కోవిడ్ 19 సామాజిక మూలాలు కూడా వైరస్ అంత ముఖ్యమైనవే -కె. మురళి (అజిత్)


కోవిడ్ 19 సామాజిక మూలాలు కూడా వైరస్ అంత ముఖ్యమైనవే -కె. మురళి (అజిత్)

కోవిడ్

మెరుగైన చికిత్సా సౌకర్యాలు వున్నప్పటికీ అభివృధ్ధి చెందిన దేశాలలో కోవిడ్ 19 వల్ల చనిపోయిన వారి సంఖ్య అధికంగా వుంది. ఎన్నో కారణాలున్నప్పటికి ప్రధాన అపరాధి ప్రజా ఆరోగ్య వ్యవస్థను కుదించివేసిన నయా ఉదారవాద విధానాలు. అమెరికా, ఇటలీలలో సకాలంలో చికిత్స అందకపోవడమనేది మరణాలకు గల ప్రధాన కారణాల్లో ఒకటి. చాలమందికి అసలు చికిత్స జరగనేలేదు. అమెరికాలో ఆరోగ్య భీమా లేని విస్తృత మెజారిటీగా వున్న పేద ప్రజలకు (ఆఫ్రికన్- అమెరికన్‌లలో అత్యధికులు, స్పానిష్ భాష మాట్లాడే హిస్పానిక్‌లు) కనీస ప్రాధమిక చికిత్స కూడా అందదు.

మెరుగైన చికిత్స సదుపాయాలు ఉంటాయని భావించే అభివృద్ధి చెందిన దేశాలలో కోవిడ్ మరణాలు అత్యధికంగా ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ, ప్రధాన అపరాధి ప్రభుత్వ సేవా రంగాలను తగ్గించిన నయా ఉదారవాద విధానాలు. అనే ప్రధాన కారణం అమెరికా, ఇటలీలలో మరణాలకు ప్రధాన కారణం సకాలంలో చికిత్స అందకపోవడం.
నిరుద్యోగ మధ్య తరగతి ప్రజల పరిస్థితి కూడా అలాగే వుంది. అందువల్ల జబ్బు పడగానే వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వుండరు. వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చేటప్పటికి వ్యాధి అదుపు తప్పి వుంటుంది. ఆసుపత్రుల్లో తగినన్ని పరికరాలు, సిబ్బంది లేకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ట్రంప్, యితర సామ్రాజ్యవాద పాలకుల స్వార్థపూరిత బాధ్యతా రాహిత్యం పరాకాష్టకెళ్ళింది. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోడానికి బదులు తమ రోజువారీ లాభార్జిత ఆర్ధిక వ్యవహారాలను కొనసాగించదానికే ప్రాధాన్యతనిచ్చారు. అక్కడ మరణాలు మరింతగా పెరిగిపోవడానికి ఇది కూడా దోహదం చేసింది. కేవలం రెండు శాతం మరణాల రేటు మాత్రమే ఉన్న ఒక వ్యాధి వల్ల ఇంత పెద్ద నష్టం జరిగింది. ఇది నయా ఉదారవాదమూ, అంతకు ముందు వున్న పెట్టుబడిదారీ విధానపు అసమర్థత, ప్రజావ్యతిరేక లక్షణాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది.

