ప్రజా కోర్టు నిర్ణయం మేరకు కానిస్టేబుల్ ను విడుదల చేసిన మావోయిస్టులు


ప్రజా కోర్టు నిర్ణయం మేరకు కానిస్టేబుల్ ను విడుదల చేసిన మావోయిస్టులు

ప్రజా

చత్తీస్ గడ్ లో మావోయిస్టులు ఓ పోలీసు కానిస్టేబుల్ ను ప్రజా కోర్టులో విచారించి ప్రజల‌ నిర్ణయం మేరకు విడుదల చేశారు. సంతోష్ కట్టం అనే పోలీసు కానిస్టేబుల్ సెలవుపై తన గ్రామానికి వచ్చాడు. లాక్ డౌన్ కారణంగా తిరిగి వెళ్ళలేక పోయాడు. అయితే చాలా కాలంగా ఆ కానిస్టేబుల్ ఊళ్ళొనే ఉండటంతో అనుమానించిన గ్రామ రక్షక దళాలు మే 4 వ తేదీన అతన్ని పట్టుకెళ్ళి మావోయిస్టు పార్టీకి అప్పజెప్పాయి.
అయితే అతని భార్య సునీత తన భర్తను విడిపించాలని కోరుతూ తన గ్రామస్తులనే కాకుండా చుట్టు పక్కల గ్రామ ప్రజలను కూడా సంప్రదించింది. చివరకు బీజాపూర్ లోని గణేష్ మిశ్రా అనే జర్నలిస్టును సంప్రదించింది ఆమె.

"ఆమె ఉద్వేగభరితమైన అభ్యర్ధనతో తన భర్తను కనిపెట్టడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేయటానికి సిద్దమయ్యాను. గ్రామస్తుల నుండి సమాచారం కోసం వేటాడటం మొదలుపెట్టాను అనేక‌ మారుమూల గిరిజన కుగ్రామాలను సందర్శించానుʹʹ అని మిశ్రా న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.
ఎక్కడ ఎటువంటి క్లూ కూడా దొరక లేదు. అయినా తాను వెతుకుతునే ఉన్ననని చెప్పాడు గణేష్ మిశ్రా.
"నా బాధ చూదలేక కొంతమంది గ్రామస్తులు చివరికి నేను సంతోష్ కోసం వెతుకుతున్న విశయాన్ని మావోయిస్టులకు తెలియజేశారు. సంతోష్ కట్టం తమ బందీగా ఉన్నాడని మావోయిస్టులు మే 9 న నాకు సమాచారం ఇచ్చారు. వాళ్ళను కన్విన్స్ చేయడానికి నేను ప్రయత్నించాను. పోలీసు బలగాలలో ఉన్నాడు కానీ ఎలక్ట్రీషియన్‌గా మాత్రమే పని చేస్తున్నాడని, అతను ఎప్పుడూ మావోయిస్టులకు వ్యతిరేక కార్యకలాపాల్లో భాగం కాలేదని నేను వారిని ఒప్పించటానికి ప్రయత్నించాను.ʹʹ

"అంతేకాకుండా కానిస్టేబుల్ సంతోష్ మానసికంగా కృంగి పోయి ఉన్నాడు. కాబట్టి అతని భార్య, పిల్లల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, మానవత్వ దృక్పదంతో అతన్ని విడుదల చేయాలని కోరాను. కాని పోలీసు శాఖలో ఉన్నాడంటే వారి ఫోర్స్ లో భాగమైనట్టే అని నక్సల్స్ అతన్ని విడుదల చేయడానికి విముఖత చూపారు.ʹʹ దట్టమైన అడవి లోపల మావోయిస్టులతో తన చర్చలను గుర్తు చేసుకుంటూ మిశ్రా అన్నారు.

"అతను ఎన్నడూ ఆయుధాలు పట్టుకోలేదని, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్తో ఎటువంటి సంబంధం లేదని నేను భరోసా ఇచ్చాను. అప్పుడు వారు తమ సీనియర్ నాయకుల వద్దకు విషయాన్ని తీసుకెళ్ళారు.ʹʹఅని మిశ్రా తెలిపారు.

మరుసటి రోజు సాయంత్రం మిశ్రాకు మావోయిస్టుల నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది, జన్ అదాలత్ (ప్రజా కోర్టు)ను నిర్వహించాలని నిర్ణ‌యించామని అక్కడికి కానిస్టేబుల్ కుటుంభ సభ్యులను, ఇతర జర్నలిస్టులను తీసుకొని రావాలని వారు కోరారు.
మిశ్రా, అతని సహచరులు రంజన్ దాస్ మరియు చేతన్ ఖపెర్వార్ (ఇద్దరూ జర్నలిస్టులు) తో కలిసి అడవిలో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు.

ʹమే 11 మధ్యాహ్నం రెండు గంటల జన్ అదాలత్(ప్రజా కోర్టు) నిర్వహించారు. ఆ ప్రజా కోర్టు లోకి కానిస్టేబుల్ ను ప్రవేశ పెట్టారు. చివరికి ప్రజా కోర్టులో గ్రామస్తుల నుండి వచ్చిన మెజారిటీ అభిప్రాయాల ఆధారంగా, మావోయిస్టులు సంతోష్ కట్టంను విడుదల చేశారు. మేము అతన్ని తీసుకువచ్చి బీజాపూర్ డిప్యూటీ ఎస్పీ జియారత్ బేగ్‌కు అప్పగించాము ʹʹ అని మిశ్రా చెప్పారు.

