లాక్ డౌన్: కొడుకు కోసం 1,400 కిలోమీటర్లు స్కూటర్ పై ప్రయాణించిన తల్లి


లాక్ డౌన్: కొడుకు కోసం 1,400 కిలోమీటర్లు స్కూటర్ పై ప్రయాణించిన తల్లి

బోధన్‌కు చెందిన రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. 12 ఏళ్ల క్రితం భర్త మరణించాడు. అప్పటినుంచి పిల్లల ఆలనాపాలనా ఆమే చూస్తోంది. చిన్నవాడైన మహ్మద్‌ నిజాముద్దీన్‌ ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. నెల్లూరుకు చెందిన నిజాముద్దీన్‌ స్నేహితుడు బోధన్‌లో ఇంటర్‌ చదివాడు. అతడి ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షల కోసం గత నెల ఇద్దరు కలసి హైదరాబాద్‌ నుంచి బోధన్‌కు వచ్చారు. స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో అతడికి తోడుగా నిజాముద్దీన్‌ మార్చి 12 నెల్లూరుకు వెళ్లాడు. ఇదే సమయంలో కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో అతడు చిక్కుకుపోయాడు.
ఇది తెలిసి తల్లి రజియాబేగం ఆందోళనకు గురయ్యారు. బోధన్‌ ఏసీపీ జైపాల్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన ఇచ్చిన లెటర్‌ తీసుకుని, 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు సోమవారం ఉదయం స్కూటీపై బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నారు. కుమారుడితో కలిసి అదే స్కూటీపై సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం మధ్యాహ్నం వారు కామారెడ్డికి చేరుకున్నారు. కామారెడ్డిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కొడుకును చూడాలనే తపన తనను అంతదూరం వెళ్లేలా చేసిందని తెలిపారు. కుమారుడిని ఇంటికి క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా వెళ్లానని, అటవీ ప్రాంతం గుండా వెళ్లినా భయం అనిపించలేదన్నారు. చాలా చోట్ల పోలీసులు ఆపారని, బోధన్‌ ఏసీపీ ఇచ్చిన లెటర్‌ను చూపించడంతో అనుమతించారని వివరించారు.

Keywords : corona, lockdown, teacher, mother, son, kamreddy, nelloor, scoty
(2020-08-08 05:40:29)



No. of visitors : 194

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేత‌నాలు ఇవ్వాల్సిన అవసరంలేదు -పార్లమెంటరీ కమిటీ దుర్మార్గ సిఫార్సు

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గురువారం దుర్మార్గమైన‌ సిఫార్సు చేసింది.

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

Search Engine

ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
more..


లాక్