600 మంది ఖైదీలకు కరోనా... ఖైదీల తిరుగుబాటు ...పోలీసు కాల్పుల్లో 9 మంది మృతి !


600 మంది ఖైదీలకు కరోనా... ఖైదీల తిరుగుబాటు ...పోలీసు కాల్పుల్లో 9 మంది మృతి !

600

పెరూదేశం లీమా పట్టణం లోని మైగుల్ క్యాస్ట్రో-క్యాస్ట్రో జైలులో 600 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకడం, ఇద్దరు కరోనాతో చనిపోవడంతో జైలు లోని ఖైదీలంతా తమను విడుదల చేయాలంటూ తిరుగుబాటు చేశారు. వీరిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది చనిపోగా వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

కాస్ట్రో కాస్ట్రో జైలు సామర్థ్యం 1,140 మంది ఉండటానికే సరిపోతుంది అయితే ప్రస్థుతం ఆ జైల్లో 5,500 మంది ఖైదీలు ఉన్నారు, అసలే కరోనా వైరస్ తో ప్రపంచం వణుకుతున్న కాలంలో ఇక్కడ కనీసం భౌతిక దూరం పాటించడం కూడా సాధ్యంకాదు. జైలు అధికారులు కూడా ఖైదీలపట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఖైదీల బందువులు ఆరోపిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనాతో ఇద్దరు మరణించడం 600 మందికి కరోనా సోకడంతో ఖైదీల్లో తీవ్రంగా ఆందోళనమొదలైంది.

తమను విడుదల చేయాలని, రద్దీని తగ్గించాలని, కరోనా సోకకుండా చర్యలు చేపట్టాలని కొద్ది రోజులుగా వాళ్ళు అధికారులకు విన్నవించుకుంటూనే ఉన్నారు. శనివారం(ఏప్రెల్ 25) నాడు దాదాపు రెండు వందల మంది ఖైదీలు నిరసన ప్రదర్శన కూడా చేశారు. దయచేసి మమ్ములను కరోనాతో చంపకండి...మమ్మల్ని కాపాడండి అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఆ రోజు జైలు వార్దేన్ వీళ్ళకు నచ్చజెప్పి, ఖైదీలతో కొన్ని ఒప్పందాలు చేసుకొని నిరసన విరమింపజేశాడు.

అయితే ఆదివారంనాడి కరోనా సోకిన ఇద్దరు ఖైదీలు మరణించడంతో మిగతా ఖైదీలంతా భయాందోళనలకు గురయ్యారు. దా‍ంతో సోమవారం ఉదయం నుండే నిరసనలు తెలపడం మొదలుపెట్టారు. నినాదాలు చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం చేశారు. వారి నిరసనలు ఆపడానికి జైలు సిబ్బంది బలప్రయోగాన్ని ఉపయోగించడంతో రెచ్చిపోయిన ఖైదీలు తిరుగుబాటు చేశారు. జైలు సిబ్బందిని ప్రతిఘటించారు. పలు వస్తువులను తగలబెట్టారు. దాంతో బైటి నుండి భారీగా పోలీసులను రప్పించిన ప్రభుత్వం ఖైదీలపై కాల్పులకు ఆదేశించింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది ఖైదీలు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.

అదే సమయంలో జైలు బయట ఖైదీల బందువులు వందలాదిగా గుమికూడారు. తమ వాళ్ళను విడుదల చేయాలంటూ నినదించారు.

Keywords : peru, prison riot, coronavirus fears, nine dead, Castro Castro prison, Lima
(2020-10-30 06:41:39)



No. of visitors : 724

Suggested Posts


20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores It

In one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored....

సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతి

సౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు....

ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్

తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు.....

ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹ

ʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ

After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief

His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres....

చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ

అమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది.

అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావు

మహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు.....

అమెరికాను ఇలా బూడిద చేస్తాం - వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేఅమెరికాకు ఇప్పుడు ఉఅత్తర కొరియా సవాల్ విసురుతోంది. అమెరికా అంటేనే మండిపడే ఉత్తర కొరియా...

What happens when youʹre about to die? Chemists explain exactly how death feels

The American Chemical Society has explained exactly what goes on in your brain when (for instance) somebody plunges a woodmanʹs axe into your torso.....

నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !

వాడో నరహంతకుడు వేలాది మందిని హత్యలు చేయించినవాడు ముగ్గురిని నేను కాల్చి చంపాను అని బహిరంగంగానే ప్రకటించినవాడు. తల్చుకుంటే నా అంత గూండా మరొకడు ఉండడు అని బహిరంగ వేదికల‌ మీదే చెప్పినవాడు. ఉగ్రవాదులకన్నా నేను పరమ దుర్మార్గుణ్ణి....

Search Engine

ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో
సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం
ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన
సాయుధ గాన గంగాధరుడే ప్రభాకరుడు - వరవరరావు
డాక్టర్ సాయిబాబా డిమాండ్లకు అధికారుల అంగీకారం...నిరహార దీక్ష నిర్ణయం విరమణ‌
NAGPUR CENTRAL JAIL AUTHORITIES ACCEPT DR. G. N. SAIBABA DEMANDS
ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్
ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌
more..


600