ఆకలితో రోడ్డెక్కిన వలస కార్మికులపై లాఠీచార్జ్....వేయి మందిపై కేసులు...కార్మిక నాయకుడి అరెస్ట్ !

వాళ్ళు దేశంలోని ఎక్కడేక్కడినుండో ము‍ంబై వచ్చి రోజూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కడుపు నింపుకునే వలస కార్మికులు. ఒక్క రోజు పని లేకపోయినా పస్తులుండే పరిస్థితివాళ్ళది. ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతున్న దేశం లాక్ డౌన్ లో ఉంది. ఆ వలస కూలీలకు చేసేందుకు పని లేదు, తినడానికి తిండి లేదు,ఉండడానికి ఇల్లు లేదు. ప్రభుత్వ ప్రకటనలే తప్ప సహాయం లేదు. మొదటి సారి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి అనేక కష్టాలు పడుతూ తిండి ఉండీ లేక బతుకులు ఈడ్చారు. ఇప్పుడు ప్రధాని రెండో సారి మళ్ళీ ప్రకటించగానే వాళ్ళ గుండెల్లో రాళ్ళు పడ్డాయి. ఏం చేయాల్నో పాలుపోలేదు. ఇక్కడ చావడం కన్నా స్వంతూర్లకు వెళ్ళిపోవడం మేలని అభిప్రాయానికి వచ్చారు. ఒక వేళ కరోనాతోనో, ఆకలితోనో చావే తప్పదనుకుంటే స్వంత ఊర్లోనే చావాలనుకున్నారు. ఒక్కసారే వందల మంది రోడ్లమీదికి వచ్చారు. బాంద్రా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమను తమ ఊర్లకు పంపించాలంటూ నినాదాలు చేశారు.

పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు వేల సంఖ్యలో పటేల్‌ నగరీ ప్రాంత మురికివాడల్లోని అద్దె ఇళ్లలో ఉంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని వారంతా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి పనులు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వారికి ఆహారం, నిత్యావసరాలను అందజేశాయి. కేంద్రం లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుందని భావించిన వారంతా గుంపులుగుంపులుగా మంగళవారం ఉదయం నుంచి బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకోవడం ప్రారంభించారు. ఇంతలోనే లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించగానే అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సుమారు వెయ్యి మంది వలస కూలీలు రైల్వే స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసదుల్లా షేక్‌ మాట్లాడుతూ.. సంపాదన లేకపోవడంతో ఇప్పటికే తమ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయిందనీ, దయచేసి స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని వేడుకున్నాడు. అక్కడికి చేరుకున్న‌ పోలీసులు వలస కూలీలపై లాఠీచార్జ్ చేశారు. ఆకలితో అలమటిస్తున్న ఆ శరీరాలపై లాఠీలు కరాళనృత్యం చేశాయి. చావబాది వాళ్ళందరినీ చెదరగొట్టి విజయగర్వంతో ప్రభుత్వం నవ్వుకుంది. వేయిమంది మీద కేసులు నమోదు చేశారు.

బాంద్రా స్టేషన్‌కు వేలాది మంది వలస కూలీలు తరలివచ్చేలా పుకార్లు సృష్టించాడని ఆరోపిస్తూ కార్మిక నాయకుడు వినయ్‌ దుబేను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో ʹʹచలో ఘర్‌‌ కి ఒరేʹ (ఇళ్లకు వెళ్దాం) అంటూ పోస్టులు పెట్టడంతో దాన్ని చూసిన వలస కార్మికులు వేలాదిగా తరలివచ్చారని పోలీసులు చెప్పారు. వినయ్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో‌ పోస్టులు పెట్టడంతో అవి చూసి బాంద్రాకు వచ్చారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ʹఉత్తర్‌‌ భారతీయ మహా పంచాయత్‌ʹ అనే ఎన్‌జీవో నడుపుతున్న వినయ్‌ దుబే మహారాష్ట్రలో పనిచేసే వలస కార్మికుల తరఫున పోరాడుతూ ఉంటారు. కాగా.. ఈమధ్య కాలంలో ఆయన మాట్లాడిన వీడియో మంగళవారం బాగా వైరల్‌ అయింది. ʹʹ లాక్‌డౌన్‌ పెంచితే ఉత్తర్‌‌ప్రదేశ్‌, బీహార్‌‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రైళ్లు పెట్టాలి. కావాలంటే మేం అక్కడికి వెళ్లిన తర్వాత క్వారంటైన్‌లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కరోనాతో కాదు.. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం. ఏప్రిల్‌ 14 వరకు వెయిట్‌ చేస్తాం. ఆ తర్వాత కాలినడకన మా ఊళ్లకు వెళ్తాంʹʹ అని వీడియోలో హెచ్చరించారు. దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని, లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించలేదనే నేరంపై వినయ్‌ దుబే పై కేసు పెట్టారు పోలీసులు. ఆయన మాట్లాడిన మాటల్లో, ఆయన పోస్ట్ చేసిన‌ వీడియోలో ఏం తప్పు ఉందో మహా ఘనత వహించిన పాలకులకే తెలియాలి. ఈ దేశంలో పాలకులను ప్రశ్నించడం నేరం, పేదలుగా పుట్టడం నేరం.

Keywords : mumbai, migrants, maharashtra, police lathicharge
(2024-04-25 02:54:10)



No. of visitors : 761

Suggested Posts


గాయపడ్డ తండ్రిని ఎక్కించుకొని1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన13 ఏళ్ళ చిన్నారి

లాక్ డౌన్ వలస కార్మికులను ఎన్నో కష్టాల పాలుచేస్తోంది. వాళ్ళు ఎన్ని రిస్క్ లైనా భరించి స్వంత ఇంటికి చేరుకోవాలని భావిస్తున్నారు. ఒకే ట్రక్కులో వందల మంది కిక్కిరిసి వెళ్తున్నారు. వేల కిలోమీటర్లు నడుస్తున్నారు.

