పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!


పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!

పాటించాల్సింది

(ప్రసాద్ ఇఫ్టూ తన ఫేస్ బుక్ వాల్ పై చేసిన పోస్ట్)

సామాజిక ఐక్యత, మనుషుల మధ్య మానసిక బంధం కరోనా మహమ్మారిని ఓడించడంలో ఉపకరించే నేటి ఆయుధాలు.*

ప్రియమైన మిత్రులారా!

సామాజిక దూరాన్ని (Social distancing) పాటించాలనే నినాదం సామాజిక ఐక్యత (social unity) ని విచ్చిన్నం చేయడానికి కారణం కాకుండా జాగ్రత్త పడదాం. కరోనా మహమ్మారిపై యుద్ధంలో సామాజిక ఐక్యత (social unity) ని ఒక బలమైన రక్షణ వ్యవస్థగా మార్చుకుందాం. ప్రగాఢ సామాజిక బంధాన్ని (strong social bonding) ని కరోనాపై యుద్ధంలో ఒక పదునైన ఆయుధంగా మార్చుకుందాం. మనుషుల శరీరాల మధ్య భౌతిక దూరాన్ని దృఢంగా పాటించాల్సిందే. అది ముమ్మాటికీ అవసరమైనది. ఆ సై0టిఫిక్ నియమం పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. దానిని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదు. అదేసమయం లో అది మనుషుల మధ్య మానసిక బంధాన్ని (mental bonding) విచ్చిన్నం చేయడానికి అవకాశం ఇవ్వరాదు. కరోనాని అరికట్టే లక్ష్యం తో చేపట్టే పనులు మనుషుల మధ్య మానసిక విభజనకూ లేదా విద్వేషాలకూ కారణం కారాదు. మనం పాటించే దూరాలు, కట్టుకునే గోడలు, వేసే ముళ్ళ కంచెలు కరోనా ని లక్ష్యం(target) గా చేసుకోవాలి. అంతేతప్ప, ఆ పేరిట చేసే పనులు మన ప్రజల మధ్య మానసిక దూరాల్ని పెంచరాదు. అవి మన మనుషుల మధ్య, ముఖ్యంగా మనస్సుల్లో అనవసరమైన అపోహలనూ, భయాలనూ సృష్టించరాదు. మనిషికీ మనిషికీ మధ్య అనవసర కృత్రిమ గోడల్ని సృష్టించకూడదు. ఇప్పుడు మనం తీసుకోవాల్సి జాగ్రత్తలివి.

ఈ ఆపద కాలంలో మనుషుల మధ్య మానసిక ఐక్యత (mental bonding) చాలా అవసరం. ఈ కష్టకాలంలో మనుషుల మధ్య మానసిక విభజన (mental division) రాకుండా తగు జాగ్రత్త పడదాం. మనుషుల శరీరాల మధ్య దూరాన్ని (physical distancing) కఠినంగా పాటించుదాం. మనుషుల యొక్క మనసుల మధ్య సమైక్యత (mental unity) ను చాటుదాం. మామూలు సమయాలలో కంటే రెట్టింపు సమైక్యత నేడు మనమధ్య ఏర్పడాలి. కరోనా మహమ్మారి ని ఓడించడంలోనూ, తరిమికొట్టడం లోనూ నేడు భారతీయులుగా మనమంతా ఓకేత్రాటిపై ఐక్య శక్తిగా నిలబడాల్సి వుంది. మన ప్రజల మధ్య సామాజిక ఐక్యత (social unity), ప్రగాఢ సామాజిక బంధం (strong social bonding) నేడు మరింత ఎక్కువగా పెరగాల్సి ఉంది. మనుషుల మధ్య మానసిక బంధం (mental bonding) బలోపేతం చేసే లక్ష్యంతో ముందడుగు వేద్దాం. ఇది అందుకు తగు సందర్భమూ, సమయమూ! అందుకే భౌతిక దూరాన్ని మనం మరింత కఠినంగా పాటిద్దాం. అదేసమయంలో మరింత సామాజిక సమైక్యతని పెంచే స్పూర్తితో మాత్రమే పాటిద్దాం. తద్వారా కరోనా మహమ్మారిని నిశ్చయంగా & త్వరగా ఓడిద్దాం.

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
26-3-2020

Keywords : corona, locj down, social distancing, physical distancing
(2020-03-31 08:54:56)No. of visitors : 160

Suggested Posts


లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !

ఆ పిల్లవాడు నిర్మాణ రంగంలో కూలీ... పొట్ట కూటి కోసం తన ఊరిని వదిలేసి దాదాపు వేయి కిలోమీటర్ల దూరంలో పని చేస్తున్నాడు.... అతనిప్పుడు బోరున ఏడుస్తున్నాడు..ఆపుకుందామన్నా అగని దుంఖం...మూడు రోజులుగా రోడ్లపై తిరుగుతూ ఆకలితో ఉన్నాడు..అలసిపోయి ఉన్నాడు... పోలీసులు కొడతారేమోనని భయంతో ఉన్నాడు....

ʹకరోనా వైరస్ కాదు దేవుడి అవతారం ... విగ్రహాలు ప్రతిష్టించి పూజించండిʹ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కాదట అది దేవుడి అవతారమట... చైనా కరోనా విగ్రహాన్ని సృష్టించి..దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలట....లేకుండా చైనీయులంతా కరోనాకు బలి అయిపోతారట... జీవాలను చంపి తినేవాళ్ళను శ్క్షించడానికి దేవుడు కరోనా రూపంలో ప్రత్యక్షమయ్యాడట...

కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?

దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తోన్న వైద్య సిబ్బంది భద్రత గురించి, వారికి కరోనా వైరస్ రాకుండా ఉండే ఎక్విప్ మెంట్ గురించి ప్రభుత్వం కనీసం ఆలోచిస్తోందా ? చప్పట్లు కొట్టండి, లాక్ డౌన్ లు చేయండి పిలుపులియ్యగానే వాళ్ళ బాధ్యత తీరిపోయినట్టేనా ? ఈ ప్రశ్నలు అహర్నిషలు కొరోనాపై

కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు

Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్ తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. వేడి ప్రదేశమైన ఫ్లోరిడాలో కరోనా వైరస్ విజృంభించి వ్యాపిస్తుంది.

పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి

భారత్ లో లాక్ డౌన్ సక్రమంగా అమలుచేస్తున్నామనే పేరుతో ప్రజలపై పోలీసులు చేస్తున్న దాడులు దుర్మార్గంగా ఉంటున్నాయి. చివరకు ఉన్నతాధికారులే దాడులు చేస్తున్న పోలీసులపై అక్కడక్కడ చర్యలు కూడా తీసుకోక తప్పని పరిస్థితి.

ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ

నాకిది(సామాజిక దూరం) కొత్తకాదు.. ఏళ్ళుగా నేనిది అనుభవిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కొద్దిగా ఎక్కువైంది అంతే. గత నాలుగు రోజులుగా అందరూ నన్ను వైరస్ సోకిన వాడిలా, ఏదో అనారోగ్యంతో ఉన్నట్లు చూస్తున్నారు. భయం భయంగా చూస్తూ.. చెత్తను అందిస్తున్నారు.

Search Engine

లాక్ డౌన్ కారణంగా దేశంలో పెరిగిన గృహ హింస‌
ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
more..


పాటించాల్సింది