నరేంద్ర మోడీకి కమల్ హాసన్ బహిరంగ లేఖ‌!

నరేంద్ర

ప్రధాని నరేంద్ర మోడీకి నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రాసిన బహిరంగలేఖను ఎమ్. రవికాంత్ రెడ్డి తెలుగులోకి స్వేచ్చానువాదం చేసి తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేశారు. ఆ లేఖ మీ కోసం...

గౌరవనీయులైన ప్రధానమంత్రి,

భారతీయ రిపబ్లిక్,

సర్,
మీకు 23 వ తేదీన ఉత్తరం రాశాను ఇప్పటిదాకా కీర్తింపబడని హీరోలైన పేదవారు, అణచబడిన వారు, బలహీనులు, వేరే వారి మీద ఆధారపడిన వారు, కార్మికుల గురించి విస్మరించవద్దని. ఆ మరుసటి రోజే దేశం నోట్ల రద్దు తరహా కఠినమైన , తక్షణ లాక్ డౌన్ ప్రకటన విన్నది. నేను నిర్ఘాంతపోయినా మిమ్మల్ని విశ్వసించాను. నోట్ల రద్దు సమయంలో కూడా మిమ్మల్ని విశ్వసించాను. కానీ కాలం నా విశ్వాసం తప్పని నిరూపించింది. కాలం మీరు కూడా ఘోరమైన తప్పిదం చేశారని నిరూపించింది.

ప్రపంచంలోనే అతి గొప్ప మాస్ లీడర్ గా మీరు చెప్పిందల్లా చేశాం. మీ వ్యతిరేకులు కూడా నిరంతరం ప్రజల కోసం వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ని అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ మీరు చప్పట్లు కొట్టమంటే కొట్టారు. మీరు చెయ్యమన్నదల్లా చేస్తున్నామని మీరు మమ్మల్ని బానిసలుగా భావిస్తే అది తప్పు. నా ప్రజలకు నాయకుడిగా మిమ్మల్ని ప్రశ్నించే బాధ్యత నా మీద ఉంది. మా భాషలో ఎక్కడైనా మర్యాద తప్పానని మీరు భావిస్తే క్షమించండి.

నా అతి పెద్ద భయం ఏమంటే నోట్ల రద్దు ఘోరకలి లాక్ డౌన్ లో కూడా ఇంకా అనేక రెట్లు ఎక్కువ స్థాయిలో పునరావృతం అవుతుందని. నోట్ల రద్దు ప్రజల సేవింగ్స్ ని, జీవనాధారాన్ని నాశనం చేస్తే ముందస్తు ప్రణాళిక లేని లాక్ డౌన్ ప్రజల ప్రాణాలను, జీవనాధారాన్ని నాశనం చేస్తుంది. పేదవారికి మీరు తప్ప ఇంకో దిక్కు లేదు. డబ్బున్న వారిని మీరు దీపాలు వెలిగించి ఒక అద్భుతం సృష్టించమని ఒక పక్క చెబుతుంటే పేదల దుస్థితి, దరిద్రం వారిని చూసి వెక్కిరిస్తోంది. ఒక పక్క మీ (ధనిక) ప్రపంచం నూనె దీపాలు వెలిగిస్తుంటే మరోపక్క పేదలు వాళ్ళ తినబోయే ఒక రొట్టెని కాల్చుకోవడానికి కిరసనాయిలు ఎలా సంపాదించాలా అని అవస్థ పడుతుంది. మీ చివరి రెండు ప్రసంగాలు ప్రజలకు సాంత్వన కలిగించడానికి ప్రయత్నం చేశాయి. మంచిదే. కానీ అంతకంటే అర్జంట్ గా చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ఈ మానసిక సాంత్వన కలిగించే టెక్నీక్కులు బాల్కనీలో నిలబడి ఉత్సాహపరచే వారికి కొంతవరకూ ఉపయోగపడతాయేమో గానీ, తల దాచుకోవడానికి పై కప్పు లేని వారి సంగతేంటి? ధనిక, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ జీవితాలు నిర్మించుకోవడానికి ఆసరాగా నిలబడ్డ అతి పెద్ద సంఖ్యలో ఉన్న పేదవారిని నిర్లక్ష్యం చేయడం ద్వారా బాల్కనీ ప్రజల కోసం మీది బాల్కనీ ప్రభుత్వంగా మారదని నమ్ముతున్నాను. పేదవాడు ఎప్పుడూ మొదటి పేజీ వార్తల్లో కనబడడు గానీ దేశ స్ఫూర్తిని, జీడీపీ ని కాపాడి నిర్మించడంలో అతని పాత్రను విస్మరించలేం. అట్టడుగు భాగంలో ఉన్న పేదవారికి నాశనం చేస్తే పైన ఉన్న ధనిక వర్గం కూడా కుప్పకూలుతుందని చరిత్ర చెబుతుంది. సైన్స్ కూడా అదే చెబుతుంది.