ఈ నేరస్థుల పాత్ర అక్కడితో ఆగదు. అటువంటి వ్యాధిరావడం యాదృచ్ఛికమని దానిని ఎవరూ ఆపలేరు అని వాదించేవారు ఉన్నారు. వ్యాధి నిరోధక చర్యలలో జరిగిన లోపాలను గుర్తించడం తప్ప మరేమీ చేయలేమని కొంతమంది భావిస్తారు. ప్రకృతి విధించిన శిక్ష అని కొందరంటే కాదనేవారు మరికొంతమంది. ఖచ్చితంగా ప్రకృతి మనలను శిక్షించే ఒక విధమైన అతీంద్రియ శక్తిగా రాలేదు. భవిష్యత్తులో అలా రాదు కూడా. అయినప్పటికీ, ఎంగెల్స్ చెప్పేదాన్ని బట్టి చూస్తే అలాంటిది ఏదో ఖచ్చితంగా జరిగింది.
ʹప్రకృతిపై తాను విజయం సాధించానని మనిషి ఎన్ని ప్రగల్భాలు పలికినప్పటికీ, ప్రకృతి కొట్టే ఒక పెద్ద దెబ్బతో వాస్తవంలో నిజమైన యజమాని ఎవరు అన్నే విషయాన్ని అంతిమంగా తెలుసుకుంటాడుʹ అని ఎంగెల్స్ రాశాడు. ఇది మానవ చర్యల పరిణామం అని అతని అభిప్రాయం. పెట్టుబడిదారీ వాదనల్లో వున్న బోలుతనాన్ని బహిర్గతం చేసిన ఈ పదాలు దాని విధ్వంసక అభివృద్ధి విధానంలోని ప్రమాదాన్ని కూడా సూచించాయి.

నేటి కరోనా గత్తర మూలాలు, వ్యాప్తిలో ఇది బాగా కనిపిస్తుంది. కొందరు ఈ విషయాన్ని జన్యుపరమైన కారణాలకు మాత్రమే కుదించివేసి, ప్రపంచాన్ని బంధించి వుంచే సామ్రాజ్యవాద సంబంధాలు సృష్టించిన పాత్రను దాచిపెడతారు. రాబోయే మంత్లీ రివ్యూ మే సంచిక ప్రధాన కథనంలో ఆ పాత్ర శాస్త్రీయ విశ్లేషణ జరిగింది (రాబ్ వాలెస్, అలెక్స్ లీబ్మాన్, లూయిస్ ఫెర్నాండో షా, రోడెరిక్ వాలెస్‌లు కలిసి ఆ వ్యాసం రాశారు).

వారు కూడా తమ వ్యాసాన్ని వుహాన్‌లోని వన్యప్రాణి మాంసంమార్కెట్ నుండి ప్రారంభించారు. కానీ సామ్రాజ్యవాద ప్రపంచ ప్రాచ్య దృష్టిలో వింతగా కనిపించే చైనీయుల ఆహారపు అలవాట్లలో చిక్కుకుపోకుండా, వారి వ్యాసం ఈ మార్కెట్ ద్వారా వెల్లడైన సామాజిక, ఆర్థిక సంబంధాలలోకి ప్రవేశిస్తుంది. " సాంప్రదాయ పశువులతో పాటు యితర దేశాల ఆహార పదార్థాలను కూడాఅమ్మగల స్థితికి వుహాన్లోని అతిపెద్ద మార్కెట్ ఎలా చేరుకోగలిగింది?" – అనే ప్రశ్నతో వ్యాసం ప్రారంభమవుతుంది.