"మావోయిస్టులు ప్రజా కోర్టులో హాజరు పర్చిన‌ పోలీసులను వదిలేయడం ఇదే మొదటిసారి - ఇది చాలా అరుదు" అని మిశ్రా చెప్పారు.

అతని విడుదల చేసిన‌ తరువాత మావోయిస్టులు... కానిస్టేబుల్ ను మానవతా దృక్పదంతో విడిచిపెట్టామని ప్రకటించారు. " కానిస్టేబుల్ సంతోష్ గురించి కనీసం ఆందోళన చెందని రాష్ట్ర ప్రభుత్వం, అతని విడుదలను తన‌ విజయంగా భావించకూడదు. మీడియా వ్యక్తి జోక్యం, కుటుంబం చేసిన విజ్ఞప్తి, గ్రామస్తుల అభిప్రాయం కారణంగా మేము అతన్ని విడిపించాము ʹఅని మావోయిస్టులు ప్రకటించారు.

(ʹఇండియన్ ఎక్స్ ప్రెస్ʹ సౌజన్యంతో)
(https://www.newindianexpress.com/nation/2020/may/13/scribe-secures-release-of-cop-from-maoist-captivity-in-chhattisgarh-2142840.html?fbclid=IwAR3YphyKVkMRKqFfQbdZRIJXppDNZw6y8izHpGVH-M-VeaPrDa6_2-_ZfOc)

Keywords : chattis garh, maoists, journalists,
(2020-09-18 04:18:56)No. of visitors : 989

Suggested Posts


సుక్మా అటాక్ పై మావోయిస్టు నేత వికల్ప్ ఆడియో ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై తాము జరిపిన దాడి ప్రజా ఉద్యమాలను కాపాడుకోవడానికేనని సీపీఐ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఆడియో ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై...

A week after Sukma encounter, Maoists release photographs of modern weapons Possessed from CRPF

A week after the Sukma encounter, which killed 12 personnel of Central Reserve Police Force (CRPF), the Maoist Party released a press statement carrying an image of assembled modern weapons they looted from the dead CRPF personnel....

బాలికల బట్టలిప్పించి.. కరెంటు షాక్‌ ఇచ్చారు.. అది బయటపెట్టిన అధికారిణిని మాయం చేశారు !

14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్‌లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్‌ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్‌ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను....

అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు

సుకుమా జిల్లా కుంటా బ్లాక్ కన్నాయి గూడెంపై ఆర‌వ తేది తెల్ల‌వారుజామున వంద‌లాది మంది పోలీసులు విరుచుకుప‌డి దొరికిన వారిని దొరికిన‌ట్టు ఊచ‌కోత కోశారు. ఆదివాసీల‌ను దుర్మార్గంగా పిట్ట‌ల్ని కాల్చిన‌ట్టు కాల్చేశారు.

I wrote on Facebook what I witnessed in Bastar: suspended jailer Varsha Dongre

varsha Dongre, the suspended assistant jail superintendent of the Raipur Central Jail in Chhattisgarh, has sent a 376-page reply to a show cause notice from her superior, deputy jail superintendent RR Rai...

Sukma Police offers reward for Naxal attack perpetrators

Sukma District Police on Friday released posters declaring they would reward anyone who could provide information on the Naxalites who were behind the recent attack on a platoon of...

పాలకుల గ్రీన్ హంట్... ‍ఎదిరిస్తూ పోరాడుతున్న ఆదివాసులు.. డాక్యుమెంటరీ

పోలీసులు, అర్ద మిలటరీ బలగాలు మరో దేశం మీద దాడి చేసిన విధంగా ఈ దేశ ప్రజలపై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పదిహేనేళ్ళుగా కొనసాగుతున్న దాడి అత్యంత తీవ్రమైనదే కాక దుర్మార్గమైనది. గ్రీన్ హంట్ పేరుతో పాలకులు చేస్తున్న దాడిని ప్రజల సహకారంతో విప్లవకారులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు.

छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर

मुख्यमंत्री के गृहजिला कवर्धा में वन अमले, राजस्व, पुलिस ने बैगा आदिवासियों के आशियाने को उझाड दिया, समान घरो के बाहर फेंक दिए गए, बैगा आदिवासी महिला,बच्चो, बुढो को पिकप में भरकर अन्यंत्र जगह छोड़ दिया गया यहाँ तक उनके साथ जानवरों जैसा मारपीट भी किया गया.

Anti-Naxal forces stab 13-year old boy to death with bayonets after branding him as Maoist

A 13-year-old Somaru Pottam was allegedly stabbed to death by security forces engaged in anti-Naxalite operations in Bastar region of Chhattisgarh. Father of the Adivasi boy, Kumma Pottam, has filed a petition in the Chhattisgarh High Court seeking justice.....

పోలీసుల అరాచకాలు‍ - గ్రామంపై దాడి,బాలికపై అత్యాచారం

ఏప్రెల్ 1 వతేదీన ఉదయం 4 గంటల‌కు తమ గ్రామం పై పోలీసులు దాడి చేశారని, ఆ కుటుంభం తెలిపింది. ఇంట్లోకి హటాత్తుగా దూసుకొచ్చిన పోలీసులు అడ్డువచ్చిన వాళ్ళపై దాడి చేసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Search Engine

పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
Delhi Police Violated Human Rights Standards, Domestic Laws During Delhi Riots: Amnesty International
ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌
కంగనా అమ్మగారికి ఒక లేఖ
more..


ప్రజా