కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం


కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం

కరోనాతో

కోవిడ్ 19 వ్యాప్తి దృష్ట్యా జైళ్లలోని ఖైదీలందరినీ విడుదల చేయాలి.
రాజకీయ భిన్నాభిప్రాయాల కారణంగా అక్రమ నిర్బంధంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న సాయిబాబా, ఎనభై ఏళ్ల వరవరరావు, కాశీం వంటి రచయితలను, మేధావులను, ప్రజాసంఘాల కార్యకర్తలను విడుదల చేయాలి.

కరోనా వైరస్ నుంచి పౌరుల జీవించే హక్కును కాపాడటానికి ప్రభుత్వం ప్రజలందరినీ స్వీయ నిర్బంధంలోకి తీసికెళ్లింది. ఇది ప్రత్యేక పరిస్థితి. అయితే ఇది మనముందుకు ఒక ప్రశ్నను తీసుకొచ్చింది. జీవించే హక్కులో అంతర్భాగమైన స్వేచ్ఛ ప్రధానమా? లేక జీవించడం ప్రధానమా? అంటే.. బతికుంటేనే స్వేచ్ఛ కదా! అనే వాదన దిశగా ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. దీని న్యాయాన్యాయాలతో సంబంధం లేకుండా తాత్కాలికమే అయినా ఇది ఇప్పటి అవసరమని ప్రపంచ ప్రజలంతా కట్టుబడ్డారు.
ప్రభుత్వం పాటిస్తున్న ఈ సూత్రాన్ని ఖైదీలకు కూడా అన్వయించాలి. నేరారోపణలతో స్వేచ్ఛను నియంత్రించి నిందితులను ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. ఆధారాలు ఉన్నా లేకున్నా కేవలం నేరారోపణలతోనే జైళ్లలో ఎందరో ఉన్నారు. అలాగే సాక్ష్యాధారాలు, నేర విచారణ, శిక్షాస్మృతి మంచి చెడ్డల సంగతి ఎలా ఉన్నా శిక్షలు అనుభవిస్తున్న వాళ్లూ జైళ్లలో ఉన్నారు. స్వేచ్ఛకన్నా బతుకు ముఖ్యమని ప్రభుత్వం ఈ సందర్భంలో అనుకున్నట్లయితే ఖైదీలను ప్రత్యేకంగా నిర్బంధించాల్సిన అవసరం లేదు. జైళ్లలో ఖైదీలకు కరోనా అంటుకోకుండా నిరోధించడం సాధ్యం కాదు. ఒకవేళ జైళ్లలో కరోనా సోకితే రిమాండ్ ఖైదీలు, శిక్షపడిన ఖైదీలు, జైలు సిబ్బంది వ్యాధిగ్రస్తులవుతారు. భారీ ఎత్తున చనిపోతారు. అట్లాగే వైరస్ కూడా ప్రబలిపోతుంది.
మన దేశంలో జైళ్ల సామర్థ్యానికి మించి సగటున 114 శాతం అధికంగా ఖైదీలు ఉన్నట్లు 2019 నాటి భారతీయ న్యాయ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ సగటు లెక్క ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. ఒకేచోట ఇంత సాంద్రతతో మనుషులు నిర్బంధంలో ఉండటం ఇప్పుడెంత ప్రమాదమో చెప్పనవసరం లేదు. జైలు సామర్థ్యానికి తగినట్లే ఖైదీలు ఉన్నా అక్కడి వాతావరణం వాళ్ల జీవించే హక్కుకు విఘాతం కలిగిస్తుంది. ఈ విషయంలో ఖైదీల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆందోళనకు గురవుతారు. ఖైదీలు కూడా దేశ ప్రజలే. ప్రభుత్వం కరోనా బారి నుంచి ప్రజల బతుకు విషయంలో తీసుకొనే జాగ్రత్తలు ఖైదీలకు కూడా వర్తింపజేయాలి. కాబట్టి కరోనా సమస్య పూర్తిగా తీరే వరకు వారిని బైటనే ఉంచాలి. ఆ తర్వానే న్యాయ, శిక్షా ప్రక్రియలను కొనసాగించాలి.