ధనిక వర్గాలు పేదలపై రుద్దిన మొట్టమొదటి సంక్షోభం, మహమ్మారి ఇదే. మీరు అట్టడుగున ఉన్న వారిని తప్ప అందరినీ కాపాడాలని చూస్తున్నారు. దినసరి కూలీలు, పాచి పని చేసే వారు, తోపుడు బండి వారు, ఆటో, టాక్సీ డ్రైవర్లు పొద్దు ఎలా గడవాలా అని ఆలోచిస్తుంటే మీరు మాత్రం ధనిక వర్గాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. వాళ్లను కాపాడవద్దని నేనడం లేదు. ప్రతీ ఒక్కరినీ కాపాడాలి. ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదు. కోవిడ్ 19 చాలా మంది బాధితులను సృష్టించబోతుంది. కానీ మనం ఆకలి (H), అలసట (E), లోటు (D) ని సృష్టించే ఒక అనువైన ఆటస్థలం తయారు చేస్తున్నాం. ఈ HED 20 అనేది చూడడానికి చిన్నదిగా కనబడుతుంది గానీ కోవిడ్ 19 మాయమై పోయిన తర్వాత కూడా దాని ప్రభావం చాలా రోజులు ఉండేలా మనతో పాటు వదిలివెళుతుంది.

మనకి ఏ సంక్షోభం వచ్చినా మీరు మీకు సౌకర్యవంతంగా ఉండే ఎన్నికల ప్రచారం తరహా విధానాన్నే అవలంబిస్తున్నారు. బాధ్యతగా ఉండాల్సిన బాధ్యతను సామాన్య ప్రజలమీద, పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాల మీదకి నెట్టేయడం మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ అభిప్రాయం ప్రస్తుత, భవిష్యత్తు భారతాన్ని వివేకవంతం చేయడంలో ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్న వారిలో కలిగిస్తుంది మీరే. వివేకవంతులు అనే పదం వాడి మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి ఎందుకంటే పదం మీకు, మీ ప్రభుత్వానికి నచ్చదని నాకు తెలుసు. నేను పెరియార్, గాంధీజీలకు శిష్యుడిని. వారు మొదట వివేకవంతులు. కేవలం వివేకం మాత్రమే ఒక మనిషిని అందరికీ ధర్మం, సమానత్వం, సంపద అనే మార్గంలో నడిపిస్తుంది.

ప్రజల ఉత్సాహాన్ని కొంతవరకూ నిలబెట్టడం కోసం
ఎన్నికల ప్రచారం తరహా ప్రసంగాల మీదే ఫోకస్ పెట్టడం వల్ల మీ ప్రభుత్వం ప్రజల జీవితాలను రక్షించే నిజమైన కార్యక్రమాలను చేపట్టకుండా ఉండే ప్రమాదం ఉంది. కరోనా మహమ్మారి ఇంతలా విస్తృతం అవుతున్న రోజుల్లో అజ్ఞానపు మూర్ఖులని గుంపులు గుంపులుగా చేరకుండా నిరోధించలేక పోయారు. ఇండియాలో వ్యాధి ప్రబలడానికి ఇవే ప్రధాన కారకాలుగా మారాయి. ఈ నిర్లక్ష్యం కారణంగా పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరు వహిస్తారు?

