విషం... విషాదం... పరిహారం.. పోరాటం -నరేష్కుమార్ సూఫీ


విషం... విషాదం... పరిహారం.. పోరాటం -నరేష్కుమార్ సూఫీ

విషం...

పొద్దున్నే.... అయ్యో..!
మధ్యాహ్నం.... ఎంత విషాదం..
సాయంత్రం.... కోటి రూపాయలట.. అబ్బా గ్రేట్ కదా..!

పాలనకు లొంగిపోతే..... మ్యానిఫూలేట్ చేయబడటం చాలా ఈజీ..
సహాయం తప్పని, అది ఇవ్వకూడదనీ అనటం లేదు. అలా అనటం అనైతికం కూడా. అయితే లాక్ డౌన్ ఉంది. కెమికల్స్ ఎక్కువరోజులు స్టార్ చేయాల్సి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై ఫ్యాక్టరీ యాజమాన్యం, పొల్యూషన్ బోర్డ్ ఏ జాగ్రత్తలు తీసుకున్నాయి.?
ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కొత్తగా ఉన్నదేమీ కాదు 1961 నుంచీ విశాఖపట్నం సిటీకి దూరంగా మొదలై రెండు చేతులు మారి 1997 లో LG అనే కొరియన్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. ఈ కంపెనీ పేరుమీద ఎకరాలకు ఎకరాలు సేకరించారు. ఇక చుట్టుపక్కల ఉన్న ఊళ్ళూ కాలనీలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. వేలమంది జనం అక్కడకి చేరుకొనటున్నప్పుడు. ఎవ్వరూ మాట్లాడలేదు. విచ్చలవిడిగా భూములు అమ్ముకొని, నిర్మాణాలు వస్తున్నా ఆలోచించలేదు.
భోపాల్ ఘటనలాగే అర్థరాత్రి గ్యాస్ లీకై జనాలమీదకు వచ్చింది. దీనిప్రభావం ఇప్పుడు ప్రత్యక్షంగా ఆపగలిగినా శరీరాల్లోకి చేరిన ఆ కెమికల్ గ్యాస్ దాని ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. యూనియన్ కార్బైడ్ గ్యాస్ ప్రభావం ఆ తర్వాత పుట్టిన పిల్లలమీదా ప్రభావం చూపిన విషయం మర్చిపోవద్దు. ఇప్పటికీ అవకారాలతో, విచిత్రమైన డీసీజేస్ తో పుడుతూనే ఉన్నారు. చర్మ వ్యాధులూ, క్యాన్సర్లూ, కంటి జబ్బులతో తల్లడిల్లుతూనే ఉన్నారు. అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కంపెనీ (UCC) నుంచి గ్యాస్ లీకై... రాత్రికి రాత్రి 3000 వేల మందికి పైగా చనిపోయారు. తెల్లారేసరికి భోపాల్ స్మశాన దిబ్బలా మారింది. లక్ష మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారు. అడ్డమైన రోగాలొచ్చాయి. అర్థ రాత్రి యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుండి మిథైల్‌ ఐసోసెనెట్‌ (ఎంఐసి) అనే రసాయనం లీక్‌ అయ్యింది. టన్నుల కొద్దీ వెలువడిన ఈ విషవాయువు కొన్ని గంటల్లోనే వేలాది మంది ప్రాణాలు తీసింది. ఎంఐసి గురించి ఎటువంటి సమాచారాన్ని కార్బైడ్‌ సంస్థ ప్రభుత్వానికి ఇవ్వకపోవ డంతో నివారణా చర్యలు తీసుకోవడం చాలా కష్టమైంది. ʹప్రొడక్షన్ సీక్రెట్ʹ అంటూ ఆ రసాయన వివరాలను వెల్లడించడానికి ఆ సంస్థ నిరాకరించింది. ప్రమాదం జరిగిన ఇన్నేళ్ల తరువాత కూడా ఆ సమాచారాన్ని ఇన్ని ప్రభుత్వాలు మారినా తెలుసుకోలేకపోయాం. ఇదీ మన వ్యవస్థ.
ఆ ప్రభావం వల్ల ఎంతో మందికి ఇప్పటికీ అనారోగ్యాలు వస్తూనే ఉన్నాయి. దీని ప్రధాన నిందితుడు, UCC యజమాని అండర్సన్ మాత్రం ఇండియన్ కోర్టుకు రాకుండానే 2014 వరకూ గడిపి అమెరికాలోనే చనిపోయాడు. బాధితులకు చెల్లించాల్సిన పరిహారాలు ఇప్పటికీ పూర్తిగా అందనే లేదు. డౌ కెమికల్స్ ఇంకా అదనపు పరిహారం చెల్లించకుండా ఉండేందుకు పోరాడుతూనే ఉంది. ఇన్ని ఏళ్లలో ఇలాంటి ఫ్యాక్టరీలకు అనుమతులు వచ్చాయి కానీ ఈ విషయంలో తీసుకోవాల్సిన పటిష్టమైన చట్టాలు మాత్రం రాలేదు. ఇప్పుడు విషాఖ ఘటన జరిగింది. దీనికి ప్రతిగా ప్రభుత్వం తక్షణమే సాయం ప్రకటించింది. చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. కానీ విశాఖ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల సంగతేమిటి? మానవ తప్పిదం వల్లనో, సాంకేతిక కారణం వల్లనో మళ్లీ ఇలాంటి సంఘటన జరిగితే???? ఎలా?

