ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ


ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ

ʹఈ

ʹʹనాకిది(సామాజిక దూరం) కొత్తకాదు.. ఏళ్ళుగా నేనిది అనుభవిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కొద్దిగా ఎక్కువైంది అంతే. గత నాలుగు రోజులుగా అందరూ నన్ను వైరస్ సోకిన వాడిలా, ఏదో అనారోగ్యంతో ఉన్నట్లు చూస్తున్నారు. భయం భయంగా చూస్తూ.. చెత్తను అందిస్తున్నారు. నిజానికి మేము సాధారణ రోజులలో కూడా ఇలాంటి వివక్షనే ఎదుర్కొంటాం.. ప్రస్తుత తరుణంలో ప్రజల ధోరణి, నన్ను చూసే విధానం ఇంకా ఘోరంగా తయారైంది..గత ఒక వారంగా,ఎక్కువ మంది మాస్క్ లతో, లేదా వస్త్రంతో జాగ్రత్తగా కప్పుకుని వస్తారు.. నా చేతిని తాకకకుండా ఉండేందుకు చాలా జాగ్రత్త పడతారు. కొందరైతే చేతులు కడుక్కోవడానికి ఇంటికి వెళ్లేదాకా కూడా ఆగరు. వెంటనే నా ముందే సానిటైజర్లు వేసుకుని రద్దుకుంటారు. రోజులు పెరుగుతున్న కొద్దీ పని తీవ్రత కూడా పెరుగుతుంది. చెత్తలో ప్రజలు వాడి పారేసిన మాస్క్ లుకూడా వుంటాయి తెలుసా.. భోజనానికి అరగంట విరామం తీసుకుంటాను. భార్య కట్టిచ్చింది తినడానికి 15 నిమిషాలు.ఆ తరువాత ఇంటికి ఫోన్ చేసి వాళ్ల గురించి అడుగుతాʹʹ అంటూ చెప్పారు రోజూ ఇంటింటికీ తిరిగి చెత్తను సమీకరించే కార్మికుడు తన చిరిగిన గ్లౌజ్ ను అప్యాయంతా తడుముతూ.
ఇతని పేరు మనోజ్ పాల్. తరతరాలుగా సామాజిక, ఆర్ధిక అణిచివేతకు గురవుతున్న దళితుడు. 37 ఏళ్ళ ఈ మనోజ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) లో కాంట్రాక్ట్ కార్మికుడు. ప్రతిరోజు ఉదయం తనకు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లి చెత్తను సమీకరించడం, దానికి సెగ్రిగేట్ చేసి దూరంగా పారవేయడం ఇదీ మనోజ్ డ్యూటీ. ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన ఇంట్లోని సెకండ్ హ్యాండ్ టెలివిజన్ ద్వారా లాక్ డౌన్ వార్త అతని చెవిని పడింది. మహమ్మారి ప్రజలను బలవంతంగా ఇంట్లో వుండేలా చేస్తే..అతని జీవనంలో మాత్రం ఎలాంటి మార్పులేదు.. ఎప్పటిలాగానే మరుసటి రోజు తెల్లవారుజామున లేచి పాల్ పట్పర్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలోని తన కాంట్రాక్టర్ కార్యాలయానికి వెళ్లి రిజిస్టర్‌లో సంతకం చేసి, కిలోమీటరు దూరంలో ఉన్న ఈడీఎంసీ కార్యాలయానికి వెళ్లి ..ఆపై తనకు కేటాయించిన టిప్పర్ ట్రక్కు ఎక్కడంతో డ్యూటీ మొదలవుతుంది. ఉదయం 9 గంటల్లా పట్పర్‌గంజ్‌లోని మొదటి కాలనీకి రిపోర్ట్ చేయాలి. అనేక గేటెడ్ పరిసరాల్లో తమ చెత్తను పారవేసేందుకు వారే గేటు వద్దకు వస్తారు, లేదా కాలనీకి చెందిన ఒక కార్మికుడు ప్రతి ఇంటి నుండి సేకరించి పాల్ వ్యాన్‌లో పడవేస్తాడు. అయితే ఇక్కడే తనకు అనేక భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి అంటారు మనోజ్.