రాజకీయ ఖైదీల విషయంలో కూడా ఇదే వైఖరి తీసుకోవాలి. మావోయిస్టు రాజకీయ సంబంధమైన ఆరోపణలతో దేశంలో ఎందరో జైళ్లలో ఉన్నారు. వీళ్లలో ఎక్కువ మంది రాజకీయ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కారణంగానే నిర్బంధాన్ని అనుభవిస్తున్నారు. మానవ జాతినే సవాలు చేసే ముప్పు ముంచుకొచ్చిన కరోనా సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మనుషులందరం కలిసి దీనిని ఎదుర్కోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. సిఎఎ వంటి ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకించిన వాళ్ళ దగ్గరి నుండి భీమాకొరేగావ్ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మంది వరకు ఎంతో మంది రాజకీయాల కారణంగానే జైళ్ళలో ఉన్నారు. వీరిలో వరవరరావు ఎనభై ఏళ్ల వయోభారంతో ఏడాదిన్నరగా జైలులో ఉన్నారు. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటివారికి కరోనా ముప్పు ఎక్కువ. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖైదీలందరినీ విడుదల చేయాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది. ఇందులో భాగంగానే మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖైదీలను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. సుప్రీంకోర్టు కూడా ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఖైదీలను విడుదల చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే అందులో ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడిన ఖైదీలను, ఏడు సంవత్సరాల లోపు శిక్షా నేరాలు ఆరోపించబడిన అండర్ ట్రయల్ ఖైదీలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం వల్ల ఈ పరిధిలోకి సాయిబాబా గాని, భీమా కోరేగాం నిందితులు గానీ, దేశవ్యాప్తంగా ఊపా కింద అరెస్టు కాబడిన వందలాది రాజకీయ ఖైదీలు గానీ వచ్చే అవకాశం లేదు. అంటే ఈ విపత్తు సమయంలో కూడా రాజకీయ కక్ష సాధింపు కొనసాగుతుంది. ఇది చాలా అమానవీయ చర్యగా, ఫాసిస్టు దమనకాండగా చరిత్రలో నిలిచిపోతుంది.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కోర్టుల్లో విచారణ కూడా సాగడం లేదు కాబట్టి రిమాండ్ ఖైదీలను జైళ్లలో ఉంచడమంటే వాళ్లను కరోనా వైరస్ కు అప్పగించినట్లే. వాళ్లు నేరం చేశారని నిర్ధారించకముందే వాళ్లను శిక్షించినట్టు అవుతుంది. తెలంగాణలో విప్లవ రచయితల సంఘం కార్యదర్శి, రచయిత కాశీం సహా గత ఆర్నెల్లలో అరెస్టు చేసిన రచయితలు, మేధావులు, ప్రజాసంఘాల బాధ్యులకు సంబంధించిన బెయిళ్ల విచారణ కూడా సాధ్యం కాదు. ఇది న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం. కాబట్టి వారి జీవించే హక్కును కాపాడటానికి తక్షణం జైళ్ల నుంచి విడుదల చేయాలి. ఈ సూత్రం కేవలం రిమాండ్ ఖైదీలకే కాకుండా కింది కోర్టుల్లో శిక్షపడి అప్పీలు తేలకుండా జైళ్లలో ఉన్న ఖైదీల విషయంలోనూ వర్తిస్తుంది. ప్రొ. సాయిబాబా తీవ్ర అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా బెడద తీరేదాకా జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించాలి. దేశ ప్రజలందరూ కరోనా విపత్తు వల్ల గృహ నిర్బంధంలో ఉన్న స్థితిలో ఖైదీలను కూడా ఇళ్ళకు పరిమితం చేయవచ్చు. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. న్యాయస్థానాలు కూడా ఇందులో జోక్యం చేసుకొని అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
-అరసవిల్లి కృష్ణ (విరసం అధ్యక్షుడు), బాసిత్ (విరసం ఉపాధ్యక్షుడు), రివేరా (విరసం సహాయ కార్యదర్శి)
30-03-2020

Keywords : varavararao, saibaba, kashim, political prisoners,
(2020-05-31 20:14:35)No. of visitors : 321

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
more..


కరోనాతో