ʹమత్స్య సంపదకు మించిన స్థాయిలో వన్యప్రాణుల ఆహార పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా మరింత లాంఛనప్రాయంగా మారుతోంది. అందులో పారిశ్రామిక ఉత్పత్తికి మద్దతు ఇచ్చే వనరులే మరింతగా పెట్టుబడి పెడుతున్నాయి."వుహాన్ మార్కెట్ నుండి అంతర్గత ప్రాంతాలవరకు విస్తరించి వున్న ఒక లింక్ ద్వారా విదేశీ, స్థానిక సాంప్రదాయ ఆహార పదార్థాలు ఒప్పందాల ద్వారా అడవి అంచుల కేంద్రాల వరకు కార్యకలాపాలు నడుపుతాయి. ఆ తరువాత అనేక వాణిజ్య/రవాణా లింకులు అటువంటి కేంద్రాలను వివిధ దేశాలకు, పెద్ద నగరాలకు అనుసంధానిస్తాయి. కరోనా వైరస్ కూడా అంతకు ముందు వచ్చిన SARS (Severe Acute Respiratory syndrome) లాగానే ప్రయాణం చేసింది.
జాన్సన్ & జాన్సన్ వంటి కొన్ని బహుళజాతి సంస్థలు మూడవ ప్రపంచ దేశాలకు సాధ్యాసాధ్య పటాన్ని వివరించాయి, భవిష్యత్తులో కొత్త సూక్ష్మజీవి కణాలు కనిపించే ప్రాంతాలను గుర్తించాయి. మంత్లీ రెవ్యూ వ్యాసం అటువంటి భూ-ఆధారిత మదింపుల విధానాన్ని విమర్శించింది. "వ్యాప్తి మండలాలపై దృష్టిని కేంద్రీకరించడం వల్ల అంటువ్యాధులకు రూపమిచ్చే ప్రపంచ ఆర్థిక పాత్రధారులు పంచుకున్న సంబంధాలను విస్మరిస్తుంది." ఈ సంబంధాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, మూడవ ప్రపంచ దేశాలు కాక, ప్రపంచ పెట్టుబడి ప్రధాన వనరులు - న్యూయార్క్, లండన్ మరియు హాంకాంగ్ –అత్యంత ప్రమాదకరమైన వనరులు. మానవులకు హానికరమైన ఈ కొత్త వైరస్‌లు వన్యజీవితం నుండి వ్యాపించాయి. అందులో చాలా భాగం ఈ నాడు పెట్టుబడిదారీ విధానం అంచుల్లో, అంటే మిగిలి వున్న అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది. అడవులను నరికివేయడం వల్ల వ్యాధిని వ్యాపింపచేసే వన్యప్రాణుల ఆవాసాలు నాశనం కావడంతో వైరస్ వ్యాప్తికి అనుకూలపరిస్థితులు ఏర్పడతాయి. అతి తక్కువ జనాభా వున్న అడవుల నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించిన కొత్త వ్యాధికారకాలు కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, సమయ-స్థలాలను ఆక్రమించిన ప్రపంచీకరణ ఆశ్రయాన్ని పొందాయి. ఈ వ్యాసం యొక్క సారాంశం ఏమిటంటే, "గతంలో, సహజ అటవీ ప్రతిచర్యల ద్వారా ఎక్కువగా నియంత్రించబడిన వన్యప్రాణుల వైరస్‌లు, పెట్టుబాడీ అటవీ నిర్మూలన చేయడం, ప్రజారోగ్య వ్యవస్థ, పర్యావరణం లోని పారిశుధ్య క్షీణతవల్ల ప్రధాన స్రవంతిలోకి ప్రవేశించాయి."
సంక్షిప్తంలో, ప్రపంచీకరణ, నయా ఉదారవాద విధానాల వల్ల అత్యధిక ప్రజల జీవనోపాధి, పర్యావరణ పరిస్థితులలో ఏర్పడిన మార్పులు ప్రస్తుత విషాదానికి మూల కారణం. దాని ప్రాథమిక పరిష్కారం సామ్రాజ్యవాద వ్యవస్థ వినాశనం, కమ్యూనిజం విజయం. అదే మానవ జీవితంలో భాగమైన మానవత్వానికి విలువనిచ్చే, ప్రకృతిని పునర్జీవింపచేసే ఏకైక మార్గం.
వాస్తవానికి, క్యూబా, వియత్నాంలు అది సాధ్యమని సూచిస్తున్నాయి. అవి నేడు సోషలిస్టు దేశాలు కావు. పెట్టుబడిదారీ విధాన పునరుద్ధరణ వల్ల ఏదో ఒక రకంగా తిరిగి సామ్రాజ్యవాద సంబంధాలతో ముడిపడివున్న దేశాలు. చైనా తన వేతనాలను పెంచినప్పుడు, ప్రపంచ గుత్తాధిపత్యాలు వియత్నాంకు మారాయి. అయినప్పటికీ, సోషలిస్ట్ శకం అవశేషాలు కొన్ని ఇప్పటికీ నిలబడి వున్నాయి.

