ʹరాగోʹ @ సృజనక్కను చంపేశారు ‌


ʹరాగోʹ @ సృజనక్కను చంపేశారు ‌

ʹరాగోʹ

సాధన రాసిన ʹరాగోʹ నవల తెలుగు సమాజంలో విప్లవాభిమానులు చదవని వారుండరు. రాగో పాత్రను ప్రేమించనివారుండరు. బలవంతపు పెళ్ళి నిర్బంధాల నుంచి విపరీతంగా పెనుగులాడి బయటపడి దళంతో కలుస్తుంది ʹరాగోʹ. తను అనుభవించిన క్షోభ,స్వేచ్ఛకోసం పడే ఆరాటం, మాడియా స్తీలందరిలోనూ చూస్తుంది రాగో. పంజరం లాంటి జీవితం నుంచి ఏ కట్టుబాట్లు లేని అరణ్యంలోకి, అక్కడి నుంచి ఆశయ పథంలోకి పయనిస్తుంది రాగో. ఎలాగైనా గిరిజనుల్లో చైతన్యం తేవాలని అనుకుంటుంది రాగో . గిరిజనుల్లో కొంత మార్పు తెస్తుంది .అదేవిదంగా రాగో నేటి సామజంలో స్త్రీ పడుతున్న భాదల నుంచి స్త్రీని తక్కువ చూడటం వంటి వాటిని నిరసిస్తూ పోరాటం చేస్తుంది. స్త్రీ విముక్తికి సమాజ విముక్తే మార్గమని తెలుసుకుంటుంది రాగో. సమాజ విముక్తి పోరాటంలో ముందు భాగాన నిలబడుతుంది రాగో.

తెలుగు విప్లవ సమాజం పై ఎంతో ప్రభావం చూయించిన ఈ నవలకు, నవలలోని రాగో పాత్రకు స్పూర్తి కామ్రేడ్ సృజన ఎలియాస్ చిన్నక్క ఎలియాస్ చైతూ ఆర్కా. తన జీవితమే...తన పోరాటమే రాగో నవల. రాగోను పోలీసులు నిన్న చంపేశారు. హత్య చేసి ఎప్పటి లాగే మళ్ళీ ఎన్ కౌంటర్ కథలు అల్లారు పోలీసులు.
సృజన సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకురాలు.... ప్రజల నోట్లో నాలుక... దండకారణ్య రీజనల్ కమిటీ సభ్యురాలు.... శత్రువులపై చేసిన అనేక దాడులకు నాయకత్వం వహించిన వీర యోధురాలు.... చాలా కాలంగా ఆ యొధురాలిని టార్గెట్ చేసుకున్న పోలీసులు నిన్న ఏక పక్ష కాల్పుల్లో కాల్చి చంపారు.

పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం... మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏటాపల్లి తాలూకాలోని జారవండి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కిట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారం అందుకున్న సి 60 కమెండోలు కూంబింగ్ చేపట్టాయి. ఈ కూంబింగ్ చేస్తున్న కమెండోలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సృజన ఎలియాస్ చిన్నక్క చనిపోయిందని పోలీసులు ప్రకటించారు. ఆమె వద్ద ఏకే 47. క్లైమోర్మెన్, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఇలా పోలీసులు చెబుతున్న కథపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మావోయిస్టు పార్టీకి చెందిన రీజినల్ కమిటీ సభ్యురాలైన‌ సృజనక్కకు చెందిన‌ రక్షణ వలయం ఏమైపోయింది ? మావోయిస్టు పార్టీకి చెందిన ప్లాటూన్ సభ్యులు కూడా ఈమెకు రక్షణ కోసం ఉంటారని చెబుతున్నారు ఒక వేళ అదే నిజమైతే వాళ్ళేమయ్యారు? ఓ సమా వేశంలో పాల్గొనేందుకే చిన్నక్క గడ్చిరోలీ అటవీ ప్రాంతానికి వెళ్లినట్లైతే సమావేశానికి వచ్చిన మిగతా మావోయిస్టుల ఆచూకీ లేకపోవడం అంతుచిక్కకుండా పోయింది. పోలీసులు చెబుతున్న ఈ ఎన్ కౌంటర్ నిజానిజాలు తెలియాలంటే మావోయిస్టు పార్టీ ప్రకటన రావాల్సిందే.
మరో వైపు సృజనక్క అలియాస్ చిన్నక్క అలియాస్ చైతు ఆర్కా ఎన్‌కౌంటర్‌లో మరణించిన కొన్ని గంటల్లోనే తెలంగాణ లోని భూపాలపల్లి, ములుగు జిల్లాల అటవీ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారనే వార్తను దిశ పత్రిక ప్రచురించింది. దిశ కథనం ప్రకారం... మహాముత్తారం మండలం సింగారం, తాడ్వాయి, అటవీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ ప్రాంతంలో చత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన గుత్తికోయలు ఉండటంతో వారి ఆవాస ప్రాంతాల్లోనే పోలీసు బలగాలు సంచరించడం గమనార్హం. అయితే, మూడ్రోజుల కిందట మావోయిస్టు పార్టీకి చెందిన ఓ కీలక నేతతో సన్నిహితంగా ఉన్న యూజీ కేడర్ వ్యక్తి తెలంగాణ పోలీసులకు చిక్కినట్టు ప్రచారం జరుగుతోందని దిశ పత్రిక వెల్లడించింది.

Keywords : rago, srujana, chinnakka, maharashtra, dandakaranyam, cpi maoist party, police fake encounter
(2020-05-31 19:03:58)No. of visitors : 822

Suggested Posts


కామ్రేడ్ సృజన అమరత్వంపై మావోయిస్టు పార్టీ ప్రకటన...20న గడ్చిరోలి జిల్లా బంద్ కు పిలుపు

మే 2 నాడు గడ్చిరోలి జిల్లా, ఏటపల్లి తాలూకా, జారవండి పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న సీన్‌భట్టి అటవీ ప్రాంతంలో నరహంతక పోలీసు కమాండోలు సి-60 చేసిన దాడిలో ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యురాలు సీనియర్ మహిళా ప్రజా నాయకురాలు కామ్రేడ్ సృజనక్క @జైనక్క తన అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసింది.

రాగో @ సృజన ఏం కోరుకుంది? -పి.వరలక్ష్మి

రాగో ఏం కోరుకుంది? ఏ లక్ష్యం కోసం పోరాడింది? ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఏ లక్ష్యం కోసం రాగోలను చంపుతున్నది? పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదివాసులు నలిగిపోతున్నారు అని మాట్లాడే మేధావులకు మాత్రమే కాదు, రాగో ఏమవుతుంది అని సందేహించిన వాళ్లకు కూడా సమాధానం అయింది రాగో. రాగో మార్గం అలా ఉంచి రాగో మాటలైనా వినే సంసిద్ధత నాగరిక సమాజానికుందా?

Search Engine

వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
more..


ʹరాగోʹ