ప్రపంచ ఆరోగ్య సంస్థకి చైనా ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం కరోనా నిర్ధారిత మొదటి కేసు డిసెంబర్ 8 న నమోదయింది. దీని తీవ్రతను అంచనా వేయడంలో ప్రపంచానికి సమయం పట్టిందని మీరు ఒప్పుకున్నా, ఫిబ్రవరి మొదట్లోనే కనీ, వినీ, చూడనంత ఉత్పాతం సంభవించబోతుందని ప్రపంచం గ్రహించింది. ఇండియాలో మొదటి కేసు జనవరి 30 న నమోదయింది. ఇటలీకి ఏమి జరిగిందో మనం చూసాం. కానీ నేర్చుకోవలసినంత త్వరగా మనం పాఠాలు నేర్చుకోలేదు. మనం గాఢ నిద్ర నుంచి మేల్కొని 140 కోట్ల ప్రజల లాక్ డౌన్ కి మీరు ఆదేశాలిచ్చారు. ప్రజలకి కేవలం నాలుగు గంటల సమయం, మీకు మాత్రం నాలుగు నెలల సమయం. సమస్య పెద్దది అవకముందే పరిష్కారాలతో సిద్ధంగా ఉండడం అనేది విజ్ఞత, ముందుచూపు ఉన్న నాయకుల లక్షణం.

ఈ విషయంలో మీరు విఫలమయ్యారని చెప్పడానికి చింతిస్తున్నాను. ఇంకా దరిద్రం ఏమిటంటే మీ ప్రభత్వం, అది అపాయింట్ చేసిన వారంతా వారి శక్తి యుక్తులన్నీ ఫీడ్ బాక్ ఇచ్చిన వారి.మీద, నిర్మాణాత్మక విమర్శ చేసిన వారి మీద ఎదురు దాడికి వినియోగిస్తున్నారు. జాతి ప్రయోజనాలను, ప్రజల శ్రేయస్సును కాంక్షించే బుద్ధి జీవుల గొంతులన్నీ మీ ట్రోల్ ఆర్మీ చేసే ట్రోల్స్ లో ముంచివేయబడి వారిని దేశద్రోహులుగా ముద్ర వేయడంలో మునిగిపోయారు.

నన్ను దేశద్రోహిగా ముద్ర వేయమని ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నా. ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని ప్రజలను నిందించలేరు. కానీ ఈ నింద భరించాల్సింది మీరే. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకొని డబ్బులు ఇచ్చేది వాళ్ళ జీవితాలను సాధారణంగా , సురక్షితంగా ఉండేలా చూడడానికే.

ఇలాంటి అతి పెద్ద సంఘటనలు చరిత్రలో రెండు కారణాల వల్ల నిలిచిపోతాయి. ఒకటి దాని స్వభావం వల్ల కారణమయ్యే మృత్యు వినాశనం, రెండు అది సృష్టించబోయే దీర్ఘకాలిక ప్రభావం, ప్రజలు వారి జీవితాల్లో ఏది ప్రధానమో తెలుసుకోవడం, దీనితో పాటు వచ్చే సామాజిక, సాంస్కృతిక మార్పులు. ఇప్పటిదాకా ప్రపంచం చూడని ఈ విపత్తుని చూసి నా మనసు క్షోభిస్తోంది.

సర్, ప్రజల సంక్షేమం కోరే అన్ని గొంతులనూ వినాల్సిన సమయం ఇది. నేను వారి క్షేమం కోరుతున్నాను. మనకున్న అన్ని అంతర్గత సరిహద్దులనూ చేరిపేసి మీ వైపు నిలబడి సహాయం చేయమని పిలుపునిచ్చే సమయం ఇది. భారతదేశ మహోన్నత శక్తి మానవ వనరులే. దీనివల్లే మనం గతంలో చాలా సంక్షోభాలను ఎదుర్కొన్నాం. దీన్ని కూడా జయిస్తాం కానీ ఇది ఎలా జరగాలంటే ఇది మనుషుల్ని విడదీసే మరొక కారణం కాకుండా అందరూ కలిసి ఈ మహమ్మారిని ఓడించడానికి మనమంతా కలిసి కట్టుగా ఉండే విధంగా జరగాలి.

మేము చాలా కోపంగా ఉన్నాం కానీ మీ వైపే ఉన్నాం.

జై హింద్

కమల్ హాసన్

(కమల్ హాసన్ ప్రధానికి రాసిన బహిరంగ లేఖ స్వేచ్ఛానువాదం ఎమ్. రవికాంత్ రెడ్డి)

Keywords : kamal haasan, narendra modi, corona, lockdown, letter
(2024-03-31 02:29:30)



No. of visitors : 1095

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేత‌నాలు ఇవ్వాల్సిన అవసరంలేదు -పార్లమెంటరీ కమిటీ దుర్మార్గ సిఫార్సు

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గురువారం దుర్మార్గమైన‌ సిఫార్సు చేసింది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నరేంద్ర