కరోనా వైరస్ సోకి హోం కోరంటీన్ లో ఉంటున్న వాళ్ళ ఇళ్ళల్లో చెత్తను కూడా మనోజే తీసుకెళ్ళాలి. అలాంటి నాలుగు ఇళ్ళు మనోజ్ కు కేటాయించిన జోన్‌లో ఉన్నాయి. ʹʹఆ ఇళ్ళలోంచి కూడా నేనే చెత్తను తీసుకెళ్తా దానికి ప్రత్యేక ట్రక్ ఉందిʹʹ అంటాడు మనోజ్ చాలా నిర్వేదంగా...ఆ చెత్తను తీసుకెళ్తున్నందుకు తనకేమవుతుందో అనే ఆందోళనలేకుండా...

మనోజే కాదు దేశంలోని అనేక నగరాల్లో ఇప్పటికీ ఇళ్ళల్లోనే ఉన్న మనం తయారు చేస్తున్న చెత్తను తీసుకెళ్ళి మనకు జబ్బులు రాకుండా చూస్తుంది ఈ మనోజ్ లే...దాదాపు అన్ని చోట్లా, అందరూ దళితులే... మామూలు సమయాల్లో సరేగానీ కరోనా వణికిస్తున్న ఇప్పుడైనా వీళ్ళకు కనీస రక్షణ పరికరాలునాయా ? శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు వీళ్ళకు ప్రభుత్వం అందిస్తోందా ? దీనిపై మనోజ్ ఏమంటాడంటే...ʹʹ పని అయిపోగానే నా తోటి కార్మికులతో కలిసి ఓ చాయ్ తాగుతా ఆ తర్వాత ఇంటికి వెళ్తా. నేను ‍ఇంటికి వెళ్ళగానే పిల్లలు పరిగెత్తుకొచ్చి కాళ్ళకు చుట్టుకుంటారు. దాంతో నాకు భయమేస్తుంది. వాళ్ళకు వైరస్ అంటితే.. అందుకే బూడిదతో చెతులు రుద్దుకొని, నీళ్ళతో కడుకుంటా. శరీరంపై ఉన్న దుమ్మును దులుపుకొని ఇంట్లోకి వెళ్తాను. అయినా వైరస్ తో చావాలని ఆ విధి రాసి పెడితే.. ఏ దేవుడూ రక్షించలేడుʹʹ అంటారు మనోజ్ నిర్వేదంగా రోజూ రాత్రి ఇంట్లో అందరం కలిసి భోజనం చేస్తూ టీవీలో వార్తలు చూస్తాం. కరోనా వార్తలు రోజూ వింటున్నాం, చూస్తున్నాం. విదేశాలనుంచి విమానాల ద్వారా వచ్చిన ధనవంతులనుంచి ఈ వైరస్ వచ్చిందని నాకు తెలుసు...కానీ ఫలితం మాత్రం నాలాంటి వాళ్లదే అంటారు మనోజ్ చెమ్మగిల్లిన కళ్లతో.

Keywords : corona, delhi, lock down, delhi, worker, dalit
(2020-05-31 20:14:40)No. of visitors : 356

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

అత్యవసర డ్యూటీ నుండి వస్తున్న డాక్టర్లపై పోలీసుల లాఠీ చార్జ్... చేయి విరిగిన డాక్టర్

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని ఎయిమ్స్ డాక్టర్లు ఇద్దరిని పోలీసులు దారుణంగా కొట్టారు. రీతూ, యువరాజ్ అనే డాక్టర్లు బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో అత్యవసర విధులను ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు దాడి చేశారు.

Search Engine

వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
more..


ʹఈ