ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !


ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !

ఆ పిల్లవాడు నిర్మాణ రంగంలో కూలీ... పొట్ట కూటి కోసం తన ఊరిని వదిలేసి దాదాపు వేయి కిలోమీటర్ల దూరంలో పని చేస్తున్నాడు.... అతనిప్పుడు బోరున ఏడుస్తున్నాడు..ఆపుకుందామన్నా అగని దుంఖం...మూడు రోజులుగా రోడ్లపై తిరుగుతూ ఆకలితో ఉన్నాడు..అలసిపోయి ఉన్నాడు... పోలీసులు కొడతారేమోనని భయంతో ఉన్నాడు....

బీహార్ కు చెందిన నిరుపేద టీనేజ్ పిల్లవాడు బతుకు దెరువుకోసం అనేక మంది తన ఊరి వాళ్ళతో కలిసి ఢిల్లీకి వచ్చాడు. చాలా రోజులుగా నిర్మాణరంగంలో కూలీగా పని చేస్తున్నాడు. కరోనా మహమ్మారి అన్ని పనులను బందు పెట్టింది. దేశాన్నే లాక్ డౌన్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి, అతని తోటి కూలీలకు ఉండేందుకు ఇల్లు లేదు, తిండి లేదు, బతికే దారిలేదు...ఇక ఆ పిల్లవాడు, తన ఊరి వాళ్ళైన సహచర కూలీలతో కలిసి స్వంత ఊరికి వెళ్ళాలని బయలుదేరాడు. బీహార్ వెళ్ళడానికి మూడు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పోలీసులను, వాళ్ళ లాఠీ దెబ్బలను తప్పించుకుంటూ ఢిల్లీ ‍అంతా నడుచుకుంటూ తిరుగుతున్నాడు. వెళ్ళే దారి కనపడక... ఆకలి భరించలేక.... భుజంపై 20 కిలోల కన్నా ఎక్కువ బరువున్న ఓ బ్యాగుతో నడిచి నడిచి అలసిపోయి... పోలీసులు వచ్చి కొడతారేమోననే భయంతో ఏడుస్తున్నాడు... ఢిల్లీ బస్ స్టాండ్ (ఆనంద్ విహార్ టెర్మినల్) పరిసరాల్లో తిరుగుతున్న అతనిని, అతని తోటి కూలీలను ఎన్డీటీవీ కదిలించింది. ఇక ఆ పిల్లవాడి ఏడ్పు ఆపడం ఎవరితరమూ కాలేదు. "పోలీసులు నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తాను" అంటూ ఏడుస్తున్న అతన్ని చూస్తే ప్రతి ఒక్కరికీ కన్నీళ్ళు వస్తాయి. ఇతను, ఇతని లాంటి రెక్కాడితే కానీ డొక్కాడని రోజు వారీ కూలీలు, స్వంత ఇల్లు లేనివారు ఈ లాక్ డౌన్ లో ఏం చేయాలి ? ఎక్కడికి పోవాలి ?

ఈ పిల్లవాడి దుఖం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ ఈ బాలుడికి, ఆయనలాంటి ఇతరులకు ఆహారం, ఆశ్రయం ఏర్పాటు చేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కోరారు.
ఈ బాలుడి లాగానే అనేక మంది ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్‌కు వస్తూనే ఉన్నారు, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన అనేకమంది కూలీలు, కార్మికులు తమ ఊరికి వెళ్ళే బస్సు ఎప్పటికైనా వస్తుందనే ఆశతో...

Keywords : corona, delhi, poor people, workers, bihar
(2020-03-31 08:37:32)



No. of visitors : 639

Suggested Posts


లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కాదట అది దేవుడి అవతారమట... చైనా కరోనా విగ్రహాన్ని సృష్టించి..దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలట....లేకుండా చైనీయులంతా కరోనాకు బలి అయిపోతారట... జీవాలను చంపి తినేవాళ్ళను శ్క్షించడానికి దేవుడు కరోనా రూపంలో ప్రత్యక్షమయ్యాడట...

కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?

దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తోన్న వైద్య సిబ్బంది భద్రత గురించి, వారికి కరోనా వైరస్ రాకుండా ఉండే ఎక్విప్ మెంట్ గురించి ప్రభుత్వం కనీసం ఆలోచిస్తోందా ? చప్పట్లు కొట్టండి, లాక్ డౌన్ లు చేయండి పిలుపులియ్యగానే వాళ్ళ బాధ్యత తీరిపోయినట్టేనా ? ఈ ప్రశ్నలు అహర్నిషలు కొరోనాపై

కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు

Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్ తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. వేడి ప్రదేశమైన ఫ్లోరిడాలో కరోనా వైరస్ విజృంభించి వ్యాపిస్తుంది.

పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి

భారత్ లో లాక్ డౌన్ సక్రమంగా అమలుచేస్తున్నామనే పేరుతో ప్రజలపై పోలీసులు చేస్తున్న దాడులు దుర్మార్గంగా ఉంటున్నాయి. చివరకు ఉన్నతాధికారులే దాడులు చేస్తున్న పోలీసులపై అక్కడక్కడ చర్యలు కూడా తీసుకోక తప్పని పరిస్థితి.

ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ

నాకిది(సామాజిక దూరం) కొత్తకాదు.. ఏళ్ళుగా నేనిది అనుభవిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కొద్దిగా ఎక్కువైంది అంతే. గత నాలుగు రోజులుగా అందరూ నన్ను వైరస్ సోకిన వాడిలా, ఏదో అనారోగ్యంతో ఉన్నట్లు చూస్తున్నారు. భయం భయంగా చూస్తూ.. చెత్తను అందిస్తున్నారు.

కరోనా: కనిపించని విషాదాలెన్నో

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి విస్తృత చర్చ జరుగుతోంది. అత్యవసరమైతే తప్ప జనం ఇళ్లలోంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారి చేసిన నేపథ్యంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులతో ఇంటి నుంచే పనిచేయించుకుంటున్నాయి.

Search Engine

ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
గొగోయ్ ని రాజ్యసభకు నామినేట్ చేయడంపై ʹసుప్రీంʹ లో పిల్ దాఖలు చేసిన మోడీ మద్దతుదారు
more..


ఈ