తక్కువ నాణ్యత గల పిపిఇ కిట్లపై కథనం ప్రసారం చేసినందుకు జర్నలిస్టుపై పోలీసుల‌ వేదింపులు


తక్కువ నాణ్యత గల పిపిఇ కిట్లపై కథనం ప్రసారం చేసినందుకు జర్నలిస్టుపై పోలీసుల‌ వేదింపులు

తక్కువ


ఉత్తర ప్రదేశ్ లోని ఆసుపత్రులు, కళాశాలలకు సరఫరాచేసిన తక్కువ నాణ్యత గల వ్యక్తిగత రక్షణ పరికరాల వస్తు సామగ్రిపై ఉన్నతాధికారులు తమలో తాము రాసుకున్న లేఖను బహిర్గత పర్చినందుకు ఓ జర్నలిస్టును వేదింపులకు గురి చేసింది ప్రభుత్వం.

ఉత్తర ప్రదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏప్రిల్ 13 న రాష్ట్ర వైద్య విద్య విభాగంలో ఉన్నతాధికారులకు పంపిన లేఖను ఏప్రిల్ 17 న, లక్నోకు చెందిన హిందీ న్యూస్ ఛానల్ న్యూస్ 1 ఇండియాకు చెందిన జర్నలిస్ట్ మనీష్ పాండే తన ఛానల్ లో బహిర్గతం చేశారు. నాణ్యత కరువైన వ్యక్తిగత రక్షణ పరికరాల వస్తు సామగ్రిపై కథనాన్ని ప్రసారం చేశారు. రాష్ట్రంలోని ఎనిమిది ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలకు సరఫరా చేసిన పిపిఇ కిట్లు అవసరమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని లేఖలో పేర్కొన్నారు. కిట్ల గౌన్ల పొడవు ప్రమాణాలకు సరిపోలేదని లేఖలో ప్రత్యేకంగా పేర్కొంది. కోవిడ్ -19 సంక్షోభం మధ్యలో ఇటువంటి నాసిరకం పరికరాల సరఫరా చేసిన‌ బ్యూరోక్రాట్ల గురించి పాండే కథనం ప్రశ్నించింది.

కథ ప్రసారం అయిన 13 రోజుల తరువాత ఏప్రిల్ 30 న అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ విశాల్ విక్రమ్ సింగ్ లక్నోలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి రావాలని జర్నలిస్టు పాండేని కోరారు. మే1 న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పాండేని దాదాపు గంటసేపు విశాల్ విక్రమ్ సింగ్ విచారించాడు. పాండేకు లేఖను లీక్ చేసింది ఎవరు అన్నదాని గురించి సింగ్ పదే పదే ఆరా తీశాడు.

ఒక దశాబ్దానికి పైగా జర్నలిస్టుగా ఉన్న పాండే ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. ASP సింగ్ జర్నలిస్టు పాండే నేపథ్యం గురించి ఆరా తీశాడు. లేఖను ఎవరు లీక్ చేశారో తెలుసుకోవడానికి అతను STF కు కూడా అనధికారికంగా సహకరించాలని చెప్పాడు.

"ఇటువంటి విచారణలు అధికారికంగా జరగాలి STF నాతో తప్పుగా ప్రవర్తించలేదు, కాని వారు టీ కోసం పిలిచి నా మూలాలు మరియు పరిచయాల గురించి నన్ను ప్రశ్నించడం ఏంటి? ఈ కథనం విషయంపై మాట్లాడాలంటే వారు ముందుగా నోటీసు ఇచ్చి ఉండాలి. ʹʹ అన్నారు జర్నలిస్టు పాండే

ʹʹఈ కథనం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది దీనిని సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి, ఈ విషయంలో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారుʹʹ పోలీసులు తనను ఎందుకు ఇంటరాగేషన్ చేశారన్న ప్రశ్నకు పాండే ఇచ్చిన జవాబిది.

న్యూస్ 1 ఇండియా ప్రసారం చేసిన తక్కువ నాణ్యత గల పిపిఇ కిట్ల సరఫరాకు కారణమైన అధికారులెవరు అనేదానికన్నా ఆ లేఖను లోక్ చేసిందెవరు అనేదానిపైనే యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపించుందని ఛానల్ సంపాదకీయ బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

మరో వైపు ఎఎస్‌పి సింగ్ మాత్రం జర్నలిస్టు పాండేను విచారించినట్టు ఒప్పుకోలేదు. తాని పాండేను టీకి మాత్రమే పిలిచానన్నారాయన. లేఖ లీక్ చేసిందెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆ విషయం చాలా మంది జర్నలిస్టులతో మాట్లాడుతున్నామని అది విచారణ కాదని ఎఎస్‌పి సింగ్ అన్నారు.

2017 నుండి, యోగి ఆదిత్యనాథ్ గా ప్రసిద్ది చెందిన ముఖ్యమంత్రి అజయ్ బిష్ట్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కాలంలో పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయుల భద్రత గణనీయంగా పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు రాసినందుకు ప్రసారం చేసినందుకు జర్నలిస్టులపై కేసులు నమోదు, అరెస్టులు, దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి..

Keywords : uttarapradesh, PPE Kits, police, journalist, interrogated,low quality PPEs
(2020-05-31 07:30:44)No. of visitors : 179

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

Search Engine

వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
more..


తక్కువ