ఆరోగ్య రంగం ఇప్పటికీ ఎక్కువగా ప్రభుత్వ రంగంలోనే వుండడమూ, స్వచ్ఛంద సేవను పెద్ద ఎత్తున అందించగల సంస్థలు ఉండడంలాంటి కారణాలు వల్ల గత్తరపై పోరాడడానికి సహాయకారకమయ్యాయి. సామ్రాజ్యవాద దేశంగా మారిన చైనా విషయంలో పాత సోషలిస్టు శకం ప్రయోజనాలను చూడవచ్చు. ప్రజా పోరాటాల ప్రతిఘటనతో ప్రజారోగ్య రంగాన్ని రక్షించగలిగిన కేరళ, ఇతర రాష్ట్రాలకంటే కరోనాను మెరుగైన రీతిలో ఎదుర్కోగలిగింది. ఇలా వుండగా, జలుబు లేదా జ్వరంతో వచ్చే వారిని పెద్ద ప్రైవేటు రంగ ఆసుపత్రులు అమానుషంగా వెళ్ళగొడుతున్నాయి.

ఇలా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. కరోనా కలిగించిన ప్రభావం నుంచి ప్రభుత్వ రంగం తిరిగి పుంజుకోవడం ఖాయం. అయితే పెట్టుబడి చలనానికి లోబడి వుండడం అడ్డంకులను కలిగిస్తుంది. పెట్టుబడికి జ్ఞాపకశక్తి చాలా బలహీనంగా వుంటుంది. లాభార్జిత దృష్టితో ప్రభుత్వ రంగం మరోసారి ప్రైవేటీకరణకు లొంగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థ నిలబడగలిగినప్పటికీ, కొంతమందికి ప్రజారోగ్య రంగం నిరంతరాయంగా గొప్ప సమాచార వనరుగా మారే అవకాశం కూడా ఉంది. కేరళ సిపిఐ(ఎం)ప్రభుత్వం అమెరికా డేటా అనాలిటికల్ కంపెనితో చేసుకున్న స్ప్రింగ్లర్ ఒప్పందంలో దీన్ని చూడవచ్చు. ఈ ఒప్పందం వ్యక్తిగత గోప్యతను ఏమాత్రం ఖాతరు చేయకుండా విషయసేకరణ చేయడానికి అనుమతినిచ్చింది.

ప్రజారోగ్య సేవ పేరిట సేకరించిన సమాచారం మందుల కంపెనీలు, భీమా సంస్థలు మొదలైనవాటికి ముడిసరుకుగా పనికిరావచ్చు. ఇది నూతన, మరింత ప్రమాదకరమైన ప్రైవేటీకరణ స్థాయి. ప్రభుత్వ రంగ నిర్మాణాల వెనుక దాక్కుని పెట్టుబడి పరోక్షంగా పూర్తి లాభం పొందగలదు. మోడీ ప్రచారం చేస్తున్న హెల్త్ యాప్ కూడా అలాంటిదే.

ప్రభుత్వరంగం వుండగానే సరిపోదు. అది ప్రజలకు నిజంగా సేవ చేయగలిగినదై ఉండాలి. ఆర్థికవ్యవస్థలో, మౌలిక సదుపాయాలలో ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాల మధ్య విభజనను నిర్మూలించే సమాజం కోసం జరిగే పరివర్తనలో భాగమైనప్పుడు మాత్రమే అలాజరగడం సాధ్యమవుతుంది. ఇది ప్రపంచంలోని ఏ దేశంలోనైనా పునరుజ్జీవింపబడాలంటే, సోషలిజానికి నీడగా కాకుండా, కమ్యూనిజానికి పరివర్తనగా, నిరంతర విప్లవంగా, కమ్యూనిస్టు సిద్ధాంత ప్రబల వున్నత శిఖరాల ద్వారా మార్గనిర్దేశనం చేయబడేదిగా వుండాలి.
- కె. మురళి (అజిత్)
(తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)

Keywords : covid19, corona, ajit, murali, usa, china, india
(2020-05-31 00:49:45)No. of visitors : 202

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

అత్యవసర డ్యూటీ నుండి వస్తున్న డాక్టర్లపై పోలీసుల లాఠీ చార్జ్... చేయి విరిగిన డాక్టర్

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని ఎయిమ్స్ డాక్టర్లు ఇద్దరిని పోలీసులు దారుణంగా కొట్టారు. రీతూ, యువరాజ్ అనే డాక్టర్లు బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో అత్యవసర విధులను ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు దాడి చేశారు.

Search Engine

వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
more..


కోవిడ్