మహిళా జర్నలిస్టుపై UAPA కేసు - దేశవ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ‌


మహిళా జర్నలిస్టుపై UAPA కేసు - దేశవ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ‌

మహిళా

ఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై జమ్ము కాశ్మీర్ పోలీసులు UAPA కేసు నమోదు చేశారు. జమ్ము కాశ్మీర్ లో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా తన ఫేస్ బుక్ పోస్టులతో యువతను రెచ్చగొడుతోందని, దేశవ్యతిరేక పోస్టులను చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్‌గా అనేక జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు సేవలందిస్తున్న జెహ్రాను మొదట ఏప్రిల్ 18 న శ్రీనగర్‌లోని ఎయిర్‌కార్గోలోని సైబర్ పోలీస్ స్టేషన్‌కు పిలిచినట్లు కాశ్మీర్ ప్రెస్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. కాశ్మీర్ ప్రెస్ క్లబ్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జోక్యం చేసుకోవడంతో పోలీసులు సమన్లు విరమించుకున్నారు. అయితే పోలీసులు ఆమెపై కేసు మాత్రం నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జెహ్రాను మంగళవారం సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు రమ్మని కోరినట్లు కాశ్మీర్ ప్రెస్ క్లబ్ ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన దురదృష్టకరమన్న‌ కాశ్మీర్ జర్నలిస్టుల సంఘం "ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటంలో ఉన్నప్పుడు, కరోనాను ఎదుర్కోవడానికి అందరం కలిసి నిలబడవలసిన అవసరం వచ్చినప్పుడు, పోలీసులు జర్నలిస్టులపై కేసులు పెట్టడం, వేధించడం ప్రారంభించారు" అని జర్నలిస్టుల సంఘం తన ప్రకటనలో పేర్కొంది.

రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా, వాక్ స్వాతంత్య్రం అనే హక్కులు దేశంలోని మిగతా జర్నలిస్టులకున్నట్టు జమ్మూ కాశ్మీర్ లో జర్నలిస్టులకెందుకుండవు అని సంఘం ప్రశ్నించింది.

ఫోటో జర్నలిస్టు జహ్రాపై పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఇండియా (NWMI) తీవ్రంగా మండిపడింది. ఫోటోలు అబద్దాలు చెప్పవని ఆ నిజాలే ప్రభువానికి అసౌకర్యంగా ఉన్నాయని NWMI పేర్కొంది. జర్నలిస్టులపై పోలీసులు, భద్రతా దళాలు బెదిరింపులు, వేధింపులు ఆపాలని, జహ్రాపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తొలగించాలని సంస్థ డిమాండ్ చేసింది.

Keywords : jammu kashmir, woman, journalist, UAPA Case, police
(2020-08-14 08:20:07)No. of visitors : 515

Suggested Posts


కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం

తంలో ఇలాంటి ర్యాలీ నిర్వహించినందుకు జమ్ము కాశ్మీర్ కు చెందిన బీజేపీ మంత్రి లాల్ సింగ్ ను మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం గత నెలలో మంత్రి పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు అతని తమ్ముడు రాజేందర్ సింగ్ అద్వర్యంలో మళ్ళీ ర్యాలీ నిర్వహించారు.

మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా

యాసీన్ మాలిక్ కశ్మీరీ ప్రతిఘటనా పోరాట నాయకుడు. 1966లో శ్రీనగర్ లోని డౌన్ సిటీలో పుట్టిన యాసీన్ మాలిక్ కశ్మీర్ అత్యంత సంక్షోభ కాలంలో పెరిగాడు అక్కడ. ఆ కాలంలో పుట్టి పెరిగిన పిల్లల జీవన ప్రయాణాన్ని నిర్దేశించినది తల్లిదండ్రులు కాదు. ఆ ప్రాంత అల్లకల్లోల రాజకీయ పరిస్థితులు. వాళ్లను ఉగ్రవాదులు అన్నా, ఫండమంటలిష్టులు అన్నా- ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరు ఎలా

Search Engine

రాముడిని విమర్షించాడనే కారణంతో కత్తి మహేష్ అరెస్ట్
ఢిల్లీలో జరిగిన దాడుల కుట్రలను బైటపెట్టిన కారవాన్ పత్రిక....ఆ పత్రిక జర్నలిస్టులపై దాడి, లైంగిక వేధింపులు
ఏడు వందల ఇరవై గంటల ఆందోళన...కనుచూపు మేరలో లేని ఉపశమన ఆశారేఖ
మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
more..


మహిళా