లాక్ డౌన్: వలస కార్మికుల ఆకలి కేకలు - స్మశానంలో పడేసిన కుళ్ళిన అరటిపళ్ళు తింటూ....


లాక్ డౌన్: వలస కార్మికుల ఆకలి కేకలు - స్మశానంలో పడేసిన కుళ్ళిన అరటిపళ్ళు తింటూ....

లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీ నగరంలోని వేలాది మంది వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళకు ఉండడానికి షెల్టర్‌ లేక అల్లాడి పోతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా యమునా నది ఒడ్డున ఫ్లై ఓవర్ ల కింద బతుకులీడుస్తున్నారు. ఆ నదీ తీరాన వందల మంది వలస కార్మికులు తిండీ తిప్పలు లేక పస్తులతో అలమటిస్తున్నారు.

జనతా కర్ఫ్యూ అనంతరం మార్చి 24వ తేదీన మొదటిసారి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఢిల్లీలోని వలస కార్మికులంతా అప్పటి వరకు తాము దాచుకున్న అతి స్వల్ప సొమ్ముతో ఏప్రిల్‌ మొదటి వారం వరకు నెట్టుకొచ్చారట. అప్పటి నుంచి వారికి తలదాచుకునేందుకు ఇంత నీడతోపాటు ఆకలి దప్పులు తీర్చుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఒకటి, రెండు రోజులు అక్కడిక్కడ అడుక్కొని అర్ధాకలితో బతికిన వారికి శనివారంతో ఏమీ లేకుండా పోయింది. ఢిల్లీ అధికారులు కూడా వారికి ఆహారాన్ని అందించలేక పోయారు. దాంతో ఆకలితో ఆగ్రహానికి గురైన వలస కార్మికులు ఆందోళన చేపట్టారు. కొందరు యువకులు అక్కడున్న రేకుల షెడ్డును తగలబెట్టారు. ఈ సందర్భంగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీఛార్జీకి పక్కనున్న నదిలో దూకి ఓ యువకుడు మరణించారని వలస కార్మికులు ఆరోపిస్తుండగా, అది నిజం కాదని, నదిలో చనిపోయిన వ్యక్తి వివరాలు కూడా తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి పట్టుమని పది కిలోమీటర్ల దూరంలో కూడాలేని ఆ వలస కార్మికులకు పట్టుమని పిడికెడు అన్నం పెట్టేవారు కూడా లేకుండా పోయారట. యమునా నది మీదుగా వెళుతున్న ఓ మంచినీళ్ల పైపు లీకేజీ నీళ్లను పట్టుకొని వారు గొంతు తడుపుకుంటున్నారు. ఒకటి, రెండు రోజులైతే తాము పస్తులు ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని, అంతకుమించి ఉండలేమని వలస కార్మికులు వాపోతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఆకలికి తట్టుకోలేని కొందరు యమునా నదీ తీరంలో ఉన్న స్మశానంలో కుళ్ళిపోయి పడేసిన అరటి పండ్లు తినడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఢిల్లీలోని నిగ‌మ్‌బోధ్ ఘాట్‌లోని శ్మ‌శానంలో కొంద‌రు తిన‌డానికి ప‌నికి రానివి, కుళ్లిన స్థితిలో ఉన్న‌ అర‌టిపండ్ల‌ను ప‌డేసి పోయారు. ఇది లాక్‌డౌన్ వ‌ల్ల స్వస్థ‌లాల‌కు వెళ్ల‌లేక‌, య‌మునా న‌దీ తీరం ద‌గ్గ‌రే చిక్కుకుపోయిన‌ వ‌ల‌స కార్మికుల కంట ప‌డింది. తిండీనీళ్లు లేక అల‌మ‌టిస్తున్న వాళ్లు వెంట‌నే ఆ శ్మ‌శానంలోని అర‌టిపండ్ల‌ను ఏరుకోవడం ప్రారంభించారు.

అక్క‌డే బ్యాగులో అర‌టిపండ్ల‌ను నింపుకుంటున్న ఓ వ్య‌క్తి దీని గురించి మాట్లాడుతూ.. "అర‌టిపండ్లు అంత త్వ‌ర‌గా చెడిపోవు. మంచివి ఏరుకుంటే కొద్ది కాల‌మైనా మా ఆక‌లి తీర్చేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి" అని పేర్కొన్నాడు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అలీఘ‌ర్‌కు చెందిన ఓ వ‌ల‌స కార్మికుడు మాట్లాడుతూ.. "మాకు స‌రిగా తిండి పెట్ట‌డం లేదు. కాబ‌ట్టి వీటిని తీసుకొని జాగ్ర‌త్త‌ప‌డ‌ట‌మే మంచిది. రెండు రోజులు క‌డుపు మాడిన త‌ర్వాత ఈరోజు ఆహారం దొరికింది" అంటూ త‌మ ద‌య‌నీయ ప‌రిస్థితిని వెల్ల‌డించాడు

Keywords : delhi, migrants, hungry, corona, lockdown
(2020-06-04 00:22:16)No. of visitors : 309

Suggested Posts


గాయపడ్డ తండ్రిని ఎక్కించుకొని1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన13 ఏళ్ళ చిన్నారి

లాక్ డౌన్ వలస కార్మికులను ఎన్నో కష్టాల పాలుచేస్తోంది. వాళ్ళు ఎన్ని రిస్క్ లైనా భరించి స్వంత ఇంటికి చేరుకోవాలని భావిస్తున్నారు. ఒకే ట్రక్కులో వందల మంది కిక్కిరిసి వెళ్తున్నారు. వేల కిలోమీటర్లు నడుస్తున్నారు.

