కరోనా మాటున అక్రమ అరెస్టులు


కరోనా మాటున అక్రమ అరెస్టులు

కరోనా

రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (పశ్చిమ బెంగాల్) పత్రికా విజ్ఞప్తి

కరోనా గత్తర వ్యాప్తిని అరికట్టాలనే సాకుతో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు యిబ్బందుల్లో వుండడాన్ని అవకాశంగా తీసుకొని రాజ్య యంత్రాంగం రాజ్యవిధానాల పట్ల తమ నిరసనను తెలియచేస్తున్న విద్యార్థులు, కార్యకర్తలు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, పౌర స్వేచ్ఛావాదులపైన మరోసారి తాజాగా దాడులు జరపడానికి పూనుకొంటోంది. గత డిసెంబర్‌లో అధికారంలో వున్న బిజెపి మతతత్వ, విభజించే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) ఆమోదించడంతో దేశవ్యాప్తంగా ఉద్యమ తరంగం వెల్లువెత్తింది. పూర్తిగా ముస్లిం వ్యతిరేకతను కలిగివున్న ఈ చట్టం దేశంలోని నిజమైన దేశభక్తుల్లో, ప్రత్యేకించి ముస్లిం మైనారిటీ నేపథ్యం వున్న ప్రజల్లో కోపాన్ని రేకెత్తించింది. ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంత మహిళలు, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు, ప్రత్యేకించి జామియా మిలియా ఇస్లామియా, జెఎన్‌యు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో కలిసి దేశ వ్యాప్తంగా జరిగిన సిఎఎ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించడంలో ఒక చరిత్రను సృష్టించారు.

అందుకు ప్రతీకారంగా, అమాయక విద్యార్థులు, మహిళలపై భయోత్పాత దాడులు చేయడానికి పాలక బిజెపి తన సైద్ధాంతిక అధిపతి ఆర్ఎస్ఎస్‌ను, విద్యార్థి విభాగం ఎబివిపిని ఉపయోగించింది. ఇంకా ముందుకు వెళ్ళి , ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బిజెపి నాయకులు ఈ దేశంలోని ʹగద్దర్ʹలను (నిరసనకారులను) కాల్చి చంపడం గురించి బహిరంగంగా మాట్లాడారు. ఆ తరువాత, ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో నివసిస్తున్న అమాయక ముస్లింలపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులు కలిసి సామూహిక హత్యా కాండ జరిపారు. ఈ గత్తర సమయంలో కూడా ఈ కుటుంబాల్లో అనేకం ఇప్పటికీ వేర్వేరు ఆశ్రయాలలో నివసిస్తున్నాయి.
ప్రజలు తమ ఇళ్లలోనే వుండిపోవాల్సి రావడం, ప్రస్తుత నిబంధనల ప్రకారం సామూహిక ప్రదర్శనపై నిషేథం విధించడంలాంటి పరిస్థితుల ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు నిరసనలు తెలిపిన వారిమీద దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) లాంటి తీవ్రమైన ఆరోపణలు మోపుతోంది. గత ఒక నెలలో బిజెపి ప్రభుత్వం వరుసగా జామియా మిలియాలో విద్యార్థులు, రెసెర్చ్ స్కాలర్లు అయిన మీరన్ హైదర్, గల్ఫిషా, సఫూరా జర్దార్, షిఫా-ఉర్ రెహ్మాన్, షార్జీల్ ఇమామ్‌లను, ఢిల్లీ మైనారిటీ కమిషన్ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్‌ను అరెస్టు చేసింది. ఒక ప్రక్కన కరోనా వైరస్‌ను అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్త జైళ్ళలో రద్దీ తగ్గించాలని సుప్రీంకోర్టు ఆదేశముండగానే మూడు నెలల గర్భవతి అయిన సఫూరాను రద్దీగా ఉన్న ఢిల్లీ తీహార్ జైలుకి పంపింది.
సఫూరా, మీరన్ హైదర్‌లు ఇద్దరిపైనా మత హింసను ప్రేరేపించినట్లుగా అభియోగం మోపగా, గులీఫ్షా మీద జఫ్రాబాద్ మహిళలు నిర్వహించిన ధర్నాకు సమన్వయకర్తగా వ్యవహరించిందని షార్జీల్ ఇమామ్, షిఫా-ఉర్‌లు హింసను ప్రేరేపించారనీ ఆరోపణ చేశారు. జఫారుల్‌ఇస్లాంసోషల్ మీడియాలో "రెచ్చగొట్టే" వ్యాఖ్యలను పెట్టారనే ఆరోఫణలో, ఆ వ్యాఖ్యలు భారతీయ ముస్లింలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి వుండడమనేది వున్న విపర్యాసం.
పైన పేర్కొన్న వ్యక్తులతో పాటు, పూర్వ జెఎన్‌యు కార్యకర్త ఉమర్ ఖలీద్‌పై కూడా ఇటీవల అదే యుఎపిఎ కింద కేసు నమోదైంది.
కానీ జాబితా ఇక్కడతో ఆగదు. కాశ్మీర్ ప్రజల వాస్తవ కథలను తెలుసుకోవడానికి గత సంవత్సరాల్లో ప్రభుత్వం సృష్టించిన అననుకూలత పరిస్థితులనన్నింటినీ ఎదిరిస్తూ అవిశ్రాంతంగా పోరాడుతున్న కాశ్మీర్ జర్నలిస్టులను కూడా అధికార బిజెపి లక్ష్యంగా చేసుకుంది. మస్రత్ జహ్రా, పీర్జాడా ఆశిక్, గౌహర్ గీలానీలపై యుఎపిఎ కింద అభియోగాలు మోపింది. మస్రత్, కాశ్మీర్ ప్రజల జీవన వాస్తవాలను వర్ణించే చిత్రాల కోసం నిరంతరం వెతికే ఒక ఫోటో జర్నలిస్ట్. ది హిందూ స్థానిక కరస్పాండెంట్ పీర్జాదా పైన నకిలీ వార్తలను ప్రసారం చేశారని, రచయిత, జర్నలిస్ట్ అయిన గౌహర్‌పై ʹఉగ్రవాదాన్ని కీర్తిస్తున్నారనిʹ అభియోగాలు మోపారు. ప్రభుత్వం ఒకవైపు దేశ వ్యతిరేకమని ముద్ర వేసి ఈ అసమ్మతి స్వరాలను ఆపడానికి ప్రయత్నించడమూ, మరోవైపు అసలైన దేశద్రోహుల్ని, ద్వేషభావాల్ని వ్యాప్తిచేసే వారిని ఏ శిక్షా లేకుండా స్వేచ్ఛగా తిరగనివ్వడమనేది నిజంగా దురదృష్టకరం.
భారత ప్రభుత్వ ఈ ఫాసిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా స్వరం పెంచాలని దేశంలోని ప్రజాస్వామికవాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దేశవ్యాప్తంగా అరెస్టు చేసిన విద్యార్థులు, కార్యకర్తలు, పాత్రికేయులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఖైదీలందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, క్రూర UAPA & దేశద్రోహ చట్టాల్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

కార్యదర్శి,

రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (పశ్చిమ బెంగాల్)

Keywords : UAPA, Arrests, kashmir, delhi, corona, lockdown
(2020-05-31 04:49:45)No. of visitors : 83

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!

కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.

మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు

ప్ర‌జ‌లు మానసిక‌ జబ్బుల భారిన ప‌డుతున్నారు. మ‌తిస్తిమితం కోల్పోవ‌డం, తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం, విప‌రీతంగా భ‌యాందోళ‌న‌ల‌తో రోధిస్తూ ప‌లువురు అప‌స్మార‌క స్తితికి చేరుకుంటున్నారు. గ‌డిచిన 12 రోజుల్లో... మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద‌ని SHMS ఆసుప‌త్రి వైద్యులు

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..

కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది.

Search Engine

వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
more..


కరోనా