వాహనాలను తనిఖీ చేసిన ఆరెస్సెస్ కార్యకర్తలను విమర్షించినందుకు ప్రొఫెసర్ ను తొలగించిన యూనివర్సిటీ


వాహనాలను తనిఖీ చేసిన ఆరెస్సెస్ కార్యకర్తలను విమర్షించినందుకు ప్రొఫెసర్ ను తొలగించిన యూనివర్సిటీ

వాహనాలను

ఆరెస్సెస్ ను విమర్షించినందుకు ఓ ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. నొయిడాలో లో జరిగిన ఈ దుర్మార్గం వివరాల్లోకి వెళ్తే....

తెలంగాణ రాష్ట్రం యాదగిరి భువనగిరిజిల్లాలో హైదరాబాద్ వరంగల్ హైవేపై ఖాకీ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని చేతిలో లాఠీలు పట్టుకున్న‌ ఆరెస్సెస్ కార్యకర్తలు రోడ్డుపై వెళ్తున్న‌ వాహనాలను ఆపి చెక్ చేసిన ఘటనపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆరెస్సెస్ కార్యకర్తలు అలా చేయడానికి తమ అనుమతి లేదని పోలీసులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. భోపాల్ లోని మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (ఎంసియుయుజెసి) నొయిడా క్యాంపస్ లో ఎలాక్ట్రనిక్ మీడియా సబ్జెక్ట్ భోదించే ప్రొఫెసర్ ముఖేష్ కుమార్ తన ఫేస్ బుక్ వాల్ పై ఆరెస్సెస్ కార్యకర్తలు చేసిన పనిని విమర్షించారు.
"ఈ నిరక్షరాస్యులు చేతుల్లో కర్రలు పట్టుకొని ఖాకీ ప్యాంటు తొడుక్కొని పోలీసుల పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు ఈ దేశంలో రాజ్యాంగం, చట్టం కన్నా గొప్పవాళ్ళా?" అని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు ప్రొఫెసర్ ముఖేష్. అయితే ఎబివిపి సభ్యుల భెదిరింపుల వల్ల ముఖేష్ కుమార్ ఈ పోస్టులను తొలగించారు.

కాగా ప్రొఫెసర్ ముఖేష్ కుమార్ ఫేస్ బుక్ లో రాసిన రాతలకు ఆ యూనివర్సిటీ పెద్దలకు కోపం కట్టలు తెంచుకుంది. ఆయనను ఉద్యోగం లోంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఏప్రిల్ 16 న యూనివర్సిటీ జారీ చేసిన లేఖలో, విశ్వవిద్యాలయం, ʹʹనోయిడా క్యాంపస్ లో ఉన్న విద్యార్థుల సంఖ్యతో పోల్చితే ప్రొఫెసర్లు ఎంత మందు ఉండాలన్నది అంచనా వేసిన తరువాత, అసోసియేట్ ప్రొఫెసర్ ముఖేష్ కుమార్ సేవలు ఇకపై అవసరం లేదని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కాబట్టి, ఏప్రిల్ 17, 2020 నుండి అతని సేవలు నిలిపివేయాలని నిర్ణయించాం. ʹʹ అని పేర్కొంది యూనివర్సిటీ యాజమాన్యం..

ఈ ఘటనపై ప్రొఫెసర్ ముఖేష్ కుమార్ ను ʹనేషనల్ హెరాల్డ్ ఆఫ్ ఇండియాʹ సంప్రదించినప్పుడు, "ఈ విశ్వవిద్యాలయం RSS మరియు BJP యొక్క అడ్డా అని అందరికీ తెలిసిన విషయం. నేను చేరినప్పటి నుండి, వారు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు ఎందుకంటే నేను మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నాను. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి హిందుత్వ ఎజెండాను నేను వ్యతిరేకిస్తున్నాను. ʹʹ అన్నారు ముఖేష్.

