288 రోజుల ఆమరణ నిరాహార దీక్ష... కన్ను మూసిన ప్రఖ్యాత విప్లవ గాయకురాలు


288 రోజుల ఆమరణ నిరాహార దీక్ష... కన్ను మూసిన ప్రఖ్యాత విప్లవ గాయకురాలు

288

టర్కీలో 288 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రఖ్యాత విప్లవ‌ గాయకురాలు హెలిన్ బొలెక్ కన్నుమూశారు. టర్కీ ప్రభుత్వం తమ కళా బృందాన్ని నిషేధించి తమ సభ్యులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆమె ఆమరణ నిరాహార ధీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇస్తాంబుల్‌లో దీక్ష చేస్తున్న ఓ ఇంట్లోనే ఆమె మృతి చెందినట్టు గ్రుప్ యోరుమ్ సంగీత కళా బృందం ట్విటర్లో వెల్లడించింది.
టర్కీలో గ్రుప్ యోరుమ్ బృందం ఉద్యమ గీతాలకు మారుపేరు. అయితే నిషేధిత రెవెల్యూషనరీ పీపుల్స్ లిబరేషన్ పార్టీ- ఫ్రంట్‌ (డీహెచ్‌కేపీసీ)తో సంబంధాలున్నాయంటూ.. టర్కీ ప్రభుత్వం గ్రుప్ యోరుమ్‌ను నిషేధించింది. 2016 నుంచి ఈ బ్యాండ్ ప్రదర్శలను నిలిపివేసి.. కొందరు బ్యాండ్ సభ్యులను జైల్లో పెట్టించింది.

గ్రుప్ యోరుమ్‌పై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలనీ.. తమ సభ్యులను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 28 ఏళ్ల హెలిన్, మరో సభ్యుడు ఇబ్రహీం గోక్సెక్ జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గతేడాది నవంబర్‌లో ఈ ఇద్దరినీ జైలు నుంచి విడుదల చేశారు. గొక్సెక్ భార్యతో పాటు మరో ఇద్దరు సభ్యులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. కాగా గత నెల 11న తీవ్ర అస్వస్థతకు గురైన హెలిన్, గోక్సెక్‌లను బలవంతంగా ఆస్పత్రికి తరలించినప్పటికీ.. చికిత్స తీసుకునేందుకు వారు నిరాకరించారు. దీంతో వారిని డిశ్చార్జ్ చేసినట్టు స్థానిక హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ (ఐహెచ్‌డీ) పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించి, దీక్షను విరమింపజేయాలంటూ తాము గత నెలలోనే ప్రభుత్వాన్ని సంప్రదించామనీ.. అయితే దీక్ష విరమిస్తేనే డిమాండ్లను పరిశీలిస్తామంటూ ప్రభుత్వం తిరస్కరించిందని ఐహెచ్‌డీ పేర్కొంది.

Keywords : banned musicband,helin bolek,dies, hunger strike, turkey, revolution
(2020-08-08 19:28:46)No. of visitors : 1640

Suggested Posts


Long live Ibrahim Kaypakkaya in the 45th anniversary of his assasination!

He is one of the best disciple of the Great Proletarian Cultural Revolution. He evaluated his own ideas and the TKP/ML, which he founded, as products of the Great Proletarian Cultural Revolution. Back when Marxist-Leninist ideas were active globaly, when in the 1960s and 1970s the struggles for revolution and Socialism were developing themselves

Search Engine

ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
more..


288