కడుపు మండి సూరత్ లో మళ్ళీ రోడ్డెక్కిన వలస కూలీలు... లాఠీలు, టియర్ గ్యాస్ తో విరుచుకపడ్డ పోలీసులు


కడుపు మండి సూరత్ లో మళ్ళీ రోడ్డెక్కిన వలస కూలీలు... లాఠీలు, టియర్ గ్యాస్ తో విరుచుకపడ్డ పోలీసులు

గుజరాత్ లోని సూరత్ లో సోమవారం మధ్యాహ్నం పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ సంఘటన సూరత్ శివార్లలోని వారెలి సమీపంలో జరిగింది. వలస‌ కార్మికులు తమ స్వస్థలానికి తిరిగి పంపమని డిమాండ్ చేయడంతో గొడవ చెలరేగింది.

కార్మికులు పోలీసులపై రాళ్ళు రువ్వారని, ఆ తరువాత ఘర్షణ మరింత హింసాత్మకంగా మారిందని పోలీసులు ఆరోపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సూరత్ పోలీసులు 10 టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. అనంతరం 70 మంది వలస కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో సూరత్-కడోదర రహదారిపై అనేక వాహనాలు దెబ్బతిన్నాయి.

నిరసన వ్యక్తం చేస్తున్న చాలా మంది వలసకార్మికులు బీహార్ , ఉత్తర ప్రదేశ్, ఒడిశాల‌ నుండి వచ్చారు. అందులో చాలా మందికి తినడానికి తిండి లేదు. సూరత్ లో ఉండడానికి ఇల్లు లేదు. తిరిగి ఇంటికి వెళ్ళడానికి టిక్కెట్లు కొనడానికి తమ వద్ద డబ్బు కూడా లేదని వాళ్ళు బోరుమంటున్నారు.

ʹʹసంవత్సరం వయసున్న నా కూతురుకు పాలు కొనడానికి నా దగ్గర‌ డబ్బు లేదు. నాతో ఇంతకాలంగా పని చేయించుకుంటున్న నా యజమాని నాకు ఇవ్వాల్సిన జీతం కూడా ఇవ్వలేదుʹʹ ఒక వస్త్ర పరిశ్రమలో పని చేసే ఆసిస్ అనే వలస కార్మికుడు చెప్పాడు. మరో వలసకార్మికుడైన శివ లాల్ మాట్లాడుతూ, "నాకు ఇప్పుడు ఇల్లు లేదు. అద్దె ఇవ్వలేదని నేను ఉంటున్న అద్దె ఇంట్లోంచి నన్ను తరిమేశారు. ఆ తరువాత నేను మరో 10 మందితో కలిసి ఓ ఇరుకైన గదిలో నివసిస్తున్నాను. నేను మా స్వంతూరుకు వెళ్లాలనుకుంటున్నాను. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదుʹʹ అన్నాడు.

సూరత్ లోని పలాన్‌పూర్ జకాత్ నాకా వద్ద కూడా యూపీ నుంచి వలస వచ్చిన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. వారు డబ్బు చెల్లించి ఓ బస్సు మాట్లాడుకొని నిన్న సాయంత్రం యూపీకి బయలుదేరారు. వారిని సూరత్ నుండి బయలుదేరడానికి అధికారులు అనుమతించారు కానీ గుజరాత్ మధ్యప్రదేస్ సరిహద్దుల వద్ద వారిని ఆపేసి వెనక్కి పంపారు. వీరంతా తిరిగి సూరత్ కు వచ్చి నిరసనలు ప్రారంభించారు.

ఈ పరిస్థితి ఒక్క సూరత్లోనే కాదు దేశ‌వ్యాప్తంగా వలస కార్మికులు ఆకలితో అల్లాడుతున్నారు. ఉండడానికి ఇంత నీడలేక అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు వీళ్ళతో బాధ్యరాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి. వీళ్ళతో ఆడుకుంటున్నాయి. ఒకరు పోవచ్చని అనుమతి ఇస్తారు, మరొకరు పోకూడదని ఆపేస్తారు. పోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిన్న ప్రకటించినవారే ఇవ్వాళ్ళ పోవడానికి వీల్లేదని తేల్చిపడేస్తారు. కడుపు మండిన ఆ కార్మికులు తిరగబడితే లాఠీలతో, తూటాలతో జవాబు ఇస్తారు. తమ‌ నెత్తురు చెమటగా మార్చి ఉన్నోడికి ఆకాశహార్మ్యాలు నిర్మించిన కార్మికుడికి ఈ దేశంలో ఉండడానికి ఇంత చోటు లేకపోవడం... ఆ కార్మికుడి ఆకలి కడుపుకు ఇంత ముద్ద లేకపోవడం.... ఎంత విషాదం

Keywords : gujarat, surat, migrant workers, police, lathicharge
(2020-08-04 23:27:20)No. of visitors : 369

Suggested Posts


గాయపడ్డ తండ్రిని ఎక్కించుకొని1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన13 ఏళ్ళ చిన్నారి

లాక్ డౌన్ వలస కార్మికులను ఎన్నో కష్టాల పాలుచేస్తోంది. వాళ్ళు ఎన్ని రిస్క్ లైనా భరించి స్వంత ఇంటికి చేరుకోవాలని భావిస్తున్నారు. ఒకే ట్రక్కులో వందల మంది కిక్కిరిసి వెళ్తున్నారు. వేల కిలోమీటర్లు నడుస్తున్నారు.