ఇక ఇదిలా ఉంటె.... ఇంతకన్నా వందల రేట్లు ప్రమాదకరమైన యురేనియం తవ్వకాలకోసం జరుగుతున్న ప్రయత్నాలు మరింత భయపెడుతున్నాయి. కడప తీగలపల్లి దగ్గరా, జార్ఖండ్ లోనూ ఆ భయంకరమైన ఖనిజం వల్ల దారుణమైన రోగాలు వస్తున్నా... ఇప్పుడు నల్లమలలో ఆ ఖనిజాన్ని తవ్వటానికి చూస్తున్నాయి ప్రభుత్వాలు. గత సంవత్సరం అంతా కలిసి చేసిన పోరాటం వల్ల కొద్దిగా సద్దుమనిగినా... ఇప్పుడు మళ్లీ మొదలయ్యింది. సర్వేలు నడుస్తూనే ఉన్నాయి. కొద్దీ రోజులముందే లోకల్ మైనింగ్ వ్యతిరేకులని అరెస్టు చేసారు. మొత్తంగా నల్లమలలో యురేనియం తవ్వటానికి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అణుబాంబులకు యురేనియం కావాలి, పాకిస్థాన్ ని లేపెయ్యాలి, దేశభక్తులైతే యురేనియం తవ్వనివ్వాలి అనే "గొప్ప దేశభక్తులు" వాళ్ళ వాదన వినిపిస్తూనే ఉన్నారు.

ఇక మొదటికి వస్తే......
కోటి సాయం మంచిదే.... కానీ అది బాధితుల హక్కు . వాళ్ళకి జరిగిన నష్టానికి ఇచ్చిన పరిహారం. వాళ్ళు పోరాడకుండా ఉండటానికి ఇచ్చే లంచం కాదు. ఇలాంటి ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా పోరాటం జరగకపోతే. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రమాదాలకూ, యురేనియం పేరుతో అడవుల నిర్మూలనకూ, బయటికి తీసి తర్వాత శుద్ధి కేంద్రాల ఏర్పాటుకూ... తద్వారా మన సర్వ నాశనానికీ సిద్ధంగా ఉండాల్సిందే.... ఇక మీ ఇష్టం....
-నరేష్కుమార్ సూఫీ

Keywords : visakhapatnam, lg polymers, Gas Leakage, death
(2020-05-31 18:17:02)No. of visitors : 193

Suggested Posts


మనిషులింకా మాయం కాలేదు - జోసఫ్ లాంటి వాళ్ళున్నారు

మనుషులు మాయమైపోతున్న చోట ఇలాంటి కొంత మంది ఇంకా ఉండటం వల్లనే సమాజంలో ఇంకా కొన్ని విలువలు మిగిలి ఉన్నాయి. ఎంతో మంది ప్రభుత్వ ఉపాద్య్హాయులు విద్యార్తులకు బోధనం చేయడం.....

అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !

నాకు సరైన వైద్యం అందించాలని కొట్లాడగా KGH హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్లు కూడా నాకు సరైన వైద్యం అందించలేదు. KGH డాక్టర్ల, అలాగే జైల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల కోర్టులో పిటీషన్ వేస్తే, ఖచ్చితంగా వైద్యం అందించాలని KGH హాస్పిటల్ కి, జైల్ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. KGH హాస్పిటల్ వాళ్ళు స్పందించి నన్నుఅడ్మీట్ అవ్వమన్నారు కానీ

చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై పోలీసుల దుర్మార్గపు దాడి

ఇవ్వాళ్ళ విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం దగ్గర చైతన్య మహిళా సంఘంతో సహా ఇతర ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దాంతో అసలు నిజాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అని భయపడిన చంద్రబాబు పోలీసులు అదే స్థలంలో కొందరు కిరాయి మనుషులతో పోటీ ధర్నాకు దిగారు. ప్రజలను కాపాడాల్సిన తమ బాధ్యతను వదిలేసిన పోలీసులు....

ఎవడి లాభాల కోసం ఈ మరణాలు .. ప్రసాద్ ఇఫ్టూ

మనం ప్రతిరోజూ రకరకాల "ఉగ్రవాదాల" పై భీతావహ వార్తలు వింటాం. AK-47 తుపాకులతోనో, మరేవో బీభత్స ఆయుధాలతోనో జరిగే మారణహోమాల గూర్చి భయవిహ్వలులమై వింటాం. భయాంకరాకారులుగా "ఉగ్రవాద" మూకలను విలన్లుగా చిత్రించే వ్యంగ్య కార్టూన్లని చూసి, అట్టి అదృశ్య శక్తులపై పళ్ళు పటపట కోరుకుతాం. అవేవీ నేడు విశాఖలో చోటు చేసుకోలేదు.

Search Engine

వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
more..


విషం...