రైలు టిక్కట్ల పేరుతో వలస కార్మికులను దోచుకున్న బీజెపి నేత....ప్రశ్నించినందుకు కార్మికుడిపై దాడి

అసలే లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికులను ఓ బీజేపీ నాయకుడు నిలువుదోపిడీ చేశాడు. పైగా ఈ విషయంపై ప్రశ్నించినందుకు ఓ కార్మికుడిని రక్తం కారేట్టు తీవ్రంగా కొట్టాడు.

సైకిల్ పై స్వంతూరుకు బయలు దేరిన వలస కార్మికులు... భార్యాభర్త మరణం,అనాధ‌లైన చిన్నారులు

చత్తీస్ గడ్ కు చెందిన కృష్ణ‌, అత‌ని భార్య ప్ర‌మీల ఉపాధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ లోని ల‌క్నో‌కు వ‌ల‌స వచ్చి అక్కడి జాన్కీపుర మురికివాడ‌లో నివ‌సిస్తున్నారు. వీరికి నాలుగేండ్ల కూతురు చాందినితోపాటు మూడేండ్ల కొడుకు నిఖిల్ ఉన్నారు.

హైదరాబాద్ శివార్లలో.. ఆకలితో..ఆగ్రహంతో...తిరగబడ్డ వలసకార్మికులు ...రెండు నెలలుగా జీతాలివ్వని కంపెనీ

హైదరాబాద్ నగర శివార్లలో...సంగా రెడ్డి జిల్లా కంది వద్ద కడుతున్న ఐఐటీ భవన నిర్మాణాల కోసం వచ్చిన కార్మికులు ఇవ్వాళ్ళ ఆకలితో, అసహనంతో తిరగబడ్డారు. పనులు చేయించుకొని జీతాలు ఇవ్వని కంపనీ ఒకవైపు ఊరికి వెళ్ళలేని లాక్ డౌన్ మరో వైపు వాళ్ళను నిలవనివ్వలేదు. దాదాపు 2 వేల మంది కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేశారు.

వలస కూలీలు స్వంతూర్లకు పోవడానికి సహకరించిన వాళ్ళపై కేసులు...బిల్డర్ల కోసం కర్నాటక బీజేపీ ప్రభుత్వం దుర్మార్గం

వలస కార్మికులను తమ స్వంతూర్లకు వెళ్ళడానికి సహాయం చేస్తున్న సామాజిక కార్యకర్తలపట్ల బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా కోపంగా ఉన్నారు. ఆ వ్యాపారులకు మద్దతుగా ప్రభుత్వం రంగంలోకి దిగి కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోంది.

కడుపు మండి సూరత్ లో మళ్ళీ రోడ్డెక్కిన వలస కూలీలు... లాఠీలు, టియర్ గ్యాస్ తో విరుచుకపడ్డ పోలీసులు

గుజరాత్ లోని సూరత్ లో సోమవారం మధ్యాహ్నం పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ సంఘటన సూరత్ శివార్లలోని వారెలి సమీపంలో జరిగింది. వలస‌ కార్మికులు తమ స్వస్థలానికి తిరిగి పంపమని డిమాండ్ చేయడంతో గొడవ చెలరేగింది.

ఆకలితో రోడ్డెక్కిన వలస కార్మికులపై లాఠీచార్జ్....వేయి మందిపై కేసులు...కార్మిక నాయకుడి అరెస్ట్ !

వాళ్ళు దేశంలోని ఎక్కడేక్కడినుండో ము‍ంబై వచ్చి రోజూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కడుపు నింపుకునే వలస కార్మికులు.

ఏపీలో తిరగబడ్డ వలస కూలీలు... పోలీసులపై దాడి, పోలీసుల లాఠీచార్జ్

మే 4వ తేదీ నుండి వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను వారి వారి స్వంత గ్రామాలకు పంపిస్తామని ప్రకటించిన కేంద్రం యూటర్న్ తీసుకోవడం వలస కూలీల గుండెల్లో మరింత మంటను రాజేసింది.

బిల్డర్లతో మీటింగ్ తర్వాత వలస కార్మికుల రైళ్లను రద్దు చేసిన కర్నాటక సీఎం !

కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యెడియరప్ప రాష్ట్రంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లతో సమావేశమైన కొంత సేపటికే వలస కార్మికులను తమ సొంత పట్టణానికి తీసుకెళ్లే రైళ్లన్నింటినీ రద్దు చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది.

సూరత్ లో మళ్ళీ తిరగబడ్డ వలస కార్మికులు...పోలీసుల లాఠీచార్జ్, అరెస్టులు

గుజరాత్ రాష్ట్రం సూరత్ లో వలస కార్మికులు మరో సారి తిరగబడ్డారు. కార్మికులు ఇలా తిరగబడి పోలీసులతో ఘర్షణ పడటం నెల రోజుల్లో దాదాపు ఇది ఆరోసారి. అనేక రాష్ట్రాల నుండి బతకడానికి సూరత్ వచ్చిన లక్షల మంది కార్మికులు లాక్ డౌన్ కారణంగా పనులు కోల్పోయారు.

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


లాక్