రైలు టిక్కట్ల పేరుతో వలస కార్మికులను దోచుకున్న బీజెపి నేత....ప్రశ్నించినందుకు కార్మికుడిపై దాడి

అసలే లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికులను ఓ బీజేపీ నాయకుడు నిలువుదోపిడీ చేశాడు. పైగా ఈ విషయంపై ప్రశ్నించినందుకు ఓ కార్మికుడిని రక్తం కారేట్టు తీవ్రంగా కొట్టాడు.

సైకిల్ పై స్వంతూరుకు బయలు దేరిన వలస కార్మికులు... భార్యాభర్త మరణం,అనాధ‌లైన చిన్నారులు

చత్తీస్ గడ్ కు చెందిన కృష్ణ‌, అత‌ని భార్య ప్ర‌మీల ఉపాధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ లోని ల‌క్నో‌కు వ‌ల‌స వచ్చి అక్కడి జాన్కీపుర మురికివాడ‌లో నివ‌సిస్తున్నారు. వీరికి నాలుగేండ్ల కూతురు చాందినితోపాటు మూడేండ్ల కొడుకు నిఖిల్ ఉన్నారు.

హైదరాబాద్ శివార్లలో.. ఆకలితో..ఆగ్రహంతో...తిరగబడ్డ వలసకార్మికులు ...రెండు నెలలుగా జీతాలివ్వని కంపెనీ

హైదరాబాద్ నగర శివార్లలో...సంగా రెడ్డి జిల్లా కంది వద్ద కడుతున్న ఐఐటీ భవన నిర్మాణాల కోసం వచ్చిన కార్మికులు ఇవ్వాళ్ళ ఆకలితో, అసహనంతో తిరగబడ్డారు. పనులు చేయించుకొని జీతాలు ఇవ్వని కంపనీ ఒకవైపు ఊరికి వెళ్ళలేని లాక్ డౌన్ మరో వైపు వాళ్ళను నిలవనివ్వలేదు. దాదాపు 2 వేల మంది కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేశారు.

లాక్ డౌన్: వలస కార్మికుల ఆకలి కేకలు - స్మశానంలో పడేసిన కుళ్ళిన అరటిపళ్ళు తింటూ....

లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీ నగరంలోని వేలాది మంది వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళకు ఉండడానికి షెల్టర్‌ లేక అల్లాడి పోతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా యమునా నది ఒడ్డున ఫ్లై ఓవర్ ల కింద బతుకులీడుస్తున్నారు. ఆ నదీ తీరాన వందల మంది వలస కార్మికులు తిండీ తిప్పలు లేక పస్తులతో అలమటిస్తున్నారు.

వలస కూలీలు స్వంతూర్లకు పోవడానికి సహకరించిన వాళ్ళపై కేసులు...బిల్డర్ల కోసం కర్నాటక బీజేపీ ప్రభుత్వం దుర్మార్గం

వలస కార్మికులను తమ స్వంతూర్లకు వెళ్ళడానికి సహాయం చేస్తున్న సామాజిక కార్యకర్తలపట్ల బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా కోపంగా ఉన్నారు. ఆ వ్యాపారులకు మద్దతుగా ప్రభుత్వం రంగంలోకి దిగి కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోంది.

ఆకలితో రోడ్డెక్కిన వలస కార్మికులపై లాఠీచార్జ్....వేయి మందిపై కేసులు...కార్మిక నాయకుడి అరెస్ట్ !

వాళ్ళు దేశంలోని ఎక్కడేక్కడినుండో ము‍ంబై వచ్చి రోజూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కడుపు నింపుకునే వలస కార్మికులు.

బిల్డర్లతో మీటింగ్ తర్వాత వలస కార్మికుల రైళ్లను రద్దు చేసిన కర్నాటక సీఎం !

కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యెడియరప్ప రాష్ట్రంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లతో సమావేశమైన కొంత సేపటికే వలస కార్మికులను తమ సొంత పట్టణానికి తీసుకెళ్లే రైళ్లన్నింటినీ రద్దు చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో తిరగబడ్డ వలస కూలీలు... పోలీసులపై దాడి, పోలీసుల లాఠీచార్జ్

మే 4వ తేదీ నుండి వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను వారి వారి స్వంత గ్రామాలకు పంపిస్తామని ప్రకటించిన కేంద్రం యూటర్న్ తీసుకోవడం వలస కూలీల గుండెల్లో మరింత మంటను రాజేసింది.

సూరత్ లో మళ్ళీ తిరగబడ్డ వలస కార్మికులు...పోలీసుల లాఠీచార్జ్, అరెస్టులు

గుజరాత్ రాష్ట్రం సూరత్ లో వలస కార్మికులు మరో సారి తిరగబడ్డారు. కార్మికులు ఇలా తిరగబడి పోలీసులతో ఘర్షణ పడటం నెల రోజుల్లో దాదాపు ఇది ఆరోసారి. అనేక రాష్ట్రాల నుండి బతకడానికి సూరత్ వచ్చిన లక్షల మంది కార్మికులు లాక్ డౌన్ కారణంగా పనులు కోల్పోయారు.

Search Engine

పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
వీవీ విడుదల కోసం బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
వరవరరావు ఆరోగ్యం గురించి పారదర్శక, అధికారిక సమాచారం ఇవ్వండి...వీవీ కుటుంబం డిమాండ్
వరవరరావును విడుదల చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లో సాహితీవేత్తల ప్రదర్శన‌
గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డే‌కు ప్రతిష్టాత్మక అవార్డు
more..


కడుపు