంచే పనిచేయించుకుంటున్నాయి.

Search Engine

ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
గొగోయ్ ని రాజ్యసభకు నామినేట్ చేయడంపై ʹసుప్రీంʹ లో పిల్ దాఖలు చేసిన మోడీ మద్దతుదారు
more..


కరోనా