లాక్ డౌన్ ను అవకాశంగా తీసుకుంటున్న కులోన్మాదులు ...4రోజుల్లో నలుగురు దళితుల హత్య‌!


లాక్ డౌన్ ను అవకాశంగా తీసుకుంటున్న కులోన్మాదులు ...4రోజుల్లో నలుగురు దళితుల హత్య‌!

లాక్

"తమిళనాడును అత్యాచారాల రాష్ట్రంగా ప్రకటించాలి. ఇక్కడ వున్నట్లుగా కుల సమస్య మరే రాష్ట్రంలోనూ లేదు" అని మదురైకి చెందిన ఎన్జీఓ ʹఎవిడెన్స్ʹ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ కదిర్ ఆవేదన.
కరోనావైరస్ గత్తర సమయంలో కుల ఆధారిత హింస తమిళనాడులో కొత్త స్థాయికి ఎదిగిందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ʹఎవిడెన్స్ʹ చేసిన అధ్యయనంప్రకారం మార్చి 25 న దేశవ్యాప్తంగా మొదటి లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి, రాష్ట్రంలో కనీసం 30 కుల ఆధారిత పెద్ద హింసాత్మక సంఘటనలు జరిగాయి. అనేక చోట్ల కొన్ని అగ్రకుల వర్గాలు లాక్‌డౌన్‌ను దళితులపై దాడి చేయడానికి అవకాశంగా ఉపయోగిస్తున్నాయని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
"చాలా సంఘటనలలో, 40-50 మంది గుంపుగా వచ్చి దాడి చేస్తున్నారు. లాక్డౌన్లో ఇది ఎలా సాధ్యమవుతుంది?" అని కదిర్ ప్రశ్నిస్తున్నారు. "గత నాలుగు రోజులలో, నలుగురు దళితులు హత్య చేయబడ్డారు. పరువు హత్యలు, మూక దాడులు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులు అన్నీ జరిగాయి. సమాజంలో గృహ హింస మాత్రమే కాదు కుల ఆధారిత హింస కూడా పెరిగింది. లాక్డౌన్ కారణంగా బాధితులు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఎస్సీ / ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం, నిందితుడు బెయిల్ కోసం వెళితే, ఆ విషయాన్ని బాధితురాలికి తెలియచేయాలి. హైకోర్టు కరోనా వ్యాప్తి ప్రమాదం వల్ల నిందితులు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పడాన్ని నిందితులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుని బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. " అని డిమాండ్ చేశారు కదిర్
నేరాల తీవ్రత స్థాయి కూడా వేగంగా పెరుగుతోంది. ఒక నెలలో సగటున 100 కేసులు ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద నమోదు అవుతున్నాయి. వీటిలో సాధారణంగా దాదాపు నాలుగైదు పెద్ద నేరాలు వుంటాయి. అయితే ఈ నెలలో దాదాపు 30 సంఘటనలు తీవ్రస్థాయిలో వున్నాయి. అంటే క్రూరమైన నేరాలు వేగంగా పెరుగుతున్నాయి.
వీటిలో అరనిలోని మొరప్పంతంగల్ గ్రామంలో జరిగిన సంఘటన పరువు హత్య. ఒడ్డర కులస్థుడు ఓం సుధాకర్‌ను వన్నియార్ కులానికి చెందిన అతని ప్రేమికురాలి బంధువులు మార్చి 29న హత్య చేశారు. ఆమె తండ్రితో సహా ఇద్దరు నిందితులు అరెస్టు అయారు.
పుదుక్కో ట్టై జిల్లాలోని కరంబక్కుడిలో ఏప్రిల్ 21 న ఎంబీఏ గ్రాడ్యుయేట్ మురుగనందం అనే దళిత యువకుడు తాను ప్రేమించిన భానుప్రియను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన వెంటనే భానుప్రియ బంధువులు మురుగనందంపై దాడి చేసి ఆమెను ఎత్తుకెళ్లారు. ఎవిడెన్స్ సంస్థ భానుప్రియను విడిపించింది.
పట్టణంలో ఏప్రిల్ 24 న జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసిన సంఘటన వార్తని అందించిన రాజకీయ పార్టీ విదుతలై చిరుతైగల్ కచ్చి(విసికె)కి చెందిన టివి ఛానల్ వెలిచం రిపోర్టర్ ఆది సురేష్ మీద దాడి జరిగింది.