" గొడ్డు మాంసం తినడం గురించి ది హిందూ వార్తా కథనాన్ని పంచుకున్నందుకు వారు 2019 డిసెంబర్ నుండి నన్ను టార్గెట్ చేసుకున్నారు. నన్ను తొలగించడానికి వారికి సరైన కారణం దొరకలేదు. ఎందుకంటే నేను ఈ వృత్తిలో దశాబ్దాలుగా ఉన్నాను మరియు నా బోధనా సామర్థ్యం గురించి నా విద్యార్థులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.ʹʹ అని కుమార్ తెలిపారు.

"నేను మోడీ, బిజెపి మరియు ఆర్ఎస్ఎస్ లను విమర్శించినందున నన్ను తొలగించారు" అని ఆయన ఆరోపించారు.
ఈ విషయంపై విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ దీపేంద్ర సింగ్ బాగెల్ మాత్లాడుతూ ప్రొఫెసర్ కుమార్‌పై మాకు ఫిర్యాదు అందింది. అతను ఇక్కడ గెస్ట్ ఫాకల్టీ మాత్రమే. అతని సేవలను విశ్వవిద్యాలయానికి అవసరం లేదు."

2019 డిసెంబర్లోఈ విశ్వవిద్యాలయం సీనియర్ జర్నలిస్ట్, దళిత హక్కుల‌ కార్యకర్త ప్రొఫెసర్ దిలీప్ మండల్ ను కూడా ఇలాగే తొలగించింది. అతను కూడా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను కూడా తీవ్రంగా వ్యతిరేకించావాడు.

Keywords : rss, journalism, professor, dismiss, university,
(2020-09-25 22:21:25)No. of visitors : 825

Suggested Posts


ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌

ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యపై మతోన్మాదులు సోషల్ మీడియాలో దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారు. పర్సనల్ మెసేజ్ లు పెట్టి బెదిరిస్తున్నారు. రేప్ చేస్తామని, హత్య చేస్తామని హిందుత్వవాదులు హూంకరిస్తున్నారు.

ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?

ఈ నెల 2న దళితులు నిర్వహించిన భారత్ బంద్ లో జరిగిన సంఘటనలపై కూడా చెడ్డీ గ్యాంగ్ ఫేక్ న్యూస్ ప్రచారం మొదలు పెట్టింది. ఓ పోలీసును దళితులు కొట్టి చంపారని చెబుతూ దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంపై విషం చిమ్ముతూ ప్రచారం మొదలుపెట్టారు.

మురికి వాడల్లో ఆహారం పంచుతున్న ముస్లిం యువకులపై దాడి...తీవ్ర గాయాలు

ప్రజలకు సహాయం అందించే స్వచ్ఛంద కార్యకర్తలకు ఎవరైనా అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నాటక‌ ముఖ్యమంత్రి బి. ఎస్. యడ్యూరప్ప ప్రకటించిన మర్నాడే బెంగళూరులోని మురికివాడల్లో ప్రజలకు ఆహార పదార్థాలు పంచిపెడుతున్న ముస్లిం యువకులపై దాడి జరిగింది.

ఆ న్యాయమూర్తిని హత్య చేసిందెవరు ?

మరణవార్త చెప్పిన ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యకర్తే మూడు రోజుల తర్వాత లోయా మొబైల్‌ ఫోన్‌ తెచ్చి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ ఫోన్‌లో డాటా అంతా చెరిపేయబడి ఉంది. ఆయనను బలవంతపెట్టి నాగపూర్‌కు తీసుకువెళ్లిన సహన్యాయమూర్తులు మృతదేహంతోనూ రాలేదు, అంత్యక్రియలకూ ...

తలలు నరకడానికి శిక్షణ ప్రారంభం !

