లాక్ డౌన్ నిబందనలు గాలికి వదిలేసిన బీజేపీ ఎమ్మెల్యే... వందల మందితో పుట్టినరోజు వేడుకలు


లాక్ డౌన్ నిబందనలు గాలికి వదిలేసిన బీజేపీ ఎమ్మెల్యే... వందల మందితో పుట్టినరోజు వేడుకలు

కరోనా మహమ్మారి భయంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంటే కొందరు మాత్రం లాక్ డౌన్ నిబందనలు పట్టించుకోకుండా యదేచ్చగా తిరిగేస్తున్నారు. కొందరైతే ఏకంగా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. సామాన్యులే కాదు ఏకంగా శాసన సభ్యులే ఇలా చేస్తే.....

మహా రాష్ట్రలోని వార్ధా బిజెపి ఎమ్మెల్యే దాదరావు కెచే ఆదివారంనాడు భౌతిక దూర‍ం పాటించాలన్న నిబందనను గాలికి వదిలేసి వందల మందితో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధి చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144, ఐపిసి సెక్షన్లు 188, 269 కింద ఎమ్మెల్యే దాదరావు కెచేపై చర్యలు తీసుకోవాలని ఆర్మీ సబ్ డివిజనల్ ఆఫీసర్ హరీష్ ధర్మిక్ స్థానిక పోలీసులకు నోటీసు జారీ చేశారు.

వార్ధ కలెక్టర్ వివేక్ భీమన్వర్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడుతూ... ʹʹమేము ఆయనకు ఈ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అతను మా నుండి అసలు అనుమతే కోరలేదు. ఎమ్మెల్యే రక్తదాన శిబిరం కోసం అనుమతి కోరాడు. ఆయన చెప్పిన పద్దతుల్లో చేయడానికి మేము అనుమతి నిరాకరించాం. అందుకు బదులు ఆర్వీ ప్రైమరీ హెల్త్ సెంటర్ (పిహెచ్‌సి) లో సామాజిక దూరం నిబందనలకు కట్టుబడి ఐదుగురు వ్యక్తులు రక్తదానం చేయడానికి మేము అనుమతించాము. అతని నివాసం వద్ద పెద్ద గుంపు ఉందన్న సమాచారం రాగానే పోలీసులు వెళ్ళి ఆ గుంపును చెదరగొట్టారు.

వందల మంది జనం గుమిగూడినప్పుడు కెచే ఇంట్లో ఉన్నట్లు ధృవీకరించారు వార్దా పోలీసు సూపరింటెండెంట్ బసవరాజ్ తేలి. "ఈ విషయంలో మేము కెచెకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసాము" అని అతను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

అయితే తనకేమీ తెలియదని ఇది ప్రత్యర్ధుల కుట్ర అని ఎమ్మెల్యే దాదరావు కెచే అంటున్నారు. ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ʹʹనేను 21 మంది కార్మికులను మాత్రమే ఆహ్వానించాను, వారు కరోనావైరస్ కారణంగా జీవనోపాధి కోల్పోయారు మరియు వారికి ఆహార ధాన్యాలు పంపిణీ చేశాను. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు నా గురువు భికారామ్ బాబాను చూడటానికి బయలుదేరాను. కానీ నా రాజకీయ విరోధులు పరిస్థితిని సద్వినియోగం చేసుకొని నేను ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నాను అనే మాటను వ్యాప్తి చేయడంతో చాలా మంది ప్రజలు నా నివాసానికి చేరుకున్నారు. నాకు సమాచారం వచ్చినప్పుడు నేను వెనక్కి వెళ్లి పోలీసుల సహాయంతో జనాన్ని చెదరగొట్టాను. ʹʹ

కెచె ఇంకా ఇలా అన్నారు "ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరినట్లుగా కరోనావైరస్ తో పోరాడటానికి మనమందరం సామాజిక దూర ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. కానీ నా ఇమేజ్ దెబ్బతినడానికి నా ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.ʹʹ
అయితే ఆ ఎమ్మెల్యే తన ప్రత్యర్థులు ఎవరన్నది మాత్రం చెప్పలేదు.

Keywords : corona, lockdown, bjp, mla, maharashtra, birthday party, police case
(2020-08-08 19:45:31)



No. of visitors : 487

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేత‌నాలు ఇవ్వాల్సిన అవసరంలేదు -పార్లమెంటరీ కమిటీ దుర్మార్గ సిఫార్సు

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గురువారం దుర్మార్గమైన‌ సిఫార్సు చేసింది.

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

Search Engine

ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
more..


లాక్