మే 8 న తూటికోరిన్‌లోని ఉదయకుళం గ్రామంలో అప్పు విషయమై వివాదం జరిగి దేవర్ వర్గానికి చెందిన ఒక గుంపు ఏ. పాలవేసంని, అతని అల్లుడు ఆర్, తంగరాజ్‌లను హత్యచేసింది. సేలంలో అదే రోజు, విష్ణుప్రియన్ అనే దళితుడిని అగ్రకులస్థులు హత్య చేశారు.
నగరాల నుండి గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు సంబంధించి ఈ సంఘటనలు పెరిగాయి. వీరిలో చాలా మంది అట్టడుగు కులాలకు చెందిన వారు. ముఖ్యంగా కోవిడ్ -19 ప్రధాన కేంద్రంగా వున్న కోయంబేడు నుండి తిరిగి వచ్చి క్వారెంటైన్‌లో వున్న వారు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. తిరువన్నమలై జిల్లాలోని కొన్ని గ్రామాల్లో, దళితులు కాలనీల నుంచి బయటికి రాకుండా అగ్ర కులస్థులు ముళ్ళ కంచెలను అడ్డుగా పెట్టారు.
సాధారణ వివక్షకు ఈ ఘటనలు తోడై దళితుల జీవితాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి.
దళితులు శుభ్రంగా వుండరని సామాన్లు అమ్మడానికి నిరాకరించిన సంఘటనలు నీలకొట్టైలో జరిగాయి. పారిశుద్ధ్య కార్మికులు, స్కావెంజర్లు, పనిమనుషులు మొదలైన వారు పరిశుభ్రంగా వుండరనే అభిప్రాయం తోడవడంతో కుల వివక్ష అనేక రెట్లు పెరిగింది. అందరి ఇళ్లలో బాత్‌రూమ్‌లు వుండవు. ప్రభుత్వ శౌచాలయాలు ఉపయోగించుకోగలిగే స్థితిలో వుండవు, కాబట్టి చాలామంది ఇప్పటికీ బహిరంగ ప్రదేశాలనే ఉపయోగిస్తున్నారు. వాళ్ళు వూరి బయటకు రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
"తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ మద్యం షాపులను తెరవడం వల్ల మరిన్ని కష్టాలపాలవుతున్నారు. షాపులు తెరచిన మొదటి రోజునే 175 కోట్ల రూపాయలను ఆదాయం వచ్చిందని అంటున్నారు. అందులో కనీసం 80 శాతం పేద ప్రజల ద్వారా వచ్చి వుంటుంది. కనీస తిండి కోసం కూడా లేకుండా ఇబ్బంది పడే స్థితిలో వుంటారు కాబట్టి మద్యం కొనడానికి అప్పు తీసుకుంటారు. ఈ అప్పు వివాదాల కారణంగానే తూత్తుకుడిలో ఇద్దరు దళితులు హత్యకు గురయ్యారు. ఇది ఒక విష వలయంʹ అని కదిర్ వేదనపడుతున్నారు.
కుల ఆధారిత హింసకు హెల్ప్‌ లైన్ ఏర్పాటు చేయాలని కదిర్ అభిప్రాయపడితే, వివక్షను ఆపడానికి ఏకైక మార్గం ప్రస్తుత చట్టాలను కఠినంగా అమలు చేయడం అని తమిళనాడు అంటరానితనం నిర్మూలన ఫ్రంట్ (టిఎన్‌యుఇఎఫ్) అధ్యక్షుడు పి సంపత్, అంటున్నారు.
"ఈ గత్తర కాలంలో కూడా, కులతత్వం ఆగిపోలేదు. కార్మికులుగా ఉన్న చాలా మంది దళితులు ఇంటికి తిరిగి వస్తున్నారు, వారు చాలా కోపంగా ఉన్నారు. దురదృష్టవశాత్తు, కుల వివక్షకు నిర్దిష్ట సమయం లేదు. ఇది అన్ని సమయాల్లోనూ ఉంటుంది. భారతదేశంలో కుల ఆధారిత వివక్షక వ్యతిరేక చట్టాలకు కొరత లేదు. కేసు పెట్టడానికి అనేక సెక్షన్లు ఉన్నాయి. ఇతర దేశాల్లో కుల సమస్య లేదు, కానీ అక్కడ వున్న జాత్యహంకారంతో పోరాడటానికి భారతదేశంలో వున్నన్ని చట్టాలు లేవు. అయితే ఇక్కడి ప్రభుత్వం వున్న చట్టాలను అమలు చేయాల్సి వున్నది. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులను సమాజంలో ప్రభుత్వం కల్పించాలి. దాడి చేసేవారిని రాష్ట్ర గూండా చట్టం క్రింద అరెస్టు చేయాలి" అని కదిర్ అభిప్రాయపడుతున్నారు.

"ప్రపంచం లాక్డౌన్లో ఉంది, కాని కులతత్వం లాక్డౌన్‌లో లేదు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. వైద్యులపై దాడి చేసే వ్యక్తులమీద జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేస్తామని అంటున్నారు. మరి దళితులపై దాడి చేసిన వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? వారు గుంపులుగా వచ్చి ఎలా దాడి చేస్తున్నారు. కరోనావైరస్‌తో చచ్చినా ఫరవాలేదు కానీ కులాన్ని మాత్రం వదలరు. కరోనా వైరస్ సమాజాన్ని తనిఖీ చేస్తోంది. కొంతమందిలో వున్న కుటిలత్వాన్ని బయటకు తీస్తోంది. క‌రోనావైరస్ కంటే కులం చాలా ప్రమాదకరమైనది.ʹʹ అంటున్నాడు కదిర్

Keywords : tamilanadu, dalits, murder, uppercast, lockdown,
(2020-06-03 23:25:23)No. of visitors : 490

Suggested Posts


ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !

చోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు.

వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌

నిలబడ్డవాళ్ళ కాళ్ళపై పడి మొక్కుతున్న ఆ వృద్దును పేరు కాశీ. వెట్టి కార్మికుడు... అంటే ప్రజాస్వామ్య భారతంలో భానిస. తమిళనాడు కాంచీపురం జిల్లా కొన్నెరకుప్పం గ్రామంలో ఓ కట్టెల మిల్లులో పదేళ్ళుగా వెట్టి చేస్తున్న భానిస. అది కూడా పదేళ్ళ కింద ఆయన చేసిన వేయి రూపాయల అప్పు కోసం...

కరోనా కన్నా కులమే ప్రమాదకర‌ వైరస్...పా రంజిత్

కరోనా మహమ్మారి సమయంలో కూడా దళితులను హత్య చేయడం వారిపై దాడులు, హింస పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ దేశంలో కరోనా కన్నా కులం ఎక్కువ ప్రమాదకారి అని అన్నారు.

కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !

తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన‌ వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket

A Class XII Dalit girl committed suicide after her examination hall ticket was torn up on Monday by two boys in her classroom in Pochampalli in Tamil Nadu. One of the boys had been harassing her to accept his love proposal

వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలు

పోలీసులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ తగిలి మరణించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తమోడుతూ పడిపోయిన అతని చూట్టూ పోలీసులు చేరి లాఠీలతో బెదిరిస్తూ ʹనటించింది చాలు ఇక వెళ్లుʹ అని కసురుకున్నారు.

న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేత‌

తంజావూర్‌ జిల్లా అంబాలపట్టు దక్షిణ గ్రామంలో దళిత యువకులు కొందరు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేసుకున్నారు. లైట్లతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకు న్నారు. వారి ఉత్సవాలకు గుర్తుగా గ్రామ ప్రవేశ ద్వారానికి బెలూన్లు, రంగు కాగితాలు కట్టారు.

వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !

1995లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది మొదలు తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాల్లో తిరస్కరించిన తర్వాత ఈ కర్మాగారం చివరికి తమిళనాడులో అడుగుపెట్టింది. ఈ వివాదంపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింద

నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట

కేంధ్ర ప్రభుత్వం ఎంత సమర్దించుకుందామని ప్రయత్నించినా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా నిరసన గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ రెండింటిపై తమ నిరసన గళ్ళాన్ని వినిపించారు. అయితే ఇప్పుడు....

Letter of Inquilab family rejecting Sahitya Akademi award !

Inquilab is the voice of the voiceless,oppressed, underprivileged and backward people. Recognition for a person like him is to remain a peopleʹs poet. State recognition such as this may help in reaching his name to a larger national circle.

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


లాక్