యోగీ ఆధిత్యానాథ్ నాయకత్వంలో ఆయోధ్యలో రామ మందిరం నిర్నిస్తామని, దానికి ఎవరైనా అడ్డొస్తే తలలు నరికి వేస్తామని మూడు రోజుల కింద ప్రకటించిన ఆయన అందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. దూల్ పేటలో సాయుధ శిక్షణ ప్రారంభించాడు....

51 University VCs Attend RSS Workshop on Making Education More Indian

Over 721 academicians and experts including 51 Vice Chancellors of various central and state universities attended a two-day workshop organised by the RSS over the weekend hosted in the national capital....

సాదువుల హత్య కేసు:101 మంది అరెస్ట్‌... ఒక్క ముస్లిం కూడా లేడు

సాదువుల హత్య కేసులో ఇప్పటివరకు 101 మందిని అరెస్ట్ చేశామని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. వారంతా హిందువులేనని, అందులో ముస్లింలు ఒక్కరు కూడా లేరని రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్ముఖ్‌ బుధవారం తెలిపారు.

దేశానికి రానున్నవి చీకటిరోజులు

భారతదేశంలో హిందువులలోనూ ముస్లింలలోనూ అత్యధికులు మతతత్వానికి గురైనవాళ్లేనని నా అభిప్రాయం. నా చిన్నతనంలో నా హిందూ బంధువులూ మిత్రులూ చాల మంది ముస్లింల మీద విషం కక్కుతుండడం నేను చూశాను. కాకపోతే వాళ్లు అలా మాట్లాడుతున్నప్పుడు పక్కన ముస్లిం లేకుండా చూసే జాగ్రత్త తీసుకునేవారు. ఇవాళ ఒక ముస్లింను కొట్టి చంపేశారంటే చాలమంది హిందువులకు అది పట్టడమే లేదు. బహుశా కొందరు

జై శ్రీరాం అనలేదని అన్సారీని కొట్టి చంపినవాళ్ళే మరో వ్యక్తిని రైల్లో నుండి తోసేశారు.

దక్షిణ 24 పరగణా లోని కానింగ్ నుండి హుబ్లీకి రేల్లో వెళ్తున్న 26 ఏండ్ల హఫీజ్ మహ్మద్ షారూఖ్ హల్దర్ అనే యువకుడిపై ఓ మూక డాడి చేసి దారుణంగా కొట్టింది. హఫీజ్ ప్రయాణిస్తున్న రైలులో కొందరు జై శ్రీరాం నినాదాలిస్తూ ఇతన్ని చూసి వెక్కిరించడం ప్రారంభించారు. చివరకు శృతి మించి హఫీజ్ ను కూడా జై శ్రీరాం అనే నినాదాలివ్వాలని బలవంతం చేశారు.

సావర్కర్ పుట్టినరోజున స్కూలు పిల్లలకు కత్తులు పంచిన హిందూ మహాసభ‌ !

ʹరాజకీయాలను హిందూమయం చేయడం హిందువులను సాయుధలను చేయడం సావర్కర్ కల మొన్నటి ఎన్నికల్లో అద్భుత విజయం ద్వారా సావర్కర్ కల లోని మొదటి భాగాన్నిమోడీ పూర్తి చేశాడు. రేండోది మేము చేస్తున్నాంʹʹ

Search Engine

బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా 28న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
చెదరని విశ్వాసం... సడలని ఆచరణ... శ్రీకాకుళ పోరాట పంథాలో కా. చంద్రమ్మ
సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!
విచారణ లేకుండా మూడున్నరేళ్ళుగా జైలులో వున్న 120 మంది ఆదివాసీలు
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 25న దేశవ్యాప్త ఆందోళనలను జయప్రదం చేద్దాం -TDF
ప్రజలపై పారామిలిటరీ, డిఆర్‌జి బలగాల దౌర్జన్యాలు -మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ ప్రెస్ నోట్
భారతదేశ జైళ్ళలో 50 శాతం ‌దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే ఎందుకున్నట్టు ?
మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
more..


వాహనాలను