లాక్ డౌన్: వలస కార్మికుల ఆకలి కేకలు - స్మశానంలో పడేసిన కుళ్ళిన అరటిపళ్ళు తింటూ....

లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీ నగరంలోని వేలాది మంది వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళకు ఉండడానికి షెల్టర్‌ లేక అల్లాడి పోతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా యమునా నది ఒడ్డున ఫ్లై ఓవర్ ల కింద బతుకులీడుస్తున్నారు. ఆ నదీ తీరాన వందల మంది వలస కార్మికులు తిండీ తిప్పలు లేక పస్తులతో అలమటిస్తున్నారు.

రైలు టిక్కట్ల పేరుతో వలస కార్మికులను దోచుకున్న బీజెపి నేత....ప్రశ్నించినందుకు కార్మికుడిపై దాడి

అసలే లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికులను ఓ బీజేపీ నాయకుడు నిలువుదోపిడీ చేశాడు. పైగా ఈ విషయంపై ప్రశ్నించినందుకు ఓ కార్మికుడిని రక్తం కారేట్టు తీవ్రంగా కొట్టాడు.

సైకిల్ పై స్వంతూరుకు బయలు దేరిన వలస కార్మికులు... భార్యాభర్త మరణం,అనాధ‌లైన చిన్నారులు

చత్తీస్ గడ్ కు చెందిన కృష్ణ‌, అత‌ని భార్య ప్ర‌మీల ఉపాధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ లోని ల‌క్నో‌కు వ‌ల‌స వచ్చి అక్కడి జాన్కీపుర మురికివాడ‌లో నివ‌సిస్తున్నారు. వీరికి నాలుగేండ్ల కూతురు చాందినితోపాటు మూడేండ్ల కొడుకు నిఖిల్ ఉన్నారు.

హైదరాబాద్ శివార్లలో.. ఆకలితో..ఆగ్రహంతో...తిరగబడ్డ వలసకార్మికులు ...రెండు నెలలుగా జీతాలివ్వని కంపెనీ

హైదరాబాద్ నగర శివార్లలో...సంగా రెడ్డి జిల్లా కంది వద్ద కడుతున్న ఐఐటీ భవన నిర్మాణాల కోసం వచ్చిన కార్మికులు ఇవ్వాళ్ళ ఆకలితో, అసహనంతో తిరగబడ్డారు. పనులు చేయించుకొని జీతాలు ఇవ్వని కంపనీ ఒకవైపు ఊరికి వెళ్ళలేని లాక్ డౌన్ మరో వైపు వాళ్ళను నిలవనివ్వలేదు. దాదాపు 2 వేల మంది కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేశారు.

వలస కూలీలు స్వంతూర్లకు పోవడానికి సహకరించిన వాళ్ళపై కేసులు...బిల్డర్ల కోసం కర్నాటక బీజేపీ ప్రభుత్వం దుర్మార్గం

వలస కార్మికులను తమ స్వంతూర్లకు వెళ్ళడానికి సహాయం చేస్తున్న సామాజిక కార్యకర్తలపట్ల బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా కోపంగా ఉన్నారు. ఆ వ్యాపారులకు మద్దతుగా ప్రభుత్వం రంగంలోకి దిగి కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోంది.

సూరత్ లో మళ్ళీ తిరగబడ్డ వలస కార్మికులు...పోలీసుల లాఠీచార్జ్, అరెస్టులు

గుజరాత్ రాష్ట్రం సూరత్ లో వలస కార్మికులు మరో సారి తిరగబడ్డారు. కార్మికులు ఇలా తిరగబడి పోలీసులతో ఘర్షణ పడటం నెల రోజుల్లో దాదాపు ఇది ఆరోసారి. అనేక రాష్ట్రాల నుండి బతకడానికి సూరత్ వచ్చిన లక్షల మంది కార్మికులు లాక్ డౌన్ కారణంగా పనులు కోల్పోయారు.

కడుపు మండి సూరత్ లో మళ్ళీ రోడ్డెక్కిన వలస కూలీలు... లాఠీలు, టియర్ గ్యాస్ తో విరుచుకపడ్డ పోలీసులు

గుజరాత్ లోని సూరత్ లో సోమవారం మధ్యాహ్నం పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ సంఘటన సూరత్ శివార్లలోని వారెలి సమీపంలో జరిగింది. వలస‌ కార్మికులు తమ స్వస్థలానికి తిరిగి పంపమని డిమాండ్ చేయడంతో గొడవ చెలరేగింది.

బిల్డర్లతో మీటింగ్ తర్వాత వలస కార్మికుల రైళ్లను రద్దు చేసిన కర్నాటక సీఎం !

కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యెడియరప్ప రాష్ట్రంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లతో సమావేశమైన కొంత సేపటికే వలస కార్మికులను తమ సొంత పట్టణానికి తీసుకెళ్లే రైళ్లన్నింటినీ రద్దు చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో తిరగబడ్డ వలస కూలీలు... పోలీసులపై దాడి, పోలీసుల లాఠీచార్జ్

మే 4వ తేదీ నుండి వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను వారి వారి స్వంత గ్రామాలకు పంపిస్తామని ప్రకటించిన కేంద్రం యూటర్న్ తీసుకోవడం వలస కూలీల గుండెల్లో మరింత మంటను రాజేసింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆకలితో