ʹఎల్జీ పోలిమర్స్ మంచి కంపనీ అని జగన్ పొగడడం దేనికి నిదర్శనంʹ


ʹఎల్జీ పోలిమర్స్ మంచి కంపనీ అని జగన్ పొగడడం దేనికి నిదర్శనంʹ

ʹఎల్జీ

ఎల్.జి.పాలిమర్స్ లో విష వాయువు లీక్ అయ్యి 11 మంది మరణించిన సంఘటనపై మానవ హక్కుల వేదిక ప్రకటన పూర్తి పాఠం...

ఎల్.జి. పొలిమెర్స్ యాజమాన్యం, నియంత్రణా అధికార్ల క్రిమినల్ నిర్లక్ష్యo వల్ల మే 7న విష వాయువు లీకేజ్ సంభవించిoది కనుక వారిని ప్రాసిక్యూట్ చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) కోరుతోంది. గతంలో ఇటువంటి నేరాలు జరిగినప్పుడు కేసును నీరుగార్చినట్లుగా ఎల్.జి. పొలిమెర్స్ పై నమోదు చేసిన కేసును కూడా నీరుగార్చకూడదని, త్రికరణశుద్ధితో దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.

ఎల్.జి. పొలిమెర్స్ నియమాలను పాటించే ʹమంచి కంపెనీʹ అని, ప్రఖ్యాత బహుళ జాతి సంస్థ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ణించడాన్ని హెచ్.ఆర్.ఎఫ్. తీవ్రoగా ఖండిస్తోంది. లాక్డౌన్ విధించిన ఈ గడ్డు రోజుల్లో 11 మంది మరణానికి, వందలాది మంది అనారోగ్యానికి కారణమై నగరంలో ఒక భయానక వాతావరణం సృష్టించింది ఎవరంటే ఆ ఎల్.జి. కంపెనీనే. ఈ కంపెనీకి ఒక ʹమంచిʹ పేరున్నది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ కంపెనీ కాలుష్య నియంత్రణకు సంబంధించిన నియమాలను ఉల్లంఘించి ప్రమాణాల కంటే పదిహేను రెట్లు మించిన మోతాదులో కాన్సర్ వ్యాధికి దారి తీయగల వినైల్ క్లోరైడ్ రసాయనాన్ని గాలిలో వదిలిందని, ఆ విషయం కప్పిపెట్టడానికి వాయు కాలుష్యానికి సంబంధించిన వివరాలను ఆ కంపెనీ తారుమారు చేసిందని దక్షిణ కొరియా ప్రభుత్వం 2019 ఏప్రిల్ లో బయటపెట్టింది.

ఈ ప్రమాదకర వాయువు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుందో మనకు ఇంత వరకు తెలీదు. కొన్ని సంవత్సరాల పాటు ప్రాధమిక స్థాయిలోనైనా పర్యావరణ నియమాలను పాటించలేదని రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ (ఎస్.ఇ.ఐ.ఏ.ఏ.) ముందు గత ఏడాది మే నెలలో స్వయంగా ఒప్పుకుంటూ అఫిడవిట్ ఫైల్ చేసిన కంపెనీ ఇది!

గురువారం నాడు విశాఖపట్నంలో జరిగింది ఒక కార్పొరేట్ నేరం. దాన్ని సాధారణీకరించడం, తీవ్రతను పలచన చేయడం, ఇదేమంత పెద్ద విషయం కాదు లెమ్మన్నట్లు జరిగే ప్రయత్నాలు అత్యంత హేయకరమైనవి. భోపాల్ బాధితులకు గత 35 ఏళ్ళుగా జరుగుతున్న అన్యాయాన్ని ఇంతలోనే మరిచారా?

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు పర్యావరణ నియమ నిబంధనలను, భద్రతా ఆదేశికాలను యథేచ్ఛగా ఉల్లంఘించడాన్ని కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాము. ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నదో తెలిసి కూడా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏ.పి.పి.సి.బి), ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల వ్యవస్థ వంటి నియంత్రణా సంస్థలు ఈ నేరాలను చూసీ చూడనట్లు పోతూ రాజీ బేరాలు కుదుర్చుకుంటున్నాయి. అధిక జనాభా నివసించే ప్రాంతంలో ఒక రెడ్ క్యాటగిరీ ప్రమాదకర పరిశ్రమని పని చేయనిచ్చి, దాని సామర్ధ్యాన్ని పెరగనిచ్చిన టౌన్ ప్లానింగ్ అధికార సంస్థ కూడా తగిన బాధ్యత వహించాలి. ఆ పరిశ్రమ వల్ల వస్తున్న పర్యావరణ సమస్యల గురించి స్థానికులు ఎప్పటికప్పుడు అధికార్లకు తెలియజేస్తూనే ఉన్నారు.

ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయినా ఇప్పటి వరకు ఎవరు జవాబుదారులో తేల్చడం కానీ వారిని ప్రాసిక్యూట్ చేయడం కానీ జరగ లేదు. నేరాలను కప్పిపుచ్చడం, అబద్ధాలు చెప్పడం, ఎవరో ఒకరిని బలి పశువులను చేయడం, నష్టపరిహారం ఇచ్చి కేసులు మూసేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇందువల్ల శిక్షలు పడతాయనే భయం ఎవరికీ లేకుండా పోయింది. ఫలితమేమంటే విశాఖపట్నం ఒక పారిశ్రామిక మందు పాతరగా మారింది.

ఎల్.జి. పొలిమెర్స్ పర్యావరణ పరిరక్షక చట్టం, 1986, ప్రమాదకర రసాయనాల తయారీ, నిలువ, దిగుమతి నియమాలు, 1989 లను ఉల్లంఘించింది అనేది స్పష్టంగా అర్ధమౌతూనే ఉంది. 1989 నియమాల ప్రకారం స్టైరీన్ ఒక ʹప్రమాదకర, విషపూరిత రసాయానంʹ. ఇటువంటి విష పదార్ధాలను పరిశ్రమలలో నిల్వ ఉంచినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్డౌన్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంది. ఎల్.జి. యాజమాన్యం ఈ జాగ్రత్తలు పాటించలేదనేది సుస్పష్టంగా అర్ధమౌతూనే ఉన్నది. ఈ పరిశ్రమలో తిరిగి పనులు చేపట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదనేది కూడా పరిస్థితులను బట్టి అర్ధమౌతూనే వుంది. లాక్డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత ఈ పరిశ్రమలో పనులు ఎందుకు పునరావృతం కానిచ్చారు అనే ప్రశ్న రాకుండా ఉండదు.

పారిశ్రామిక ప్రదేశాల్లో, వెలుపల అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు, విపత్తు నియంత్రణకు ఉండవలసిన ప్రణాళిక, తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఎంత దయనీయ స్థితిలో ఉన్నామో ఈ సంఘటన చూస్తే అర్ధమౌతుంది. గురువారం మధ్యాహ్నం వరకూ ఫ్యాక్టరీకి 15 కిలోమీటర్ల దూరం వరకు దుర్గంధం వ్యాపించి, స్థానికులకు తలనొప్పి వచ్చింది. మరోసారి స్టైరీన్ ఆవిరి లీకయిందనే పుకార్లు రావడంతో గురువారం రాత్రి గోపాలపట్నం, మురళీనగర్, మాధవధార పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది ప్రజలు మద్దిలపాలెం, బీచ్ రోడ్ ల వరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారికి పాలనా యంత్రాంగం నుండి ఎటువంటి సహాయం అందలేదు. ఉన్న పరిస్థితి గురించి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ ఇప్పటి వరకు ఒక అధికార ప్రకటన వెల్లడి కాకపోవడంతో స్థానికులు దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు.

ʹప్రిన్సిపుల్స్ అఫ్ అబ్సొల్యూట్ లయబిలిటీʹ ప్రకారం జరిగిన నష్టాన్ని, నష్ట పరిహారాన్ని భరించాల్సింది కంపెనీనే. ప్రభుత్వం చెల్లించిన సహాయం, కాలుష్యం వెదజల్లిన ఎల్.జి. పొలిమెర్స్ నుండి తిరిగి వసూలు చేయాలి తప్ప పన్ను కట్టే వారి మీద భారం కాకూడదు. కంపెనీలో ఏర్పాటు చేసిన వాయు నాణ్యత మోనిటర్స్ రికార్డు చేసిన డేటాను, గాలి, నీరు, మట్టి సాంపిల్స్, బాధితుల మూత్రం/రక్తం సాంపిల్స్ మొదలు అన్నిరకాల సాక్ష్యాలను ఏ.పి.పి.సి.బి. ప్రజల ముందు బహిర్గతం చేయాలి.

ప్రపంచవ్యాపితంగా ఇంత పెద్ద స్థాయిలో స్టైరీన్ లీకేజీ జరగడం, స్టైరీన్ పీల్చి ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి జరిగింది కనుక భారత వైద్య పరిశోధన మండలి (ఐ.సి.ఎం.ఆర్.) ఈ రసాయనం పీల్చడం వల్ల కలిగే హాని గురించి ఒక దీర్ఘకాలిక పరిశోధన చేపడితే ఉపయోగకరంగా ఉంటుంది. స్టైరీన్ వల్ల కాన్సర్ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ కాన్సర్ పరిశోధన సంస్థ భావిస్తోంది.

స్టైరీన్ ఆవిరి లీకయ్యే సమయానికి ఆ ఫ్యాక్టరీలో 15 మంది కార్మికులు ఉన్నారని, ఆ 15 మంది కాజువల్ వర్కర్స్ అని తెలిసింది. కార్మిక చట్టాల సవరణ, కార్మిక హక్కుల, ఉద్యోగ భద్రతలకు సంబంధించిన చట్టాలను అటకెక్కించి కార్మిక లోకాన్ని కాజువల్ వర్కర్స్ తో నింపుతున్నారు. పారిశ్రామిక భద్రతా నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ విడిగా ఒక ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని, కార్మిక చట్టాల ఉల్లంఘన జరిగినందుకు కార్మిక విభాగం కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. రెడ్, ఆరంజ్ కేటగిరీ పరిశ్రమలలో శిక్షణ పొందిన నైపుణ్యం గల శాశ్వత సిబ్బందితోనే పనులు చేయించేటట్లు చూడటానికి ప్రభుత్వం దీన్ని ఒక సందర్భంగా భావించాలి.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ విశ్వసనీయత పట్ల హెచ్.ఆర్.ఎఫ్. కు సందేహాలు ఉన్నాయి. ఈ నేరం మూలాలలోకి పోయి విచారణ జరిపే ఒక స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించాలని, పౌర సమాజ ప్రతినిధులను కూడా ఆ బృందంలో భాగం చేయాలని కోరుతున్నాము. యాజమాన్యం సాక్ష్యాధారాలను తారుమారు చేయకుండా ఉండేందుకు ఫ్యాక్టరీని వెంటనే సీల్ చేసి, అన్ని రికార్డులను స్వాధీన పర్చుకోవాలని కోరుతున్నాము.

కె.సుధ (హెచ్.ఆర్.ఎఫ్. ఏ.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

వి.ఎస్.కృష్ణ (హెచ్.ఆర్.ఎఫ్. ఏ.పి. & టి.ఎస్. సమన్వయ కమిటీ సభ్యులు)
విశాఖపట్నం

Keywords : LG Polymers, visakhapatnam, gas leakage, ys jagan,
(2020-11-28 18:41:34)No. of visitors : 432

Suggested Posts


ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLC
ʹసెట్ బాక్స్ వస్తాయి, నిరాశ పడితే ఎట్లాʹ - వీవీతో ములాఖత్ 2
30 మందిపై అక్రమ కేసులు బనాయించిన జగన్ సర్కార్ -ఇద్దరు మహిళా కార్యకర్తల అరెస్టు
వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో
సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
more..


ʹఎల్జీ